ఈ దారి మనసైనది - 14 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 14
అంగులూరి అంజనీదేవి

 (జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత.) 

“అతనికి తొందరే ! ఆ తొందరే అతన్ని అన్నిటల్లోముందుంచుతుంది. చదువులోనే కాక సోషల్ వర్క్లో కూడా... అంటే కాలేజిలో జరిగే ప్రతివిషయంలో నిజాయితీగా, అలసట లేకుండా పరిశ్రమిస్తాడు అతనివి ఉన్నతమైన ఆలోచనలని, ఉదారమై ఆశయాలని, కాలేజిలో అందరూ చెప్పకుంటున్నారు." అంది ఫ్రెండ్

"ఏమిటో అంత ఉన్నతం... ఉదారం..." అంది మన్వితవత్తి పలుకుతూ" అనురాగ్ తన మనసునుఅర్ధం చేసుకోలేకపోతున్నాడన్న బాధతో

ఆ బాధతో పాటు అనురాగ్ తనని మిస్ అండస్టాండ్చేసుకున్నాడన్న వేదనకూడా వుంది.

" ఆ రోజు... అబ్బాయిల హాస్టల్లో డిప్రెషన్కిలోనై ఒక అబ్బాయి చనిపోతే .. ఎవరూ చూడకపోవడంతో, ఆ బాడీకి పురుగులొచ్చి, విపరీతమైన వాసనొచ్చి ఎవరూ దగ్గరకివెళ్లలేనప్పడు అనురాగే కదా సరైన ప్లాన్ చేసి అన్ని పనులు దగ్గరుండి జరిపించింది." అంది సంజన

" అవునవును ....పోలీసులు, మీడియావాళ్లుకూడా వచ్చారు" అంది మన్వితఒప్పకుంటూ,

 " అంతటితో ఆగకుండా. కాలేజీ సిబ్బందితో పాటు, ఓ యాబైమంది విద్యారులు, అంబులెన్స్ మరియు కాలేజి బస్సులో బయలుదేరివాళ్ల ఊరు వెళ్లి అంత్య క్రియలు జరిపించారు. తెల్లవారి.... వాళ్ల ఎకనామికల్పొజిషన్ని ప్రిన్సిపాల్ గారి దాక తీసికెళ్ళి ఒక డొనేటెడ్ బాక్స్ కాలేజీలో ఏర్పాటు చేసి . వచ్చిన ఏభైవేల రూపాయలను తీసుకొని, ఇరవై ఐదు మంది విద్యార్థులతో కలిసి వెళ్లిఅనురాగే కదా వాళ్ల తల్లి తండ్రులకు యిచ్చింది. ఇంత కన్నా ఉదారత్వం వుంటుందా? ఈ రోజు కూడా అతనిలోని మానవత్వమే దీక్షితను కాపాడింది.

అందరిలా ఒళ్లు మరచి డాన్స్ చెయ్యకుండా, అతను అంతా గమనిస్తున్నాడు. తెలుసా?" అంది సంజన .

"అంతా కాదు. దీక్షితనే గమనిస్తున్నాడు." అనిమనసులో అనుకుంటూ పైకి అన లేకపోయింది. అంటే? ఫ్రెండ్ తో  వాగ్యుద్దం మొదలవుతుంది.

,,ఈ విషయంలో తనెందుకు అందరిలా ఫీలవ్వలేక పోతోంది.?

అతనిలోని మానవత్వాన్ని ఎందుకు ఒప్పకోలేక పోతోంది ?

నిజానికి ఈ రోజు తనీ మెడిసిన్ చదవటానికి కారణం అతనే కదా !

 "దాన్ని చదివించటం ఆపి పెళ్లి చెయ్యండి! మన ఇళ్లలో ఇంటర్ కన్నా ఎక్కువ చదివిన ఆడ పిల్లలు లేరు. ఇంతవరకు చాలు" అని తల్లి అనటం గుర్తోచ్చిందిమన్వితకి.

' మెడిసిన్లో సీటు రాకుంటే అలాగే చేసేవాడ్ని అసలీ సీటు రావటమే గొప్ప విషయం. ఈ సీటు కోసం అదెంత కష్టపడి చదివిందో నాకు తెలుసు" అన్నాడు తండ్రి.

 " అయితే దానికి పెళ్లి చెయ్యరా?" అనుమానంగా అడిగింది. కృష్ణవేణి

" చదివిస్తాను." స్థిరంగా అన్నాడు. విశ్వనాధ్

"చూడండీ ! ఆడ పిల్లకి పెళ్లి చేస్తేనే మర్యాద. మా వదిన కొడుకు రెడీగా వున్నాడు. ఈ మధ్యన కరెంట్ పని కూడా నేర్చుకున్నాడట. అది పొతే అంతకన్నా కన్నా మంచి సంబంధం రాదు." అంది.

" ఏది మంచి సంబంధమోనాకు తెలుసు. రేపు నాకూతురుడాక్టరైతే అది డాక్టర్నే చేసుకుంటుంది. దానికి మొగుడు రాడన్న భయం నాకు లేదు." అన్నాడువిశ్వనాద్

" అలాగే మీ కలల్లో మీరుండండి !"

కల కాదు కృష్ణవేణీ ! దాన్ని నిజంగానే ఎం.బి.బి.యస్ చదివిస్తాను" అన్నాడు.
(ఇంకా ఉంది...)

No comments:

Post a Comment

Pages