శ్రీధరమాధురి - 59 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 59

Share This
శ్రీధరమాధురి - 59
(విజ్ఞానం, ఆత్మజ్ఞానం మధ్య ఉన్న భేదాల గురించి పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


విజ్ఞానం ఉన్న వారు కూడా తమ ఇంద్రియాలకు బానిస కావచ్చు. ఇంద్రియాలకు మీకున్న పరిజ్ఞానం లెక్కలోకి రాదు అవి చాలా శక్తివంతమైనవి. అందుకే ఎల్లప్పుడూ సంతులనం తో ఉండండి.
ఒకరు అంకితభావంతో, వినయంతో గురువుకు సేవ చేస్తూ ఉంటే, సరస్వతీ అమ్మవారు అటువంటి నమ్మకస్తుడైన శిష్యుడికి పుష్కలంగా జ్ఞానాన్ని ప్రసాదించడంలో ఎటువంటి ఆలస్యం చెయ్యరు.
-ప్రయోగ వేదా.

'స్ధిత ప్రజ్ఞ' అంటే ఎంత ఎదిగినా కూడా అదే విధంగా ఒదిగి ఉండడమే.
జ్ఞానికి అన్నింటినీ సమదృష్టితో చూసే కళ తెలుసు. అయినా జీవితపు ప్రతి అంశాన్ని స్పష్టంగా గమనించి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అదే విధంగా అర్థం చేసుకుంటారు. ఆయన విమర్శలు చేయరు కానీ,  కానీ అంతర్గతంగా విచక్షణా జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అంటే విచక్షణ జ్ఞానం ఉన్నా కూడా ఆయన ఎటువంటి విచక్షణా చూపరు. అన్నింటినీ చేసేది దైవమైన ని ఆయనకు బాగా తెలుసు అందుకే అన్నింటినీ సమభావనతో ఆయన చూస్తారు.
అటువంటి వ్యక్తి స్వయానా శ్రీకృష్ణ భగవానులే.
     
అడిగేవారికి, మీకూ తెలిసిన ఏదైనా అంశం గురించి, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీకు తెలియనట్టుగా నటించండి లేక తప్పు జవాబు ఇవ్వండి. అప్పుడు వారు సరైన సమాధానం చెప్పి,  అలా చెప్పగలిగినందుకు ఆనందంగా అనుభూతి చెందుతారు. అందుకే అజ్ఞానాన్ని నటించి వారిని ఆనందపరచండి.
***

No comments:

Post a Comment

Pages