శివం - 50 - అచ్చంగా తెలుగు
శివం - 50
రాజ కార్తీక్      

(గత  50 ఎపిసోడ్స్ గా  శివం - శివుడే చెబ్తున్న కథలను చదివి మీరు ఇస్తున్న ప్రోత్సహం మరువలేనిది. దీనికి నేను మొదటిగా ధన్యవాదాలు చెప్పాల్సింది ఆ పరమేశ్వరుడికి, తర్వాత నా తల్లి తండ్రి కుటుంబం, గురువుకి ,అందరికన్నా ఎక్కువగా నేను ఆనందంగా నా అభిమానాన్ని తెలియజేయాల్సింది శ్రీమతి భావరాజు పద్మిని గారికి. ఎల్లప్పుడూ వీళ్ళందరికి రుణపడి ఉంటాను. ఎప్పటిలాగానే మరొక్కమారు ఈ కథల గొప్పతనం అంతా  శివుడిది మాత్రమే అని, నేను కేవలం నిమిత్తమాత్రుడనని, సంకల్పం సంకలనం అంత ఆ మహాదేవుడిదే నని చెబుతున్నాను. ఇంకా చాలా మంది  హృదయాలకు హత్తుకునేలా శివభక్తి కధలను ఇంకా అందిస్తానని ..ఆశిస్తున్నా  ...అంతా శివోహం..శివమయం ..శివం)
(జరిగిన కధ : కల్పన భారతి  ప్రవర్తనను, ఆమె స్వభావాన్ని తెల్సుకున్నాము. ఇంతలో వచ్చింది తన జీవితంలో ఎప్పుడూ  వినకూడదు అనుకునే కబురు ...తర్వాత )
ఆలయంలో జరుగుతున్న  సంగీత పాఠం వద్దకు ఎవరో వచ్చారు ...

వారు "అమ్మ ! నువ్వు ఇంటికి రావాలి ..నీ కుటుంబం ..."
కీర్తన మద్యలో ఆపని కల్పన భారతి శ్రావ్యంగా ఆలపిస్తుంది, వీణ గానంతో మేళవిస్తూ.
మరొకరు మాత్రం "అమ్మ, నీ భర్త బిడ్డ  ఇకలేరమ్మ ,వారి మృత దేహాలు ఇంటికి వచ్చాయి" అన్నారు.
అక్కడ ఉన్న చాలామంది కల్పనకు వ్యతిరేకులే. ఎవరో కొంతమంది మాత్రం    ఆమెతో వాగ్వివాదం పెట్టుకోని వారు, తమ ఆత్మాభిమానం దెబ్బతింటుందని   కలహం పెట్టుకోని వారు మాత్రమే, ఆమె గురించి మాట్లాడుతున్నారు ...
కల్పన పాడుతున్న కీర్తనలో శ్రావ్యత లోపించి ,అంతులేని బాధ ఆవరించింది. 
తన చేతిలో ఉన్న వీణ తెగి కిందపడి ముక్కలు అయ్యింది. తన కళ్ళ వెంట ఆపుకున్న ఆపని నీరు ఉబికి వచ్చింది.

ఒక్కసారి గర్బగుడిలో ఉన్న నన్ను తీవ్రమైన చూపుతో పరికించింది.
వారు "పదమ్మ కల్పన భారతి ..గుడిలో నుండి " అంటున్న స్వరం, కదలమని తన మనసుకి చెప్తుంది.
గుండె బాదుకొని ఏడిచింది, "అయ్యో పరమేశ్వర ..నేను ఏ  పాపం చేశాను?" అని.
కానీ తన అంతరాత్మ చెప్పింది తనకు "తన పని కానిచ్చుకోవటం కోసం ..నా బిడ్డ మీద ఒట్టు ఒట్టు అని తెగ వేసేది .." అని.
కల్పన  "నేను తట్టుకోలేకపోతున్న, ఇదంత పీడ కల అయితే బాగుండు " అంటూ ఏడవసాగింది.
ఇంతలో వర్షం కురవటం అరంబించింది ...ఎప్పుడు కదలని తన బొట్టు ..ఇప్పుడు ఆ వర్షపు చుక్కలకు రాలిపోతుంది ..వీణ తగిలి కింద పడటం వల్ల  తన చేతిలోనే గాజులు పగిలిపోయాయి.
అక్కడ కొంతమంది కల్పన వ్యతిరేకులు మాత్రం "ఈవిడ చెప్పిన అబద్దాలకు, లౌక్యానికి ..ఇప్పుడు ఏమి చేస్తుందో చూడాలి " అనుకుంటున్నారు. 
వర్షం బాగా పెద్దది గా మారింది.
కల్పనకు ఏమి అర్ధం కావటంలేదు. తన  మనసు అంతా భారం అయ్యింది. జోరు వర్షంలో, హోరుగాలిలో తన కన్నీటిని దాచుకుంటూ, దార్లో తన గతం గుర్తు చేసుకుంది.
అవును తను పుట్టగానే  తన తల్లి ని కోల్పోయింది . ఆదరణ లేని తండ్రి వల్ల  చిన్న వయసులో ఏ ముద్దుకు నోచుకోకుండా, తన బంధువల ఇళ్ళలో కర్కశంగా పెరిగింది. ఆ కర్కశం వల్ల తనకి మనుషులందరు ఒకలాగా ఉంటారు అనుకున్నది.
ప్రతి చిన్న విషయానికి తనదైన శైలి లో స్పందించేది.

అప్పుడు కొంతమంది మాటలు గుర్తుకువచ్చాయి  తనకు  "దిక్కులేనివారు అని చేరదీస్తే వాళ్ళ దగ్గరే పొగరు చూపిస్తుంది" అని .తనకు ఎంతో ఇష్టమైన అక్కని కూడా లెక్కలేకుండా మాట్లాడి, ఆత్మాభిమానం అనేది ఈ పిచ్చితల్లి .."
తను  పెళ్లి వయసుకు రాగానే, తనకు ఎవరు బాద్యతగా  పెళ్లి చేయకపోయే సరికి, తనుకు నచ్చిన  ఒక సంబంధం చేసుకుంది ...స్త్రీ కి ఉండే సహజ వైఖరితో, తన స్వార్ధం కోసం తన కుటుంబాన్ని వెనక వేసుకువచ్చేది.
అడుగు అడుగు ముందుకు పడుతుంది కల్పన భారతిది... తన ప్రతి అడుగులో తనకి తను చేసిన  దురభిమాన  ఘోరాలు గుర్తుకు రాసాగాయి. 
తనకు గుర్తుకువచ్చిన మరో మాట - ఎవరో ఒకరు తన భర్త ప్రాణాన్ని  కాపాడితే, అతన్ని చులకన  చేసి, తన అవసరం తీర్చుకొని," నువ్వు చేసింది ఏముంది నాకు ?" అని అతన్ని హేళనగా మాట్లాడింది. అతని మొహం ముందు తన ఇల్లు వాకిలి తలుపు వేసింది . అతను నొచ్చుకుని  వెళ్ళిపోయాడు. అతని కళ్ళలో నీరు తిరిగాయి.
మరొక మాట తన మదిలో మెదిలింది.
"తన జాతకంలో వైదవ్యం ఉంది అని ఎవరో ఒకతను చెప్పి,  జాగ్రత్తగా చూస్కోమని చెప్పగా, 'నీక ఏమి తెల్సు? నీవు గొప్పవాడివి అయితే నీ జీవితాన్ని మార్చుకో,' అని హేళనగా చెప్పేది.
 " మితిమీరిన  కోరికల వల్ల భ్రూణ  హత్యలు చేసిన పాపమా? "
"కృతజ్ఞత లేకపోవటం వల్లనా ?"
"విశ్వాసం లేకపోవటం వల్లా ?" 
పక్క నడుస్తున్న వారు మాత్రం , "అమ్మ నీ బిడ్డను కూడా కాపాడాలని చూసాము. కొనప్రాణం ఉండగా పట్టుకున్నాము .కానీ ఆ దేవుడు దయ చూపలేదు తల్లి " అన్నారు.

కల్పన మరింత వెక్కి పెట్టి ఏడిచింది.
"దేవుడా ...నా భర్త, బిడ్డ ను తీసుకువెళ్ళి ఏమి చేస్తావు? నన్ను తీసుకువెళ్ళచ్చు కదా " అని రోదించసాగింది.

కల్పన మీదకోపం ఉన్న వారు మాత్రం వాళ్ళ చూపులతో, " ఆ దేవుడు భలే శిక్ష వేసాడు ..ఇప్పుడు చెప్పు ఎప్పుడూ  మాకో చట్టం , మీ కుటుంబానికి ఒక చట్టం అంటావు ..కదా " అన్న విధంగా చూస్తున్నారు. ఆ చూపు కల్పనకే అర్ధం అయ్యింది ..

ఇప్పుడు అర్ధం అవుతోంది కల్పన కు .."జాలి ఎంత గొప్పదో."
అంతే తను తన ఇంటికి నడక సాగిస్తుంది.
తన పక్క వచ్చేవారు మాత్రం "తల్లి రెండు శవాలు ఎక్కువ సేపు ఉండవమ్మ ,తొందరగా చివరి చూపు చూసుకోవాలి పదమ్మ "అంటున్నారు.

అటువైపు చూసింది ఇప్పుడు కల్పన. ఆ  మాట్లాడే వారికి తరచుగా తాను గుడిలో ప్రసాదం తీసుకువచ్చి ఇచ్చి, ఆకలి తీరుస్తుంది.
ఒక చిన్న సాయానికి వీరు ఇంతలా తన కోసం దుఃఖిస్తున్నారు.
కానీ తను చేసిన పనులను చూసి, ఎంతో మంది తనమీద కోపం పెంచుకోవటంలో తప్పు ఏముందని ?

వర్షం వల్ల పోగైన  నీటి మడుగులో తన ప్రతిబింబాన్ని చూసుకుంది కల్పన. 
తన నుదిటి మీద బొట్టు వర్షం వలన పూర్తిగా పోయింది. పెట్టుకోవాలన్నా ఇక  దొరకదు. తను అనుకున్నది ఇదేనేమో...  ప్రకృతి నేర్పిన పాఠం.

అంతా బాగుంటే ఈరోజు తను వ్రతం చేసుకోవటానికి కావాల్సిన సామాగ్రి  తీసుకువెళ్ళాలి. కానీ ఆ దేవుడు అసలు జీవితంలో వ్రతంతో పని లేకుండా చేసాడే అని అనుకుంటున్నది బాధగా 
ఆ నోటా ఈ నోటా  చేరి కల్పన కి జరిగిన విషాదం ఊరంతా చేరింది ..
(సశేషం)

No comments:

Post a Comment

Pages