సర్దార్ వల్లభాయి పటేల్ 562 సంస్థానాలను భారత రిపబ్లికే లో విలీనము చేసిన విధము - అచ్చంగా తెలుగు

సర్దార్ వల్లభాయి పటేల్ 562 సంస్థానాలను భారత రిపబ్లికే లో విలీనము చేసిన విధము

Share This
సర్దార్ వల్లభాయి పటేల్ 562 సంస్థానాలను భారత రిపబ్లికే లో విలీనము చేసిన విధము
అంబడిపూడి శ్యామసుందర రావు   

ప్రస్తుత భారత దేశము గొప్ప దార్శనికత ,ముందు చూపు మంచి నేర్పు,కలిగిన దేశ పురోగతిని కాంక్షించిన ప్రముఖ నాయకుడు సర్దార్ వల్లభాయి పటేల్ కు అయన పధక రచనను అమలు చేసిన కార్యదర్శి విపి మీనన్ కు భారతీయులు ఏంతో ఋణపడి ఉన్నారు అనటంలో ఎట్టి సందేహము లేదు.ఉక్కుమనిషిగా పేరుపొందిన సర్దార్ వల్లభాయి పటేల్ తన ప్రగతిశీల దృక్పధముతో స్వాతంత్రము అనంతరము భారతదేశము బాల్కన్ దేశాల మాదిరి చిన్న చిన్న దేశాలుగా చీలిపోయే ప్రమాదాన్ని నివారించి  భారతదేశములోని 562 సంస్థానాలను విలీనము చేసిన వ్యక్తి పటేల్  1947లో మనము బ్రిటిష్ వారితో జరిపిన అహింసాయుత స్వతంత్ర పోరాటము వల్ల సంపాదించుకున్న స్వతంత్రముతో పాటు మనకు అనేక చినవి పెద్దవి సమస్యలు ఎదురైనాయి వాటిలో కొన్ని భారతీయ సమగ్రతకు ముప్పువాటిల్లేవి కొన్ని బ్రిటీష్ వారు పొరుగున కొత్తగా ఏర్పడ్డ దాయాది దేశము పాకిస్తాన్ వారు అవలంభించిన దమన నీతి వల్ల చాలా సంస్థానాలు స్వతంత్రత ను ప్రకటించుకోవటం లేదా పాకిస్తాన్ తో కలవటానికి ఇష్టపడటం వంటి సమస్యలు పుట్టుకొచ్చాయి. ఈ 562 సంస్థానాలను భారతదేశములో విలీనము చేయటానికి బలప్రయోగము లేకుండా ఎలా చేయాలి అన్న సమస్యను ఎదుర్కొన్నది పరిష్కరించింది మొదటి ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయి పటేల్ సహజముగానే దృఢ చిత్తము కలిగిన వాడు అవటం నేర్పరి అవటం వల్ల ఏవిధమైన సైనిక చర్య,రక్తపాతము లేకుండా చాలా లౌక్యంగా సంస్థానాల విలీనము పూర్తిచేసిన ఘనత పటేల్ డి అందుచేతనే ఆయనను నవ భారత నిర్మాతగా పేర్కొనవచ్చు. 
ఖేడా,  బార్డోలీ సత్యాగ్రహాలద్వారా పటేల్ తనదైన ముద్రను స్వతంత్ర సంగ్రామములో ఏర్పరచుకొని  సర్దార్ బిరుదును పొంది స్వాతంత్ర్యోద్యమములో  ఒక ప్రముఖుడిగా ఎదిగాడు మాటల మనిషిగా కాకుండా చేతల మనిషిగా గుర్తింపు పొంది మాట్లాడే మాటలు కొద్దిగానైనా ప్రజలు ఆసక్తిగా వినేటట్లు మాట్లాడేవాడు. స్వాతంత్రము తరువాత తొలి ఉప ప్రధానిగా, హోమ్ శాఖ మంత్రిగా భాధ్యతలను స్వీకరించి దేశములోని సంస్థానాలను భారత దేశములో విలీనము చేసే గురుతర భాద్యతను నెట్టి మీద పెట్టుకున్నాడు.ఒక దౌత్యవేత్త కు ఉండే లౌక్యం,ఒక మిలిటరీ కమాండర్ కు ఉండే వేగవంతమైన నిర్ణయాలను తీసుకొనే నేర్పులతో అప్పటి లార్డ్ మౌంట్ బ్యాటన్ రాజ్యాంగ సలహాదారుడైన విపి మీనన్ సహాయముతో ఈ గురుతర భాద్యతను విజయవంతముగా ముగించాడు. 
మన దేశములో రాజుల అధీనములో ఉన్నసంస్థానాలు భారత భూభాగములో 48% భూమి 28% జనాభాతో ఉన్నది. ఈ రాజ్యాలు ఏవి చట్టపరంగా బ్రిటిష్ ఇండియాలో భాగాలు కావు. యదార్ధానికి ఇవి బ్రిటిష్ సింహాసనానికి సామంతులు మౌంట్ బ్యాటన్ పధకం ప్రకారము ఏర్పడ్డ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారము బ్రిటిష్ సింహాసనము  ఈ సంస్థానాలకు కొంత వెసులుబాటు దాని ప్రకారము సంస్థానాధీశులు కొత్తగా ఏర్పడ్డ దేశాలు ఇండియా లేదా పాకిస్తాన్లలో కలవ వచ్చు లేదా స్వతంత్రముగా ఉండవచ్చు. ఈ పరిస్తుతులలో సుమారు 500 ల సంస్థానాలను భారత దేశములో విలీనము చేయవలసిన ఆవశ్యకతను గుర్తించిన పటేల్ స్నేహా పూర్వకముగా గాని బలము ఉపయోగించిగాని ఈ పని చేయకపోతే స్వాతంత్రము సాధించుకున్న ఉపయోగము ఉండదని పటేల్ గుర్తించాడు కానీ ఇది అనుకున్న అంత సులువైనది ఏమీకాదు ఎందుచేతనంటే అప్పటికే బ్రిటిష్ వారి విభజించి పాలించు విధానము వల్ల చాలా రకాల చీలికలు ఏర్పడ్డాయి. 
చాలా మంది సంస్థానాధీశులు బ్రిటిష్ వారి నిష్క్రమణ వారు స్వతంత్రాన్ని ప్రకటించుకోవటానికి గొప్ప అవకాశముగా భావించారు ఆ విధముగా ప్రపంచపటంలో స్వతంత్ర దేశముగా అవతరించవచ్చు అని తెగ ఆశపడ్డారు. కానీ అభ్డుతమైన అమోఘమైన పటేల్ టీమ్ ( సిద్ధాంతకర్త వ్యూహ రచనాపరుడు పటేల్ ,అమలుపరచిన మీనన్)  సంస్థానాధీశుల ఆలోచనలకూ గండి కొట్టారు. వారిలో దేశభక్తిని కలుగజేసి విడిపోతే వచ్చే నష్టాలను వివరిస్తూ వారిని ఇండియన్ యూనియన్ లో చేరటానికి చాలా మందిని ఒప్పించారు. అంతేకాకుండా ఇండియన్ యూనియన్ లో చేరి రాజ కుటుంబికులు నష్టపోతున్నందుకు (ఆర్ధికంగా)  వారికి కొంత ఆర్ధిక సహాయము ప్రివి పర్సు లను రాజ్యాంగ బద్దముగా ఏర్పాటు చేస్తానని పటేల్ హామీ ఇచ్చారు (వీటిని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేసింది) ఈ విధముగా పటేల్ నిరంతర కృషి వలన చాలా మంది సంస్థానాధిశులు వారి సంస్థానాలను కొన్ని వేళా గ్రామాలను,జాగీర్లను,భవంతులను,క్యాష్ బ్యాలన్సులను,సుమారు 12,000 మైళ్లపొదవు ఉన్న రైల్వే లైన్లను ఏమి నష్ట పరిహారము తీసుకోకుండా భారత ప్రభుత్వానికి అప్పజెప్పారు. 
ఆగస్టు 15,1947 నాటికి చాలా సంస్థానాల విలీనము పూర్తి అయింది కానీ పిపోల్డ మధ్యభారతము లోని చిన్న సంస్థానము విలీన ఒప్పందం పై సంతకము పెట్టటానికి ఆలస్యము చేసి చివరకు మార్చ్ 1948 లో సంతకము చేసింది. పెద్ద సమస్య జోధ్ పూర్,జునాగఢ్ ,హైదరాబాద్ సంకాశ్మీర్ సంస్థానాలతో ఏర్పడింది జోధ్ పూర్ పాకిస్తాన్ తో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ప్రయత్నిస్తుంది జునాగఢ్ అప్పటికే పాకిస్తాన్ తో కలవటానికి ఇష్టపడుతుంది. హైదరాబాద్,కాశ్మీర్ స్వతంత్ర దేశాలుగా ఉంటామని ప్రకటించుకున్నాయి. 
జోధ్ పూర్ సంస్థానానికి మహారాజా హాన్ వంత్ సింగ్ రాజు అయిన వెంటనే  తన ముందు రాజు ఇండియాలో విలీనము అవటానికి ఒప్పుకున్నాఒప్పందాన్ని పక్కన పెట్టి  కుర్రవాడు అవటం అనుభవ రాహిత్యము వల్ల పాకిస్తాన్ తో ఒప్పందానికి ఉత్సాహము చూపించాడు. మొహమ్మద్ అలీ జిన్నాతో చర్చలు కూడా సాగించాడు జిన్నా ఇంకొక అడుగు ముందుకు వేసి మహారాజాకు సంతకము పెట్టిన ఖాళి కాగితము పాకిస్తాను లో కలవటానికి షరతులు మీరే వ్రాసుకోండి అని పంపించాడుట  సొంతముగా వాయిదాల తయారీ విదేశాలనుండి ఆయుధాల దిగుమతి కఱచిఓడరేవుకు రవాణా సౌకర్యము వంటి కీలకమైన షరతులకు జిన్నాఒప్పుకున్నాడట. సరిహద్దు ప్రాంతములోని జోధ్ పూర్ పాకిస్తాన్ తో కలిస్తే వచ్చే సమస్యలను గుర్తించిన పటేల్ హాన్ వంత్ సింగ్ ను కలసి కొన్ని హామీలు ఇచ్చి జోధ్ పూర్ కతీయవార్ కు రైల్ రోడ్ మార్గాల ద్వారా కలుపబడితే ధాన్యపు రవాణా కు ఇబ్బంది ఉండదని హాన్ వంటి సింగ్ ను ఒప్పించాడు అంతేకాకుండా హిందూ ప్రాంతము ముస్లిం దేశంతో కలిస్తే అనేక సమస్యలు వస్తాయని హాన్ వంత్ సింగ్ కు వివరించి జోధ్ పూర్ సంస్థానము ఇండియాలో కలవటానికి ఒప్పించాడు ఈ విధముగా జోధ్ పూర్ ను పాకిస్తాన్ లో కలుపుకోవాలని జిన్నా వేసిన పధకమువిజయవంతము కాలేదు. 
జునాఘడ్ విషయానికి వస్తే 80% హిందువులు ఉన్నప్పటికీ రాజు ముస్లిం అవటం వల్ల పాకిస్తాన్ లో కలవటానికి ఇష్టపడ్డాడు.సెప్టెంబర్ 15,1947 లో జునాఘడ్ నవాబ్ పాకిస్తాన్ లో కలవటానికి తన అంగీకారాన్ని తెలిపాడు కానీ ఈ ప్రతిపాదనను ప్రజలు అంగీకరించక పెద్ద ఎత్తున అల్లర్లు చేశారు భయపడిన నవాబ్ తన కుటుంబముతో కరాచీ పారిపోయి అక్కడ తన ప్రభుత్వాన్ని స్థాపించాడు పటేల్ పాకిస్తాన్ తో జునాఘడ్ నవాబ్ ప్రతిపాదనను తిరస్కరించి అక్కడ ప్లీబిసైట్ నిర్వహించవలసినదిగా పాకిస్తాను ను కోరాడు కానీ పాకిస్తాన్ ఈ ప్రతిపాదనకు అంగీకరించక పోవటముతో పటేల్ సైన్యాన్ని పంపి జునాఘడ్ సంస్థానాన్ని నవంబర్ 1,1947లో భారతదేశములో విలీనము చేశాడు  తరువాత డిశంబర్ లో ప్లీబిసైట్ జరిపితే 99% జునాఘడ్ ప్రజలు ఇండియాలో ఉండటానికి అంగీకరించటం తో ఆ సమస్య ఆ విధముగా పరిష్కరించ బడింది. 
ఇంక కాశ్మీర్ విషయానికి వస్తే రాజు హిందూ జనాభా ముస్లిములు. కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ లో గాని ఇండియాలో గానికలవకుండా స్వతంత్రముగా ఉండాలని కోరుకుంటున్నారు కాశ్మీర్ చుట్టూ అంతార్జాతియ సరిహద్దు ఉండటం వలన కాశ్మిర్ సమస్య జటిలం అయింది. పాకిస్తాన్ యొక్క ఆలోచనలను కనిపెట్టిన పటేల్ కొన్ని చర్యలను వెంటనే తీసుకున్నాడు. విమానాలను ఢిల్లీ శ్రీనగర్ దారిలోకి మళ్ళించాడు. పఠాన్ కోట్ అమృత్ సర్ . జమ్ముల మధ్య టెలిఫోన్ టెలిగ్రాఫ్ లైన్లను వేయించాడు కొన్ని కీలకమైన స్థానాలలో భారతీయ సైన్యాన్ని ఉంచాడు. ఈ పారిస్తుతులను గమనించిన పాకిస్తాన్ కాశ్మీర్ చేయి జారిపోతుందన్న భయముతో 22,అక్టోబర్, 1947 న 5000 మంది పాకిస్తానీ లష్కర్లతో యుద్దానికి దిగి కొంత కాశ్మిర్ ను ఆక్రమించింది. రెండు రోజుల తరువాత కాశ్మీర్ రాజు ఇండియాలో కలవటానికి అంగీకరించి భారత ప్రభుత్వాన్ని సైనిక సహాయము అడిగాడు. అక్టోబర్ 26 న మీనన్  శ్రీనగర్ చేరుకొని కాశ్మిర్ రాజు చేత విలీ న ఒప్పందంపై సంతకము చేయించి,డిఫెన్స్ కమిటీ అత్యవసర సమావేశము జరిపి భారతీయ సేనలకు పాకిస్తాన్ దురాక్రమణ దారులను ఖాళి చేయించవలసినదిగా ఆజ్ఞలు ఇచ్చారు.ఆ విధముగా పాకిస్తాన్ దురాక్రమణను ఆపగలిగారు.జమ్ముకు శ్రీనగర్ మధ్యనున్న ఒకే ఒక రోడ్డు పాకిస్తాన్ లోని సియాల్ కోట్ గుండా రావాలి ఇది మన మిలిటరీ కదలికలకు ఇబ్బందికరం అవటం వలన పదిహేను రోజుల్లో రోడ్డు వేయటానికి మనుష్యులను సామాగ్రిని ప్రత్యేక రైళ్ల ద్వారా తరలించి మిలిటరీ వారి భారీ వాహనాలు ప్రయాణము చేయటానికి వీలుగా జమ్మూ పఠాన్ కోట్ మధ్య ఎనిమిది నెలలలో రోడ్డు ను పటేల్ నిర్మింప జేసాడు 
ఈ మధ్యలో పెద్దది,ధనవంతమైన హైదరాబాద్ సంస్థానము ఇండియాలో విలీనము కాము అని ఖచ్చితముగా చెప్పింది. బుజ్జగింపులు బెదిరింపులు ఏమి నైజాం నవాబ్ పై  పనిచేయలేదు.పైపెచ్చు నైజాం నవాబ్ యూరోప్ నుండి ఆయుధాలు తెప్పించుకొని తన సైన్యాన్ని బలోపేతము చేయటానికి ప్రయత్నాలు కొనసాగించాడు. హైదరాబాద్ లోని హిందువుల మీద ముస్లిం రజాకార్ల దాడులు మొదలైనాయి. అప్పుడు పటేల్ 17,సెప్టెంబర్ 1948 న ఆపరేషన్ పోలో పేరుతొ ఇండియన్ ఆర్మీ ని హైదరాబాద్ నడిపించాడు.రజాకార్ల తో మిలిటరీ చర్య నాలుగు రోజులు సాగింది వేరే దారి లేక నిజాం నవాబ్ లొంగిపోయి బేగం పేట విమానాశ్ర యములో పటేల్ ను రిసీవ్ చేసుకొని తన సంస్థానాన్ని ఇండియాలో విలీనము చేశాడు ఈ విధముగా హైదరాబాద్ సంస్థానము దేశానికి స్వాతంత్రము వచ్చిన13 నెలలకు ఇండియాలో భాగము అయింది. ఈ విధముగా సంస్థానాలన్నిటిని ఇండియన్ యూనియన్ లోకి తెచ్చిన ఘనత పటేల్ ది అంతేకాకుండా లక్షద్వీప్ ను కూడా ఇండియన్ యూనియన్ లో తెచ్చింది పటేల్ పాకిస్తాన్ నౌకాదళము లక్షద్వీప్ ఆక్రమించాలని చేసిన ప్రయత్నాలను భారతీయ నౌకాదళముతో త్రిప్పి కొట్టిన ఘనత పటేల్ దే ఈ విధముగా పటేల్ అయన సెక్రటరీ మీనన్ ఇద్దరు కలిసి ఈ సంస్థానాలను అన్నింటిని భారత దేశములో విలీనము చేశారు.కానీ నెహ్రు నిర్ణయాల వల్ల నేటికీ ఇండియా పాకిస్థాన్ల మధ్యకాశ్మీర్ సమస్య రావణ కాష్ఠము లాగా ఇంకా కొనసాగుతుంది పటేల్ కు కాశ్మీర్ విషయములో కొంత స్వేచ్ఛ ఇచ్చి ఉంటె సమస్య ఇంకోరకంగా ఎప్పుడో పరిష్కారము అయ్యేది కానీ నెహ్రు కాశ్మీర్ సమస్య అంతార్జాతీయ సమస్యగా చేసి నేటికీ అపరిష్కృత సమస్య గా చేసాడు అందుకనే నెహ్రూను హామ్లెట్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని రాజకీయ విశ్లేషకులు వర్ణిస్తారు.భారత రాజ్యాంగములోని ఆర్టికల్ 1 లో చెప్పబడినట్లు ఇండియా అంటే భారత్ రాష్ట్రాల యూనియన్ మాత్రమే ఈ విధమైన ఆధునిక భారతాన్ని నిర్మించిన ఘనత సర్దార్ వల్లభాయి పటేల్ దే.
***                  

No comments:

Post a Comment

Pages