శిలాక్షరాలు
నాగ్రాజ్

గతం
చెరపలేవు
భవిష్యత్తు
రాయలేవు

వర్తమానం
సమయపు కాగితాలని
నీకందిస్తుంది

విచక్షణా
కలం అందుకో
వివేచనా
సిరా నింపుకో

కాలం 
యుగాలని మింగేసినా
చెరగని శిలాక్షరాలని 
నీ పేర లిఖించుకో

***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top