ఈ దారి మనసైనది -12 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది -12
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com

                                                                    angulurianjanidevi.com


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత.)
మనసుని కరిగిస్తూహిమసమూహంలా ఘనీభవించి,జీవితాలను మార్చివేస్తూ కాలం ఎన్నెన్నో చిత్రాలను చేస్తుంది.

ప్రపంచంతో పాటు తను కూడాలేచి రాసుకుంటూ కూర్చొంది దీక్షిత.
ఆ హాస్టల్లో రూంకి రెండు బెడ్స్ వుంటాయి.
దీక్షిత పక్కరూం అమ్మాయి మహతి వచ్చి దీక్షిత పక్క చెయిర్లోకూర్చుంటూ ఏం రాస్తుందోనని తొంగిచూసింది.
నా గుండె లోపలి గాయాల బాధను
గేయాలుగా రచించే ఓ కవి !
బాధను వర్ణించకు - - - -
గాయాల గతాన్ని బయటకులాగు !
ప్రతీకార జ్వాలను సమర్ధించిరెచ్చగొట్టు
చెత్తకవిగాకాక
చెతన్య కవిగా రాణించు ! అని ఓ కవిత రాస్తోంది దీక్షిత.
దీక్షిత రాసిన కవిత మహతికి నచ్చింది.
కవితలు ఎలా రాస్తారు నీ కెలా వస్తుంది కవిత్వం? " అంటూ ఆసక్తిగా అడిగింది.
"నేను నా ఎయిత్ క్లాసునుండే కవితలు రాసేదాన్ని నేను చూసిన జీవితంలోంచే నా కవితలుపుడుతున్నాయి..అంది దీక్షిత.
"మేము మాత్రం చూడలేదా జీవితాన్నిమాలో పుట్టడం లేదేంకవిత్వం?" అంది కుతూహలంగా మహతి.
"రాయాలన్న ఆసక్తితపనసాధనకృషి దానికి తగిన టైంతో పాటు ఊహకూడా బలంగా వుండాలిగా" .అంది దీక్షిత
"ఇంత కష్టపడి రాస్తున్నావ్ ?ఈ కవితలన్నీ ప్రజల్లోకి పోతే బావుంటుందేమో కదా.అంది మహతి.
"అందరు అదే అంటున్నారు మహా ! ఈ మధ్యన సాహితీ పత్రికల్లో వస్తున్ననా కవితల్ని చదివి ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహన్రావుగారునా కవితల్ని వెలుగులోకి తీసుకొస్తానని చెప్పారు. హ్యపీగావుందిఅంటూ లేచి తన పేపర్స్ ని సర్దేసి చకచక రెడీ అయింది దీక్షిత.
మహతిదీక్షిత సీనియర్ వాళ్లమధ్యన నువ్వు అనుకునే చనువుంది.
నిన్న మన్వితలాబ్లో నిన్ను కావాలనే నెట్టిందని కొందరుచూసుకోకుండా తగిలిందని కొందరు అనుకుంటున్నారు. నీకేమనిపిస్తోంది?" అంది మహతి.
నన్ను కావాలని నెట్టాల్సిన అవసరం మన్వితకి లేదు. అందుకే  లైట్ తీసుకున్నా" .అంటూక్లాసుకెళ్లబోతున్నదీక్షతను చూస్తూ.
"ఎందుకైనా మంచిది లాబ్లో జాగ్రత్తగా వుండు” అంటూశ్రేయోభిలాషిలా ఓ మాట చెప్పి వెళ్లింది మహతి.
మద్యాహ్నం .....
ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ గారొచ్చి పోస్ట్ మార్టము చూడటానికి మార్చురీకితీసికెళ్లారు.
ఎమ్.జి.ఎమ్. ప్రధాన గేటు నుండి మార్చురీకి దూరం ఎక్కువగా వుండటంతో వైద్య విద్యార్థులంతా జెమిని యాడ్స్ లాబ్స్ టాకీస్ పక్క నుండి మార్చురీకి వెళ్లారు.
మార్చురీ రూంలోకి ఎంటర్ కాకముందే చనిపోయిన వాళ్ల బందువులుచెట్లక్రిందకూర్చునినుదుటిపై చేతులతో కొట్టుకుంటూహృదయ విదారకంగా ఏడుస్తున్నారు. వాళ్లను చూస్తూ...
దీక్షిత అడుగులు అక్కడే ఆగి పోయాయి.
మార్చురీకి వెళ్లాలంటేనే ఆమెకు భయంగా వుంది.
ఆ భయాన్ని పోగొట్టడం కోసం అనురాగ్ ధైర్యం చెబుతున్నాడు. అతనెంత ధైర్యం చెప్పినా లోపల కేల్లతానికి ఆమె మనసు సంసిద్ధం కావడం లేదు.
మెడికో స్టూడెంట్స్ అంటాఎవరిలోకంలోవాళ్ళుంటే... దీక్షిత ఆగిన వెంటనే అనురాగ్ ఆగి మాట్లాడటం, తిరిగి మార్చురీ వైపు కదలటం గమనిస్తోంది.
అనురాగ్ తనతో కూడా మాట్లాడతాడు నవ్వుతాడు. సబ్జెక్టు గురించి చర్చిస్తాడు. ధైర్యం కూడా చెబుతాడు. కాణీ... తనతో ఏది చేసినా దీక్షితతో చేసినట్లు చేయడం లేదని ఆమె బాధ.
...ఫీలింగ్స్ కావాలి తనకి. దీక్షిత పట్ల ఆటను ఎలా ఫీలవుతున్నాడో ఆ ఫీలింగ్స్ కావాలి. ఆ ఫీలింగ్స్ కూడా ఒక్క తన పట్ల తప్ప ఇంకెవరు పట్ల కలగకూడదు.
నిజానికి అనురాగ్ అననెంత అభిమానంగా చూసేవాడు! వరంగల్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నప్పుడు, స్కూల్ వదిలాక తను కాళ్ళీడ్చుకుంటూ,చేతులూపుకుంటూఇంటికేల్తుంటే ‘రా మన్వితా!’ అంటూ కార్లో ఎక్కించుకునేవాడు.
ఒకసారి తల్లికి తెలియకుండా తన రెండు జాడల్లో రెండు తెల్ల గులాబీలను వైట్ రిబ్బన్లలో కలసిపోయేలా పెట్టుకుంటే పోకిరీవెదవ వాటిని లాగి నవ్వినప్పుడు అనురాగ్ చూసి వాడిని చితకబాదాడు... అప్పటి నుండి తనను ఎవరు కామెంట్ చేసినా అలాగే చేసేవాడు... ఇంట్లో తల్లి తిట్టినప్పుడు స్కూల్ కొచ్చి ఏడుస్తుంటే ఓదారుస్తూ జోక్స్ వేసి ఆ బాధను మరిపించి అప్పటి కప్పుడు ప్రక్కనే వున్నా బెకరీకితీసికెళ్ళి తను అడిగింది కొనిచ్చే వాడు. తను తింటుంటే అతను కూడా తినేవాడు.
క్లాస్ లో సార్ అడిగింది తను చెప్పలేనప్పుడు మధ్యలో అందించేవాడు... అసైన్‌మెంట్ అప్పుడు కూడా అలాగే చేసేవాడు...అతన్ని క్లాసులో లీడర్నిచేసినప్పడు ముఖమంతా నవ్వునింపుకొనికంగ్రాట్స్ చెబితే షేక్ హేండ్యిచ్చి ఆ చేతిని అలాగే పట్టుకున్నాడు. అప్పడెంతగర్వపడిందో అనురాగ్ తన ఒక్కదానికే ఫ్రెండ్ అన్న ఆశతో. అనురాగ్ తన ఫ్రెండ్ కావడం ఓ ఎస్సెట్లా తన జోలికి ఎవరూ వచ్చేవాళ్లు కాదు.
 "రా !మన్వితా ! అక్కడే ఆగి పోయావేం?"అంటూ అనురాగ్ పిలవడంతో కదిలింది మన్విత
అప్పటికే అందరు మార్బురీ రూంలోకి వెళ్ళారు. మార్చురీ రూంలోకి వెళ్లగానే....
అక్కడ నాలుగు శవాలు దేనికదే ఓ పక్కగా పడివున్నాయి.
భరించరాని వాసనతో అక్కడో క్షణం కూడా వుండలేక పోతున్నారు
మగ పిల్లలు మాత్రం ఎంతయినా ధైర్యస్టుల కావడం వల్ల ఏ ఫీలింగ్ బయట పడనీయడంలేదు.
దీక్షతకువెన్సులోజలదరింపు పుట్టి, ఎంత నిగ్రహించుకుందామన్నా లోలోపల సన్నగా వణుకు పుడ్తోంది.
మన్వితకు మాత్రం అలాంటివేమి కలగడం లేదు.
ఆ శవాన్ని త్వరగా చూడాలన్న క్యూరియాసిటీతోవుంది.
కారణం శవంగా మారిన అమ్మాయి ఒక భగ్న ప్రేమికురాలు.
ఫోరెన్సిక్ ప్రొఫెసర్ వచ్చి ముందుగా ఒక డెడ్ బాడీని తీసుకొని పోస్ట్ మార్ధమ్ విధానాన్నిసూడెంట్స్కివివరించాడు.
ఆ సూడెంట్స్ ముందు కాస్త్రభయపడ్డాతర్వాత శవం వైపు చురుగ్గా చూస్తూప్రొఫెసర్ చేప్పేదివింటూ కుతూహలాన్ని పెంచుకున్నారు. లెసన్ వింటున్నట్లే చూస్తున్నారు.
దీక్షిత మాత్రం శవాన్ని చూడగానే మెల్ల మెల్లగా అడుగులేస్తూ అనురాగ్ వెనక్కి చేరి అతని భుజం మీదుగా తలెత్తి భయంభయంగా చూస్తూ ప్రొఫెసర్ చెప్పేదివింటోంది.
ఆ ‘డెడ్ బాడీకి పోస్ట్ మార్టముచేస్తున్నారు.
ఆ డెడ్ బాడీ సూసైడ్ చేసుకున్న ఒక పెళ్లి కాని అమ్మాయి....
ఆ డెడ్ బాడీని స్ట్రచర్విూదపడుకోబెట్టారు.
ఆ బాడీకి బాహ్యంగా దెబ్బలేమైనా తగిలాయా అని చూడటానికి ఆ మార్బురీలో పని చేసే వాళ్లు ఆ బాడీకున్న బట్టల్ని తొలిగించారు.
ఆ తర్వాత ప్రొఫెసర్ గారు ఒక కత్తి, ఒక సుత్తి తీసుకొని కపాలాన్ని పగలగొట్టారు.
మెదడు కేమైనా దెబ్బలు తగిలాయా?అక్కడేమైనా రక్తం గడ్డ కట్టిందా అని పరీక్షించారు.
ఆ మెదడును బయటకు తీసి విద్యారులవైపు చూపించాడు.
మెదడు ఎలా వుంటుందిఅది ఎలా పనిచేస్తుంది. ఎవరైన తలపై కొట్టినానీటిలో పడి చనిపోయినా, (Drowming) నుదిటిపై కాల్చినా బ్రెయిన్లో వచ్చే మార్పులు ఎలా వుంటాయోప్రొఫెసర్ గారు విద్యార్థులకు వివరించారు.
ఒక సీజర్ లాంటిది (Cutter) తీసుకొని చాతి ఎముకను కట్ చేసి గుండెను ఊపిరితిత్తులను బయటకు తీశాడు.
గుండెలో,ఊపిరితిత్తుల్లో ... విషం తీసుకున్నప్పడు,పాముగానితేలుగానికరిచినప్పడు,ఎవరెనాఛాతిపై  కత్తితో పొడిచినప్పుడుగట్టిగా చాతిపై కొట్టడం వల్ల చనిపోయినపుడు వచ్చే మార్పుల్ని వివరించారు.
ప్రొఫెసర్ చేతిలో వున్న ఆ భగ్న ప్రేమికురాలి గుండెను చూస్తుంటే మన్వితకికళ్లనీళ్లువాటంతటవే కారిపోతున్నాయి.
గుండెనుఊపిరితిత్తుల్ని కోస్తున్నప్పడు అంత ధైర్యంగా ఎలా చూడగలిగిందో ఆమెకే అర్థం కావడంలేదు. ఆ గుండెలో అతను కన్పిస్తాడేమోననిఆ చిన్ని గుండె ఆ ప్రేమికుడ్ని ఎంత గుప్తంగదాచుకుందోననిఎన్ని వేల సార్లు అతన్ని గుర్తు చేసుకుందోననిఎన్ని అనుభూతుల్ని ఎన్ని కన్నీళ్లనిఎన్ని జ్ఞాపకాలని దాచుకుందోచూడాలని. కళ్ల నీళ్లు చూపుకి ఇబ్బంది కల్లిస్తున్నా అలాగే చూస్తోందిమన్విత,
చనిపోక ముందు ఆ ప్రేమికుడి మొదటి స్పర్శ,మొదటి ముద్దుని మది మూలలో దాచుకొని ఆ ప్రేమికురాలి గుండె ఎంత అనుభూతి చెంది వుంటుందో.. అతన్ని తలచుకుంటూ ఆ గుండె ఎన్నిసార్లు అమృతం నదిలో మునకేసివుంటుందో ... క్షణక్షణం అనురాగ మకరందాన్నికురిపిస్తూ ఎంతటి ప్రేమ మాధుర్యాన్ని చవిచూసివుంటుందో...మంచుపూలవర్షంలో తడుస్తూ ప్రేమ అనే పదానికి ప్రాణం పోసుకుంటూ తియ్యదనాన్ని చిలిపితనాన్ని,ఆత్మీయతను కలబోసుకొని ఆ లేత అదరాలతో ఎంత ప్రేమామృతాన్నిగ్రోలిఉంటారో....
చనిపోయే ముందు ఆమె తన ప్రియుడ్నిచూడాలని ఎంతగా ఆక్రోశించి వుంటుందో .... ఆ పిడికెడు గుండెలో ఎన్ని అనుభూతులో ... ఎంత స్పందనో ... ఎంత ప్రేమో - - - - అర్థం చేసుకునే హృదయం కోసం ఎంతగా ఎదురు చూసి వుంటుందో...ఒకరి కోసం ఒకరు ఎన్ని నిద్రరాని రాత్రుల్ని గడిపివుంటారో....
ఈ రోజు ఈ మార్చురీలో ఆమె చాతి ఎముకను కట్ చేసి గుండెను బయటకు తీసి మెడికల్ కాలేజి సూడెంట్స్ కి పాఠాలుగా చెబుతారని ముందుగా తెలిసుంటే "నా గుండెలో నువ్వు కన్పిస్తావువెళ్లి చూడు"అని తన ప్రేమికునికి ఒక వుత్తరం రాసి వుండేదేమో....
గుండెను పిండుతున్నట్లైగట్టిగా కళ్లు మూసుకొంది మన్విత
ఆ ప్రొఫెసర్ దృష్టిచేతులు ఆడెడ్ బాడీపై ఒడుపుగా కదులుతున్నాయి. విద్యార్థులలో ఏకాగ్రత పెరిగింది.
ఆయన ఒక బ్లేడు తీసుకొని కడుపు కట్ చేశాడు. అందులో వున్నపేగులుమూత్ర పిండాలుమరియు జీర్ణాశయం వాటిలో వచ్చే మార్పుల్ని వివరించి.... పోస్ట్ మార్ధమ్ని ముగించాడు.
క్లాసు ముగియగానేఒక్కొక్క విద్యార్థి బయట కొచ్చి చెట్ల క్రింద నిలబడిజరిగిన క్లాసు గురించి కాసేపు చర్చించుకున్నారు.
అక్కడనుండి కదిలి అమ్మాయిలుఅబ్బాయిలు ఎవరి హాస్టల్కివాళ్ళు వెళ్ళారు.
*****

No comments:

Post a Comment

Pages