శ్రీధరమాధురి - 67 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 67

Share This

శ్రీధరమాధురి - 67

                      (పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)
అత్యాశ, ప్రశాంతత కలిసి సాగలేవు. మీరు అత్యాశ కలవారైతే, శాంతి కోసం తపించకండి. ఒకవేళ మీరు ప్రశాంతంగా ఉంటే, అత్యాశకు ఎరగా మారకండి.

***

మనం అందరితో దెబ్బలాటలు పెట్టుకుంటూనే ఉండాలా? కాస్త కుదురుకుని, మానవాళికి, ప్రపంచానికి పెద్ద ఎత్తున పనికొచ్చే పనులేమీ చెయ్యలేమా?

***

ఆమె – గురూజీ, ఈ పువ్వు చాలా అందంగా ఉంది. కదా?

నేను – నిజమేనమ్మా, ఇది చాలా అందంగా ఉంది. దీన్ని మొక్కకే ఉండనివ్వచ్చు కదా?

***

ఇతరుల గతాన్ని మీరు తవ్వుతూ ఉంటే, చాలా అస్థిపంజరాలు బయట పడడం సహజం. గతం అసహ్యంగా ఉంటుందని బాగా తెలిసి కూడా, దాన్లోకి  వెళ్ళడం ఎందుకు? మీకు చెందినా, ఇతరులకు చెందినా మురికిగుంట ఎప్పుడూ వాసన వస్తూనే ఉంటుంది. చాలామంది విషయంలో గతం ఒక మురికిగుంట వంటిదే. అది మీకు చెందినా, ఇతరులకు చెందినా, దాన్ని తవ్వే ప్రయత్నం చెయ్యకండి.

***

మనం ఇతరుల చర్యలను విమర్శించేందుకు ఈ ప్రపంచంలోకి రాలేదు. మనం ఇతరుల చర్యలకు అతీతంగా వారిని ఏ నిబంధనలూ లేకుండా ప్రేమించేందుకే ఈ ప్రపంచంలోకి వచ్చాము. 


***

చాలాసార్లు కొందరు మీకు బదులు ఇచ్చేటప్పుడు  యుక్తిగా వ్యవహరిస్తారు, ఎందుకంటే మీ భావాలతో వ్యతిరేకించి, మిమ్మల్ని గాయపరచడం వారికి ఇష్టం లేదు.


***

మా రోజుల్లో డేటింగ్ అనేదే లేదు. నాకు పెళ్లి చేసారు. మాకు ఎప్పుడూ మాట్లాడుకోడానికి, తెలుసుకోడానికి ఏదో ఒకటి ఉండేది. నేను అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాను, అది నేటి వరకూ కొనసాగుతోంది. ఒక్క అబద్ధాన్ని కప్పి పుచ్చేందుకు నేను చాలా అబద్ధాలు చెప్పాల్సి వచ్చేది. కాని నా భార్య, ఇప్పుడు నన్ను నిజంగా మరింత బాగా అర్ధం చేసుకుని, అంగీకరించింది. అందుకే జీవితం ఆనందమయంగా ఉంది.


ఈ రోజుల్లో డేటింగ్ ఉంది. పెళ్ళికి ముందే కొన్నేళ్ళ పాటు అన్నీ మాట్లాడేసుకుంటారు. కనుక, పెళ్లైయ్యాకా మాటలు ఉండవు.  డేటింగ్ లో మాట్లాడిన దానికి, పెళ్లైయ్యాకా చెప్పే మాటలకు, ఎంటువంటి పొంతనా ఉండదు. అందుకే వారు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. జీవితం నరకంగా మారుతుంది. చివరికి విడాకులకు దారి తీస్తుంది.


మనం మళ్ళీ వెనుకటి రోజులకు వెళ్తే బాగుంటుందని నేడు నాకు అనిపిస్తుంది. అప్పుడు మనం మాట్లాడుకోడానికి, పరిశోధించడానికి, ఒప్పుకోకపోవడానికి, మళ్ళీ సర్దుకోవడానికి, మళ్ళీ కలిసి జీవించడానికి ఏదైనా ఉంటుంది. అంతేకాక, పెళ్ళికి ముందు ఏమీ చెప్పకుండా ఉండే ప్రయోజనం కూడా మీకు ఉంటుంది.


పెళ్లికిముందే  అన్నీ చెప్పేసి, అన్నీ తెలుసుకోవడం అన్నదానికి నిజంగానే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, ఎన్నడూ నిజం మాట్లాడని నావంటి వారికి. హ హ హ. 
****

No comments:

Post a Comment

Pages