చిరునవ్వు - అచ్చంగా తెలుగు
|| చిరునవ్వు ||
--  సుజాత .పి .వి .ఎల్

పెదాల ప్రమిదకు
చిరునవ్వు ..జ్యోతిగా నిలిచి 
వెలుగులీనుతుంది ..

'నువ్వు. .నేనను' బేధభావాలను రూపుమాపి
నమ్మకానికి పునాదిగా నిలుస్తుంది. ..

పది మందిని ఆకర్షించే
అయస్కాంతమవుతుంది ..

మనసు నుంచి మనసుకు
స్నేహాస్తపు కరచాలనానికి సిధ్ధమౌతుంది..

మనిషి సంఘ జీవనానికి
ప్రథమ సోపానమౌతుంది..

గోరంత కనిపిస్తుంది.. కానీ
కొండంత ఉపకారం చేస్తుంది..

మానవ ముఖానికి
విధాత ఇచ్చిన అద్భుత వరం..'చిరునవ్వు'
******

No comments:

Post a Comment

Pages