కనుమరుగవుతున్న ఆది సంగీతం....  - అచ్చంగా తెలుగు

కనుమరుగవుతున్న ఆది సంగీతం.... 

Share This
 కనుమరుగవుతున్న ఆది సంగీతం.... 
నయీకషిశ్


వీకెండ్స్‌లో పబ్బులకి వెళ్లే వారికి తెలిసే ఉంటుంది, లైవ్‌ మ్యూజిక్‌ ఎంత ఉర్రూతలూగిస్తుందో. హోరెత్తించే అలాంటి మ్యూజిక్‌ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ మొదటి అంతస్తులో...  
వీనులకు చేరి చేరగానా  నర్తింపచేసేలా ఉందా  డ్రమ్‌ మ్యూజిక్‌... 
సినిమాలకు సంగీతం అందించే శివమణి మనసులో స్పురిస్తుండగా అడుగులు హాలువైపుకి సాగిపోయాయి. అక్కడ తలకి పాగా, జుబ్బా ధరించిన పల్లెటూరి వాళ్లు, వారి చేతిలో నాటి కాలం వాయిద్యాలు. అందులో రంజుగా మొగుతున్న డ్రమ్‌లాంటి వాయిద్యం రుంజా... 12 మెట్ల కిన్నెర  వాయిద్యాలు సృష్టించిన సంగీతం అది. .. హంగులు లేని సాదాసీదా వాతావరణంలో ఉర్రూతలూగించే సంగీతం, సంగీత వాయిద్యం ఆశ్యర్య పరిచాయి. లయబద్దమైన ఏ సంగీతమేనా నర్తింపచేస్తుంది. మనసును హత్తుకుంటుంది అందులో సందేహమే లేదు. 
అయితే ఈ వాయిద్యాలకు రంజింప చేసే శక్తి ఉన్న, ఈ పోటీ కాలంలో నిలబడలేక కనుమరుగయ్యాయి. అలాంటి కనుమరుగైన, అవుతున్న  అపురూపమైన 124 వాయిద్యాలను చూసే , వాటి శబ్దాలను వినే, తెలుసుకునే అదృష్టం నగరవాసులకు కలిగిస్తోంది ఆది ధ్వని గిరిజన జానపద సంగీత వాద్య ప్రదర్శన. 
నవంబర్‌ 9 న నగరంలోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన ఈ ప్రదర్శన 13వ తేదీ వరకు కొనసాగుతుంది.


 కాపాడుకోవాలసినంత కాపాడుకోలేక పోయాం....
జానపద పరిశోధకుడిగా గ్రామాలన్నీ తిరుగుతున్నప్పుడు, చాలా విలువైన సాంస్కృతిక, వారసత్వ సంపద ఉందని గుర్తించాం. కథలు సేకరించాలనుకున్నప్పుడు అసలు కథలన్నీ వాయిద్య ఒగ్గుకథ, శారద కథ ఇలా వాయిద్యాల పేరుతోనే ఉన్నాయి. ఒగ్గు వాయిద్యం. వాయిద్యానికి ప్రాధాన్యాన్ని ఇచ్చారు వెనుకట. మనం దానిని పటిటంచుకోలేదు. వైవిధ్యం ఉంది. ఒక కులానికి, కొన్ని సార్లు కుటుంబానికి మాత్రమే ఆ వాయిద్యం సొంతం. వేరే ఎవరూ ఉపయోగించరు. ఇది కట్టడి కాదు. పోటీ అవసరంలేని వాతావరణం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఒక మానవీయ దృక్ఫథంతో చేశారని గమనించాలి. 

ఇంత విస్తృతమైన రాగాలు, ఆలాపనలు, నృత్యరీతులు, వాద్య కథనాలు, పద్దతులు, వాయిద్యాలు చాలా ఆశ్యర్యపరిచే విధంగా ఉన్నాయి. అటవీశాఖ ప్రశ్నలు తట్టుకోలేక పెద్ద డోళ్లు తయారీ చేయటం మానేశారు.  అనేక కారణాల వల్ల æఅంతరించిపోతున్న వాయిద్యాలు 160కి పైగా ఉండగా వాటిలో 124 సేకరించాం. వాటిని ఇక్కడ ప్రదర్శనలో ఉంచాం. వీటిలో ఒకే వాద్యం, ఒకే వాదకుడు ఉన్నవి అంతరించి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కడ్డీ వాద్యం, బుర్రవీణ, తోటి బుర్ర వాద్యం అలాంటివే. వాటిని ఇక్కడ చూడవచ్చు. ఈ వాయిద్యాలు మార్కెట్‌లో దొరకవు, వాయిద్య కారుడే వాయిద్యాన్ని తయారు  చేసుకుంటాడు. ఈ వాయిద్యాలను చూపించటమే కాదు, మ్యూజియం ఏర్పాటు చెయ్యాలనే ఆలోచన ఉంది.ఇప్పటి వరకు ప్రజలే ఈ కళాకారులను కాపాడారు. ఈ మ్యూజియం కూడా వారే సహకరిస్తారని ఆశిస్తాం.
 – తిరుమలరావు, జానపద పరిశోధకులు, వాయిద్యాల సేకర్త

 
 అంతరించి పోవటం మన దురదృష్టం  
కేవలం మన తెలంగాణ ప్రాంతంలో ఇన్ని అందమైన సంగీత పరికరాలున్నాయని తెలుసుకోవటం, చూడటం బ్యూటిఫుల్‌ ఫిలింగ్‌. వీటిలో కొన్ని వాయిద్యాలు వాయించే వాళ్లు లేకపోవటం, అంతరించి పోవటం మన దురదృష్టం.  వాయిద్య కారులు లేక పోతే ఆ వాయిద్యం వాయించటం తెలియదు. కాబట్టి ఇప్పటి కన్నా ఆయా వాయిద్యాలను ఎలా వాయించాలో రికార్డ్‌ చేసి, టీచ్‌ చేస్తే బాగుటుంది. నా సినిమా పరంగా, స్టోరీ పరంగా ఉంటే తప్పకుండా ఈ సంగీతాన్ని వాడతాను. సంగీత దర్శకులు ఈ మ్యూజిక్‌ వాద్యాలు వింటే చాలా ఉపయోగం. 
– నాగ అశ్విన్, మహానటి చిత్ర దర్శకుడు 
 లైవ్‌ ఆర్ట్‌ ఆకట్టుకుంటుంది. 
ఈ వాయిద్యాలు మన ప్రాచీనమైనవి, ప్రాథమికమైనవి. మన నాగరికతకు సంబంధించినవి.  చిన్నప్పుడు ఇంటి ముందుకు వచ్చి ఇలాంటి వాయిద కళాకారలు ప్రదర్శనలు ఇచ్చేవారు. అలా పాండవుల కథలు నన్ను చాలా ఇన్‌స్పైర్‌ చేశాయి. భీముడు, హనుమంతుడు రూపాలు అలా చిన్నప్పటి నుంచి నన్ను ఆకట్టుకున్నాయి. ఈ మధ్యే మళ్లీ పాండవుల కథ చూసినప్పుడు ఈ వయసులోనూ నన్ను ఆ కథ అంతే ఆనందపరిచింది. అంటే లైవ్‌ ఆర్ట్‌కున్న గొప్ప శక్తి ఇది. ఈ విధమైన ఆదివాసీల వాయిద్యాలను, వారి కళను కాపాడాలంటే జ్ఞానులు ఆలోచించాలి, ప్రభుత్వ సహకారంతో, ఆర్టిస్టుల తోడ్పాటుతో అంకితభావంతో పనిచేసే కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలి. – తోట వైకుంఠం, సీనియర్‌ ఆర్టిస్ట్‌ 
 మూలం ఇవేే.. 
నాటి వాయిద్యాలు నేటి అధునాతన పరికరాలకు దారి చూపాయి అని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవటం, వాటి కథలు ఒక అరుదైన అనుభవం. ఈ సంగీత వాయిద్యాలను సమకూర్చటంలో తిరుమలరావు గారు, గూడూరు మనోజ పడ్డ  శ్రమ తప్పక గుర్తించాలి. ఈ వాయిద్యాలను ముట్టుకుని వాటిని వాయించే తీరుని తెలుసుకునేందుకు నేను, నాతో పాటు చాలా మంది ప్రయత్నిస్తుంటం ఆనందంగా అనిపించింది. ఈ సౌండ్స్‌ ఆదిమం, స్వచ్ఛం అనిపించాయి. -   సినీ దర్శకులు శేఖర్‌ కమ్ముల  
 
మరిన్ని ప్రత్యేకతలు...
ఆభరణాలు కావు... ఇక్కట చేతికి, కాలికి, మెడకి, నడుంకి ధరించే ఆభరణాలుగా కనిపిస్తున్న వాయిద్యాలు ప్రదర్శనలోన్నాయి.  వాటిని ధరించి, నర్తిస్తూ, వాయిస్తారు. 
కికిరి, కిన్నెర, దుబ్బు, రుంజ, సన్నాయి, బుర్రవీణ కళాకారులు వస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. 
***
 

No comments:

Post a Comment

Pages