ప్రపంచములోని విలువైన ఖరీదైన వజ్రాలు - అచ్చంగా తెలుగు

ప్రపంచములోని విలువైన ఖరీదైన వజ్రాలు

Share This
ప్రపంచములోని విలువైన ఖరీదైన వజ్రాలు
అంబడిపూడి శ్యామసుందర రావు


వజ్రము అంటే ఖరీదైన రాయి కర్బనము యొక్క రూపాంతరాలలో అతి విలువైన కఠినమైన రూపము వజ్రము దీనికి ఉన్న అణు నిర్మాణము బట్టి కాంతి పరావర్తనం చెంది అత్యంత ప్రకాశవంతమైనదిగా గుర్తించబడినది ఏవిధమైన ఇతర పదార్ధాలతో చర్య పొందదు అంటే రసాయనికంగా చాలా స్థిరమైనది ఏ విధమైన వాదన లేకుండా ఖచ్చితముగా వజ్రాలు  అతి విలువైనవి అని చెప్పవచ్చు ప్రపంచవ్యాప్తముగా అటువంటి వజ్రాలు కొన్ని ఉన్నాయి అవి ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయి వాటి విలువ ఎంత మొదలైన విషయాలనుతెలుసుకుందాము ప్రతి వజ్రము వెనుక చాలా చరిత్ర ఉంటుంది ఏంతో  విలువైనవి అయినా ఈ వజ్రాలు అందరికి కలిసిరావు చాలా మంది ఈ వజ్రాల వల్ల నష్టపోయినవారు కూడాఉన్నారు (అంతఖరీదైన వజ్రాన్ని చేతిలో ఉంచుకొని కూడా)  చాలా మటుకు ఈ వజ్రాలు రాజా కుటుంబీకుల అధీనములో ఉన్నాయి వాటి గురించి వాటి విలువల గురించి వాటి చరిత్ర గురించి  తెలుసుకోవటానికి చిన్న ప్రయత్నము చేద్దాము.


1. హోప్ డైమండ్ :- దీనిని 17వ శతాబ్దములో ఇండియాలోని గనుల నుండి వెలికి తీశారు.దీనిని 1668లో ప్రాన్స్ రాజైన 14వ లూయిస్ కి అమ్మారు. అయన ఆ వజ్రాన్ని కొన్ని సంవత్సరాల తరువాత 67 క్యారెట్ల వజ్రముగా రీ కట్ చేయించాడు. 1749లో 15వ లూయిస్ ఆ వజ్రాన్ని మళ్లా రీ కట్ చేయించాడు ప్రెంచ్ విప్లవము తరువాత రాజ కుటుంబీకుల నగ నట్రా తో పాటు ప్రెంచ్ ప్రభుత్వానికి అప్పజెప్పబడింది.కానీ దురదృష్టవశాత్తు సెప్టెంబర్ 1792లో ఆ వజ్రము దొంగలించబడింది. 1830 వరకు ఆ వజ్రము ఎక్కడ ఉందొ తెలియదు 1830 లో ఇది లండన్ లోని వజ్రాల వ్యాపారి దగ్గరకు చేరింది. ఆ తరువాత1839లో ఆ వజ్రమును హెన్రి విలియమ్ హాప్ దక్కించుకున్నాడు అప్పటి నుండి ఈ వజ్రానికి హోప్ డైమండ్ అనే పేరు వచ్చింది.1909 లో ఈ వజ్రాన్ని హోప్ మరణము ఆనంతరము పియరీ కార్టార్ కి అమ్మారు ఆ తరువాత వాషింగ్టన్ లో జరిగిన వేలం పాటలో 1949లో హ్యారీ విన్స్టన్ అనే వజ్రాల వ్యాపారి కొని పదేళ్ళపాటు ప్రపంచ వ్యాప్తముగా ప్రదర్శనలు ఇప్పించాడు 1958 నుండి ఫైనల్ గా వాషింగ్టన్ డిసి లోని స్మిత్ సోనియాన్ ఇన్స్టిట్యూట్ కి చేరింది ఇది ఈ వజ్రము తన ప్రయాణములో మజిలీలు ప్రస్తుతము ఉన్న ఈ వజ్రము 45. 52 క్యారెట్ల బరువు ఉంది దీనిని సుమారు 250 మిల్లియన్ డాలర్లకు భీమా చేశారు.


2 కూలినాన్ డైమండ్ :- ఇది ఇప్పటివరకు కనుగొన్న వజ్రాలతో అతి పెద్దది దీని బరువు 3,106 క్యారెట్లు దీనిని 1905 లో సౌత్ ఆఫ్రికాలోని ప్రీమియర్ గనులనుండి వెలికి తీశారు థామస్ కూలినాన్ అనే వ్యక్తి దీనికి యజమాని కాబట్టి ఈ పేరు వచ్చింది ఈ వజ్రాన్ని 1907లో  ఇంగ్లాండ్ రాజైన 7వ ఎడ్వార్డ్ కు దాని సహజ రూపములో అంటే సాన పెట్టకుండా  కట్ చేయకుండా బహుమతిగా ఇచ్చాడు. అంస్టర్ డాం లోని సంస్థ ఐ జె అక్షర్ అనే సంస్థ ఈ వజ్రాన్ని ముక్కలుగా చేసే భాద్యత తీసుకుంది ఈ పెద్ద వజ్రాన్ని తొమ్మిది వజ్రాలుగాను ,96 9క్యారెట్ల విలువైన చిన్న వజ్రాలుగా చేశారు వీటన్నిటిలో కూలినాన్ 1, మరియు కూలినాన్  2 లు రెండు ప్రపంచములోని పెద్ద వజ్రాలుగా గుర్తించబడ్డాయి. మొదటిది 530 క్యారెట్లు దీనిని ఇంగ్లాండ్ రాజైన రెండవ చార్లెస్ రాజదండములో అమర్చారు రెండవది 317. 40 క్యారెట్లు ఇది బ్రిటిష్ ఇంపీరియల్ స్టేట్ క్రౌన్ లో ఉంది.


3. ద సెంటినరీ డైమండ్ :- సౌత్ ఆఫ్రికాలోని ప్రీమియర్  గనుల నుండి వెలికితీసిన మరో వజ్రము 273 క్యారెట్ల బరువు ఉన్న సెంటినరీ డైమండ్1986లో ఈ వజ్రము డీ బేర్స్ అనే ప్రముఖ వజ్రాల సంస్థ ద్వారా కనుగొనబడింది.  కానీ
ఈ కంపెనీ రెండేళ్లపాటు ఈ విషయాన్నీ దాచి ఉంచి ఆ సంస్థ సెంటినరీ సంవత్సరములో బహిరంగపరచి సెంటినరీ డైమండ్ గా ప్రకటించింది.సాన పెట్టని ముడి వజ్రము సుమారు 600క్యారెట్ల బరువు ఉంది కట్ చేసి పాలిష్ చేయటము వల్ల 273 క్యారెట్ల కు వచ్చింది. దీనిని 100 మిలియన్ల డాలర్లకు భీమా చేశారు. ఈ వజ్రాన్ని డీ బేర్స్ సంస్థ మరో వ్యాపారికి అమ్మినట్లు రూమర్లున్నాయి.
కానీ ఆదే  పేరుతొ కొనసాగాలని  ఒప్పందం వల్ల అదే పేరుతో కొనసాగుతుంది.అని అభిజ్ఞాల వర్గాల భోగట్టా!

4.టిఫ్ఫాని ఎల్లో డైమండ్ :-1877లో సౌత్ ఆఫ్రికాలోని కింబర్లీ గనులలో లభ్యమైన 287క్యారెట్ల ఎల్లో డైమండ్ ను చార్లెస్ లేవీస్ టిఫ్ఫాని (టిఫ్ఫాని&కో వ్యవస్థాపకుడు) కొనటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.


ఇప్పటివరకు దొరికిన ఎల్లో డైమండ్లలో ఇదే పెద్దది దీనిని కట్ చేసి పాలిష్ చేసినాక ఇది 128 క్యారెట్ల బరువు ఉంది. ఈ వజ్రాన్ని బ్రేక్ ఫాస్ట్ ఎట్ టిఫ్ఫాని అనే సినిమాలో కనిపిస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ అడ్రి హెప్ బర్న్ రిబ్బన్ రోసెట్ నెక్ లెస్ కనిపిస్తుంది. మళ్ళా టిఫ్ఫాని &కో వారి 175 వ వార్షికోత్సవం సందర్భముగా 2012లో ప్లాటినం నేక్ లెస్ లో అమర్చి ప్రదర్శించారు.ప్రస్తుతము ఈ డైమండ్ ను న్యూయార్క్ నగరంలోని కంపెనీ ఫ్లాగ్ షిప్ స్టార్ లో ప్రదర్శనకు ఉంచారు.


5. రీజెంట్ డైమండ్ :- ఈ డైమండ్ 1698లో మన దేశములోని కర్ణాటకలోగల కొల్లూర్ గనులలో దొరికింది.1877 నుండి ఈ వజ్రము ప్యారిస్ లోని ఒక మ్యూజియంలో ఉంది. దీనిని పిట్ డైమండ్ అని కూడా పిలుస్తారు ఎందు చేతనంటే ఈ వజ్రాన్ని థామస్ పిట్ అనే అప్పటి మద్రాస్ గవర్నర్ దీనిని ఇంగ్లాండ్ పంపి అక్కడ 426 క్యారెట్ల వజ్రముగా కట్ చేసి అప్పటి ప్రెంచ్ రాజు ఫిలిప్ డి ఆర్లియన్స్ కు 1717 లో బ్రిటిష్ వారి కానుకగా  అంద జేయ బడింది. 141 క్యారెట్ల వజ్రముగా కట్ చేయటానికి పూర్తిగా రెండేళ్ల పట్టింది ఆ తరువాత ప్రెంచ్ రాజుల పరంపరకు అందుటు వచ్చింది  దీని విలువ ప్రస్తుతము 62 మిలియన్ డాలర్లు.

6. ఒర్లోవ డైమండ్ :- ఈ డైమండ్ కూడా ఇండియాలోని కొల్లూరు గనులనుండి వెలికి తీయబడింది ఈ డైమండ్ మాస్కో లోని క్రెమ్లిన్ డైమంది ఫండ్ లోని రాజా దండము లో అమర్చబడి ఉంది ఇది సుమారు 787 క్యారెట్ల బరువు ఉంటుంది.డి ఒకప్పుడు అంటే దొరికిన కొత్తల్లో శ్రీరంగములోని దేవతామూర్తి కన్నుగా అమర్చారని చెపుతారు 1747 లో ఒక సైనికుడు భక్తుని రూపములో ఈ వజ్రన్నీ  గుడినుండి దొంగిలించాడు క్రమముగా చేతులు మారి ఈ వజ్రము యూరోప్ చేరింది. షాఫ్రస్ అనే వ్యాపారి ఈ వజ్రాన్ని కౌంట్ గ్రిగరి గ్రిగోరిచ్ ఒర్లోవ్ అనే రష్యన్ రాజకుటుంబికుడికి అందజేసాడుఆ అయన ఈ వజ్రాన్ని తన ప్రియురాలైన కేథరిన్ కు కానుకగా ఇచ్చాడు ఆవిడకు  3వ పీటర్ ను సింహాసనము నుండి దింపటానికి ఒర్లోవ్
సహకరించాడు.ఈ వజ్రము కూడా జార్ చక్రవర్తుల రాజ దండాన్ని అలంకరించింది దీని బరువు 189 క్యారెట్లు.


7. కోహినూర్ వజ్రము :- డైమండ్ల కధ ముగియాలంటే కోహినూర్ వజ్రము గురించి చెప్పుకోవాలి ఎందుకంటే దీనికి సుమారు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ గనులలో దొరికి దేశ విదేశాలు తిరిగి చాలా మంది రాజుల
ఆస్థానంలో ఉండి బ్రిటన్ రాణి గారి కిరీటములో చేరింది.  ఈ వజ్రము రాజ కుటుంబములో కూడా మగవారికన్నా ఆడవారి కి బాగా కలిసి వచ్చిందని చెపుతారు.ఇది ప్రస్తుతము 106 క్యారెట్ల బరువు ఉన్న వజ్రము ఇది ఒకప్పుడు ప్రపంచములోని పెద్ద వజ్రాలలో  ఒకటి సంస్కృత సాహిత్యములో ఈ వజ్రాన్ని శమంతక మణితో పోలుస్తారు.13వ శతాబ్దములో గ్వాలియర్ రాజు నుండి మొఘల్ చక్రవర్తి 1526లో దీనిని స్వాధీన పరచు కున్నాడు.ఈ విధముగా యుద్ధాలలో విజేతలకు ఈ వజ్రము లభిస్తూ వచ్చింది.చిట్టచివరకు  2000 ఇతర వజ్రాలతో పాటు బ్రిటన్ రాణి కిరీటాన్ని అలంకరించింది.

***


No comments:

Post a Comment

Pages