ప్రేమను గౌరవించే రోజు ప్రేమికుల రోజు - అచ్చంగా తెలుగు

ప్రేమను గౌరవించే రోజు ప్రేమికుల రోజు

Share This
ప్రేమను గౌరవించే రోజు ప్రేమికుల రోజు
పి.వి.ఎల్.సుజాత


'వాలెంటైన్స్ డే' ఫిబ్రవరి14' న జరుపుకునే ప్రేమికుల పెద్ద పండగ. అందుకే ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజు అంటాము.

నాగరిక ప్రేమ సంప్రదాయాలకు న్యాయస్థానాల భాషను ఉపయోగించి,ప్యారిస్ లో 1400 ల సంవత్సరంలో ప్రేమికుల రోజున ఒక ' హైకోర్టు ఆఫ్ లవ్'ను ఏర్పాటు చేశారు. ఈ న్యాయస్థానం ప్రేమ బంధాలు, ప్రేమ పేరిట జరిగే మోసాలు, మరియు మహిళలపై హింసాత్మక కేసులను విచారిస్తుంది. ప్రేమ కవితలు చదవడాన్ని ప్రాతిపదికగా చేసుకుని మహిళలు ఈ కోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేశారు.

తొలిసారి వాలెంటైన్...పదిహేనవ శతాబ్దంలో ఒర్లెన్స్ సేనాధిపతి చార్లెస్,ఆయన తన ప్రేయసి అయిన భార్యకు'రౌండ్' అనే ఫ్రెంచ్ కవిత రాసి పంపాడు. ఈ పద్దతే తదనంతర కాలంలో వ్యాప్తి చెంది...ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమికుల చేత ప్రేమ కవితలు రాయిస్తున్నాయి.

ప్రేమికుల రోజున 'సెయింట్ వాలెంటెన్స్ డే'అని కూడా అంటారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి14 తేదీన ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రేమికులు పండగలాగా జరుపుకునే సెలవు దినం. ప్రాచీన కాలం నుండి పాశ్చాత్య దేశాల్లో వాలెంటైన్స్ కార్డ్స్ పంపడం,పువ్వులు ముఖ్యంగా ఎర్ర గులాబీ పూలను బహుకరించడం, స్వీట్స్‌ని ప్రేమికులు ఒకరికొకరు తినిపించుకోవడం ...మనసులోని అభిప్రాయాల్ని ప్రేమగా వ్యక్తపరుచుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

'వాలెంటైన్స్ డే' నాడు ప్రేమ సందేశాలను ప్రేమికులు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంతో వారి అనుబంధంమరింతబలపడుతుంది. లవ్ సింబల్స్, పావురాళ్ళు, ..మరియు విల్లు,బాణం ధరించిన రెక్కలను 'క్యుపిడ్'అంటారు..అంటే ( గ్రీకుల ప్రేమ దేవత, రతీ మన్మధులన్న మాట!) ఈ బొమ్మలు ఆ కాలంలో 'వాలెంటైన్స్ డే' గుర్తులయ్యాయి.19 వ శతాబ్దం నుంచి చేతితో రాసిన లవ్ కొటేషన్స్, ప్రేమ లేఖలు, ప్రేమ సందేశాలు పంపించుకునే సంప్రదాయం భారీ స్థాయిలో పెరిగి గ్రీటింగ్ కార్డుల తయారీ రూపానికి మార్గమయ్యాయి.

గ్రేట్ బ్రిటన్లో పందొమ్మిదవ శతాబ్దoలో వాలెంటైన్ డే నాడు ప్రేమ కానుకలు పంపించుకోవడం మొదలైంది. 1847 లో ఈస్టర్ హౌన్డ్ అనే మహిళా మాసాను సెట్స్‌లోని వర్సెస్ట్‌లో వున్న తన ఇంటిలో బ్రిటిష్ మోడల్ కార్డులను తయారుచేసి,చేతి వ్రాతతో ప్రేమ ప్రకటనలు చేసి డిజైన్లతో కార్డులు అచ్చు వేసి తన వ్యాపారాన్ని విజయవంతంగా అభివృద్ధి పర్చుకున్నారు. అప్పట్నుంచి వాలెంటై గ్రీటింగ్ కార్డ్స్ బాగా ప్రాచుర్యం పొందాయి.

సొంతoగా ప్రేమ కవితలు రాయడం రాని యువ ప్రేమికుల కోసం అనేక ప్రేమ భావాలు కలిగిన కవితలను 'ది యంగ్ మ్యాన్ వాలెంటైన్ రైటర్' పేరిట 1797లో ఒక బ్రిటన్ ప్రచురణ కర్త విడుదల చేశారు . అప్పటికే ' యాంత్రిక వాలెంటైన్స్ ' పేరుతో పిలిచే కవితలు , మరియు రేఖా చిత్రాలు కలిగిన గ్రీటింగ్ కార్డులను పరిమిత సంఖ్యతో ఉత్పత్తి చేయడం అప్పటి ముద్ర కర్తలు ప్రారంభిచారు . తరువాతి శతాబ్దంలో పోస్టల్ చార్జీలు తగ్గటంతో,వాలంటైన్ గ్రీటింగ్స్ ను పోస్ట్ ద్వారా పంపడం బాగా వాడుకలోకి వచ్చింది .

నేడు ఎస్. ఎం.ఎస్ లు, ఎం.ఎం ఎస్ లు ,ఈ-మెయిల్స్, ట్విట్టర్, ఫేస్ బుక్,ఇన్‌స్టాగ్రామ్స్‌, వాట్సాప్ , ఈ-కార్డ్స్...మొదలైన ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా ప్రేమ సందేశాలని నిమిషాల్లో పంపించుకుంటున్నారు నేటి ప్రేమికులు.

ఏది ఏమైనప్పటికీ, 'ప్రేమను గౌరవించే రోజు..ప్రేమికుల రోజు' అని అర్థమైంది కాబట్టి అందరూ ఆనందంగా' వాలెంటైన్ డే'జరుపుకోండి..!

''హ్యాపీ వాలెంటైన్ డే ఆల్ ఆఫ్ యూ..!''

********  

No comments:

Post a Comment

Pages