ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ,లోతైన సముద్రాలను ఈదిన సాహస నారీ మణులు - అచ్చంగా తెలుగు

ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ,లోతైన సముద్రాలను ఈదిన సాహస నారీ మణులు

Share This
ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ,లోతైన సముద్రాలను ఈదిన సాహస నారీ మణులు
అంబడిపూడి శ్యామసుందర రావు  

పర్వతారోహణ, సముద్రాలలో ఈదటం,స్కైయింగ్ ,బంగి జంపింగ్  వంటివి సాహసిక క్రీడలు అటువంటి ప్రమాదకరమైన క్రీడలలోరాణించి మగవారికి ఏమాత్రము తీసిపోమని వారి సత్తాను ఋజువు చేసుకున్నా భారతీయ సాహస నారీమణుల గురించి తెలుసుకుందాము ఎందుకంటే వారి విజయ గాధలు భవిష్యత్తు తరలవారికి స్ఫూర్తిగా నిలుస్తాయి దురదృష్ట వశాత్తు మన దేశములో క్రికెట్ క్రీడాకారులకు ఉన్నంత పేరు ప్రఖ్యాతులు డబ్బు ఇతర క్రేడాకారులకు లభించటం లేదు వారికి సరిఅయిన గుర్తింపు ప్రోత్సాహము లేకపోవటం వల్ల అటువంటి క్రీడల పట్ల యువతి యువకులు ఆసక్తి చూపటం లేదు అరుదైన రంగాలైన పర్వతారోహణ ,సముద్రాలలో ఈత మొదలైన క్రీడలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారులను అందునా మహిళా క్రీడాకారుణుల గురించి తెలుసుకోవటము నేటి  యువతకు ఎంతైనా అవసరము వారి విజయాలు యువతలో స్ఫూర్తిని నింపుతాయి సాధారణముగా చాలాకాలము నుండి సమాజములో ప్రతి రంగములో స్త్రీ పురుష వివక్షత కొనసాగుతూనే ఉంది ఆడపిల్లలు అనుకువగా ఇంటి పట్టునే ఉండాలి అని వాదించే ప్రముఖులు నేటికీ ఉన్నారు. చాలా రంగాలలో నేటికీ పురుషాధిక్యత కొనసాగుతూనే ఉంది చదువుల్లోకూడా ఆడపిల్లలు హ్యుమానిటీస్ అంటే బిఎ లాంటి డిగ్రీలను ఎన్నుకోవాల్సి వస్తుంది.ఆడవారు ప్రపంచ జనాభాలో 51% ఉన్నప్పటికీ అన్ని రంగాలలో వారికి సరిఅయిన ప్రాతినిధ్యము లేదు. 
మనము సాహస క్రీడల గురించి చెప్పుకొనేటప్పుడు మగవారి పేర్లే వినిపిస్తాయి. కానీ ఈ మధ్య కాలములో ఈ సంప్రదాయానికి తెర దింపుతూ స్త్రీలు కూడా ఈ రంగాలలో అంటే సాహసక్రీడలలో పాల్గొని వారు మగవారికి ఏమాత్రము తీసి పొమ్మని రుజువు చేసుకుంటున్నారు ఈ ప్రయత్నాలలో వారు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న వాటిని దృఢ సంకల్పంతో అధిగమించి వారి ఆశయాలను నెరవేర్చుకుంటున్నారు. వారు వారి విజయ సాధనకు పడ్డ శ్రమ భావి తరాలవారికి మార్గదర్శకంగా ఉంటుంది.భారత దేశ ఖ్యాతిని దేశ విదేశాలలో ఇనుమడింప జేసిన కొంతమంది సాహస  క్రేడాకారిణులగురించి తెలుసుకుందాము.

1. బచేంద్రి పాల్:-ఈ విడ ఒక పర్వతారోహకురాలు 1984లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన మొట్టమొదటి స్త్రీగా పేరు ప్రఖ్యాతులను గడించింది 12ఏళ్ల వయస్సులోనే పర్వాతారోహణ పట్ల ఆసక్తిని పెంచుతుంది.స్కూలు పిక్నిక్ కు వెళ్ళినప్పుడే స్నేహితురాళ్ళతో కలిసి 13,123 ఆడుగుల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించింది అప్పటినుండి తన భవిష్యత్తు పర్వతాలను అధిరోహించటము మీదే అని తెలుసుకుంది ఆవిడా తన పర్వతారోహణ కెరీర్ లో అనేక అవార్డులను సాధించింది వీటిలో 1985లో పద్మ శ్రీ,,1986లో అర్జున అవార్డు ఉన్నాయి బచేంద్రి పాల్ విజయగాధలు స్త్రీలు ఏ రంగములోనైనా కృషి చేస్తే పైకిరాగలరు అని ఋజువు చేస్తున్నాయి.

2.అరుణిమ సిన్హా :-అరుణిమ సిన్హా మన ప్రశంసలు అభినందనలకు పూర్తిగా అర్హురాలు ఎందుకంటే ఆవిడా కృత్రిమ చెక్క కాలుతో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి మహిళ ఈవిడ మొదట వాలీబాల్ నేషనల్ ప్లేయర్ కానీ రైలు లో ప్రయాణిస్తున్నప్పుడు దొంగలు ఆవిడ పర్స్ బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నములో రైలు లో నుంచి ఆవిడను తోసి వేసినప్పుడు రైలు పట్టాల మీద పడటము,వేరొక రైలు ఆవిడ  కాలు మీదగా వెళ్ళటం వలన కాలును డాక్టర్లు తీసివేయవలసి వచ్చింది.తన అంగవైకల్యానికి కృంగిపోకుండా పర్వతారోహణ గురించి తెలుసుకొని తన కృత్రిమ కాలుతో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించింది ఈ ఘన విజయము సాధించిన తరువాత "బార్న్ఎగైన్ ఆన్ మౌంటైన్ "(పర్వతాలలో మళ్లి పుట్టుక) అనే తన స్వీయ విజయ గాధను వ్రాసింది.2015లో ఆవిడను ప్రభుత్వమూ పద్మశ్రీతో సత్కరించింది జీవితములో ఎటువంటి కష్టాలు వచ్చిన ధైర్యముగా వాటిని ఎదుర్కొని అంగవైకల్యాన్ని సైతము లెక్క చేయకుండా కల ను సాకారం చేసుకోవచ్చు అని ఋజువు చేసి ఎందరో అభిమానులకు స్ఫూర్తిగా నిలిచినా మహిళ అరుణిమ సిన్హా

3.భక్తి శర్మ : ఈవిడ ఈతలో ప్రపంచ  రికార్డు సాధించిన మహిళ. ఒక డిగ్రి సెంటీగ్రేడ్ చలిలో అంటార్కటిక్ సముద్రము లో  1. 4 మైళ్ళ దూరాన్ని 52 నిముషాల్లో ఈది ప్రపంచరికార్డు సాధించిన మహిళ భక్తి శర్మ. ఈ విజయాన్ని చిన్న వయస్సులో సాధించిన తోలి ఆసియన్ మహిళ ఈవిడే. ఈవిడ నాలుగు సముద్రాలను,ఎనిమిది చానళ్లను ఈది ప్రపంచ రికార్డు స్థాపించింది. ఈవిడకు ప్రభుత్వము టెన్సింగ్ నార్కే నేషనల్ అవార్డు ఇచ్చి సత్కరించింది

4. అరతి  సాహ :- 1959.సెప్టెంబర్ 29న ఇంగ్లిష్ ఛానల్ ను ఈదిన తొలి భారతీయురాలిగా రికార్డ్ కెక్కిన మహిళ అరతి సాహ  ఈవిడ 42 మైళ్ళ దూరాన్ని 16 గంటల 20 నిముషాలలో  ఇంగ్లిష్ ఛానల్ ను వేగముగా  ఈదిన తొలి ఏషియన్ మహిళగా పేరుసంపాదించింది. బాల్యము నుండే ఈఆటపట్ల అభిమానాన్ని చూపించేది తన కెరీర్ లో 22 స్టేట్ కాంపిటీషన్స్ లో పాల్గొని బహుమతులు గెలుచుకుంది అన్ని పోటీల్లో రికార్డులను నెలకొల్పింది. దురదుష్ట వశాత్తు 1994లో కామెర్లు వ్యాధి వలన చనిపోయింది ఆవిడ  మరణానంతరము ప్రభుత్వము ఆవిడా జ్ఞాపకార్ధము పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది ఈ రోజుకు ఈత పోటీలలో ఆవిడా చాలా మంది ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచింది.

5. ప్రేమలత అగర్వాల్:- చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకొని 35 ఏళ్ల వయస్సులో బచేంద్రి పాల్ ను కలిసి పర్వతారోహణపై మక్కువ పెంచుకొని తన అమోఘమైన విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు పొందిన మహిళా ఈ ప్రేమలత అగర్వాల్ బచేంద్రి పాల్ ను కలిసినాక సాహస కృత్యాలపై మక్కువ పెంచుకొని మౌంటనీరింగ్ కోర్స్ లో శిక్షణ తీసుకోని 2011లో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించింది అంతటితో ఆగకుండా తరువాతి సంవత్సరాలలో  ఏడు  ఖండాలలోని ఏడు  ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించింది ఆవిడ  అధిరోహించిన పర్వతాల లిస్ట్ లో ఆఫ్రికాలోని కిలిమంజారో,నార్త్ అమెరికాలోని మెక్ అంటార్కటికలోని విన్సన్ ,యురోప్ లోని ఎల్ బ్రుస్ ,సౌత్ అమెరికా లోని అకున్ కాగువ మొదలైనవి ఉన్నాయి ఈ పర్వతారోహణలను 48ఏళ్ల వయస్సు వచ్చేనాటికి పూర్తిచేసింది

6. కృష్ణా పాటిల్ :-19 ఏళ్ల వయస్సుకే  మే 2009 లో మౌంట్ ఎవరెస్టు ను అధిరోహించింది. అంటార్కటికాలోని,సౌత్ అమెరికాలోని యూరోప్ లోని  ఎత్తైన పర్వతశిఖరాలను అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళా ఈవిడే. వీటితోపాటు ఏడూ ఖండాలలోని ఆరు ఎత్తైన శిఖరాలను కూడా అధిరోహించింది.పర్వాతారోహకురాలిగా మాత్రమే కాకుండా  ఔత్సాహిక సైకిలిస్ట్ గాకుండా ఈవిడ పేరు తెచ్చుకుంది .ఉమెన్స్అడ్వెంచర్ నెట్ వర్క్ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా చేరి కలకత్తా నుండి కన్యాకుమారి వరకు అంటే 3000 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీలో పాల్గొన్నది. ఈ సాహస కృత్యాలతో పాటు తన చదువును(ఎమ్ బి ఏ )పూణే విశ్వవిద్యాలయములో కొనసాగించింది. రాఫ్టింగ్ పేరా గ్లైడింగ్, రోయింగ్, గుర్రపు స్వారీ వంటి సాహస  క్రీడలలోకూడా ఈవిడ కు ప్రవేశము ఉంది

7.డిక్కీ డొలమ :-బాల్యము నుండి సాహస క్రీడల పట్ల గల అభిమానముతో 1984 కల్లా ఎవరెస్టు అధిరోహించిన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. స్కైయింగ్ లో కూడా మంచి ప్రావీణ్యము ఉంది బేసిక్ స్కయింగ్  కోర్స్ లకు స్కాలర్షిప్ గెలుచుకుంది. కానీ చదువుకు ఆటంకము వస్తుంది అని తల్లిదండ్రులు ఈ అవకాశమును వద్దని చెప్పారు. స్కైయింగ్ అండ్ మౌంటెనీరింగ్,మనాలి లోని సీనియర్ స్కయింగ్ ఇన్స్ట్రక్టర్ డోలమ తల్లిదండ్రులకు క లేఖ వ్రాస్తూ డొలమ ఆశలను ఆశయాలను ప్రోత్సహించి స్కైయింగ్ కోర్స్ లో చేర్పించవలసినదిగా రిక్వెస్ట్ చేశాడు స్కైయింగ్ కోర్స్ పూర్తిచేసినవెంటనే బేసిక్ మౌంటెనీరింజి లో  కూడా శిక్షణ తీసుకుంది,అడ్వాన్స్ డ్ మౌంటెనీరింగ్ లో శిక్షణ లేకుండానే కేవలము  బేసిక్ మౌంటెనీరింగ్ శిక్షణతోనే ఎవరెస్టు అధిరోహించిన మహిళగా చరిత్రకెక్కింది.

8.రీనా కౌశల్ ధర్మశక్తు :- కాపెర్సకి కామన్ వెల్త్ అంటార్కటిక్ ఎక్స్పెడిషన్ బృందంలోని ఎనిమిది మంది సభ్యులలో రీనా కౌశల్ భారదేశం ప్రతినిధి ఈ ఎక్స్పీడీషన్ లో -30 డిగ్రీల గడ్డకట్టే చలిలో అనేక ఇబ్బందులు పడి 900 కిలోమీటర్ల దూరాన్ని అంటార్కటికలో స్కయింగ్ చేస్తూ సౌత్ పోల్ చేరినది సౌత్ పోల్ కు ట్రేడ్ మార్క్ అయిన మిర్రర్ బాల్  కు 2009 డిశంబర్,30 అర్ధరాత్రికి చేరుకుంది    ఈవిడ డిల్లీలోని ఫ్రీలాన్స్ అవుట్ డోర్ మౌంటెనీరింగ్ ఇన్స్ట్రక్టర్ సౌత్ పోల్ లో స్కైయింగ్ చేసిన మొట్ట మొదటి భారతీయ మహిళ

9.అర్చన సర్దానా :- భారత దేశములోని మొత్తమద్దతి సివిలియన్ బేస్ జంపర్ మరియు స్కై డైవర్.  మొత్తము ఆవిడ తన  కెరీర్ లో 300 స్కైడైప్ లు,60 నీటిలోపల డైవ్ లు అనేక బేస్ డైవ్ లు ప్రపంచవ్యాప్తముగా చేసిన ధీర మహిళ బాల్యములో ఇంట ధైర్య సాహాసాలు చూపించకపోయిన తరువాతి దశలలో ఈరకమైన ధైర్య  ప్రదర్శించింది మొదటిసారిగా తన భర్తతో వాక్ తాన్(నడకపోటీలు) లో పాల్గొన్నది అప్పటి నుంచి ఆవిడ  వెనుతిరిగి చూసు కోలేదు అప్పటినుంచి సాహస క్రీడలపై ఆసక్తి  పెంచుకున్నది ప్రస్తుతము ఆవిడ  స్కైడైవర్ గాను బంగి జంపర్ గాను బేస్ జంపర్ గాను స్కూబా డైవర్ గాను సర్టిఫికెట్ పొందిన వ్యక్తి  ప్రస్తుతము మౌంట్ ఎవరెస్టు,మరియు ఢిల్లీ పీతాంబర టవర్స్ నుండి దూకాలని ఆవిడ కోరిక నెరవేరుతుందని ఆశిద్దాము

ఈవిధముగా మనము చెప్పుకున్న ప్రతి మహిళాది ఒక సాహస గాధ ప్రతి స్త్రీ,తన కలలను సాకారం చేసు కోవటానికి స్త్రీ పురుష వివక్షతను అదిగ మించి   విజయాలను సాధించినవారే వీరి గాధలన్ని ఒక విషయాన్ని స్పష్టముగా చెపుతాయి అది యేమిటి అంటే "మీరు  కలలు కంటే ఆ కలలను నిజము చేసుకోవటానికి దృఢ సంకల్పంతో కృషి చేయండి అశయాలను  మధ్యలో వదిలివేయవద్దు. "
***


No comments:

Post a Comment

Pages