ఈ దారి మనసైనది - 24 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 24
                                                                            అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా వెళ్తారు అందరూ. సెలవలు ముగించుకుని తిరిగి వస్తారు.)  
 దసరా హాలిడేస్ అయ్యాక ....

ఎం.జి.ఎం హెచ్ అండ్ కె.ఎం.సిగోల్డెన్జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మెడికల్ ఎగ్జిబిషన్కి ప్రిపేర్ కావలందిగాపిన్సిపాల్ గారు నోటీసు పంపారు
నవంబర్ 11న ఎగ్జిబిషన్ మొదలైంది.
ఇనాగరేషన్ ని ఆరోగ్య శాఖామంత్రిభారీ నీటి పారుదల శాఖ మంత్రి ప్రారంభించారు.
కాకతీయ వైద్య కళాశాలలో వైద్యవిజ్ఞాన ప్రదర్శన మొదలైన క్షణం నుండి జిల్లాలో వున్న అన్ని కళాశాలల (ఇంజనీరింగ్,బి. ఫార్మసి, పి.జి డిగ్రీ, ఇంటర్)విద్యార్థులు, స్కూల్ పిల్లలు, ఇంకా ఇంట్రస్ట్ వున్న స్థానికులు వస్తున్నారు. వాళ్లతో పాటు అదే కాలేజిలో చదివిన వైద్య విద్యార్ధులు కూడ చూడటానికి వచ్చారు అందరు వాటిని ఇంట్రస్ట్ గా  చూస్తున్నవైద్యవిద్యార్థులు మాత్రం మళ్లీ వాటినే చూడాలా అన్నట్లుగా ఫీలయ్యారు వైద్య విద్యార్థులు అలా ఫీలవుతున్నా- సామాన్య ప్రజలు చూడాల్సిన అవశ్యకత వున్నందున అందరూ వస్తున్నారు. ఆ కాలేజి పెట్టి అప్పటికి ఏభై సంవత్సరాలు కావడంతో ఏర్పాటు చేసిన ప్రదర్శన అది.
కాలేజి గేటు నుండి మొదలైన 'క్యూ’ కాలేజి ఎంట్రన్స్ వరకు వుండడంతో ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యటానికి సి.ఐ. ఎస్.ఐ . ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్.పి గారి పర్మిషన్తోనియమితులయ్యారు.
తరలివస్తున్న సందర్శకులకు వివరించేపనిలోవాలెంటీర్లగా వున్న వైద్య విద్యార్థులు మునిగిపోయారు.
అందువల్లనే ... అనురాగ్ దీక్షితను కలుసుకునే అవకాశం లేకుండా అయింది. వీలు దొరికినప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు.
సైన్స్ ఎగ్జిబిషన్ చూడటానికి అనురాగ్ వాళ్ల పేరెంట్స్ వచ్చారుకాలేజిలోకి తీసుకెళ్లాడు.
అనురాగ్ తన పేరెంట్స్ ని గేటుదగ్గర రిసీవ్ చేసుకొని డైరెక్ట్ గా కాలేజీలోపలకి వెళ్లగానే దీక్షితకి కాల్ చేసి తన పేరెంట్స్ వచ్చినట్ల చెప్పిత్వరగా రమ్మని పిలిచాడు అనురాగ్.
 వెంటనే వచ్చింది దీక్షిత .
దీక్షిత రాగానే వాళ్ల పేరెంట్స్ కి  పరిచయం చేశాడు.
వాళ్లనలా పరిచయం చేస్తున్నటైంలోమన్వితచూసింది.
మన్వితకి ప్రియబాంధవి అంటే చాలా ఇష్టం. చూడక చాలా రోజులైంది.ఆమెవస్తున్నట్లు చిన్న ఇన్సర్మేషన్ కూడా ఇవ్వలేదు అనురాగ్ దీక్షిత్రకి కాల్ చేసి రప్పించుకొని పరిచయం చేస్తుంటే కళ్లవెంట నీళ్లు తిరిగాయి. వెంటనే అక్కడ నుండి వెళ్లిపోతున్న మన్వితను అనురాగ్ చూడలేదు. ప్రియబాంధవి చూసింది.
 “మన్విత నా దగ్గరికిరాకుండా, నన్ను చూసికూడా అలా వెళ్లిపోతుందేం? వెల్లిపిలువు అనురాగ్" అంది ప్రియబాంధవి.
తల తిప్పి వెళ్లి పోతున్న మన్విత వైపు చూశాడు అనురాగ్
వెంటనే దీక్షిత వైపు చూస్తూ...
 "మా పేరెంట్స్ ని తీసికెళ్లి ఎగ్జిబిషన్ చూపించి, ఎక్స్ ప్లెయిన్ చెయ్యి దీక్షా! నేనిప్పడేవస్తాను." అంటూమన్విత వెళ్లిన వైపు వెళ్లాడు అనురాగ్.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages