నెత్తుటి పువ్వు - 2 - అచ్చంగా తెలుగు

నెత్తుటి పువ్వు - 2

Share This
నెత్తుటి పువ్వు - 2
మహీధర శేషారత్నం 

(రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు హీరో.)
బాత్రూంలోకి వెళ్ళింది. చక్కగా టవలు, సబ్బు అన్నీ ఉన్నాయి. స్నానం చేసింది. ప్రాణం హాయిగా ఉంది.

బయట తలుపులు దబ దబ బాదుతున్నారెవరో! అయినా తాపీగా డ్రెస్ అయి తలుపు తీసింది.
అతడు వచ్చేడు, వేగంగా వచ్చినట్టున్నాడు. రొప్పుతున్నాడు. గమనించనట్టు ఊరుకుంది.
'ఇదుగో తిను రెండు పొట్లాలూ, నీళ్ళ బాటిలు కింద పెట్టాడు. వేడి వేడిగా ఉన్న టిఫిన్ ఊదుకుంటూ తినేసింది. నీళ్ళ బాటిల్ ఎత్తుకుని పోసుకుంది.
"నువ్వూ తిను" అంటుందేమోనని చూసాడు. ఊహc! ఏమీ మాట్లాడలేదు. లేచి వెళ్ళి వీధి తలుపునాసుకుని నుంచుంది. ఒక్క క్షణం ఆగి తనూ టిఫిన్ తిని నీళ్ళు తాగాడు. అలా నిస్సత్తువగా చేతులు రెండూ తల క్రింద మడిచి పెట్టుకొని వెల్లకిలా పడుకున్నాడు. నిద్రపట్టేసింది. ఎంతసేపు అలా పడుకున్నాడో మెలుకువ వచ్చేసరికి మధ్యాహ్నం ఎండ కరకరలాడుతోంది. పక్కనే కూర్చుని ముఖంలోనే చూస్తున్నదల్లా ఇతను కళ్ళు తెరవగానే ముఖం పక్కకు తిప్పుకుంది. వాచీ చూసుకున్నాడు. ఒంటి గంటయింది. .
"అమ్మో! ఆకలేస్తోంది. తెచ్చిక్కడ పడేసావు అన్నం పెట్టించేదేమైనా ఉందా?* పొట్టరాసుకుంటోందామె. ఒక్క క్షణం సీరియస్ గా చూసాడు.
"ఏం కష్టపడిపోయామని ఇంత ఆకలి?" ఓరగా చూస్తూ సిగరెట్ ముట్టించుకున్నాడు.
ఆశ్చర్యంగా చూసింది. ఇందాకటి నుంచి అతని ప్రవర్తన చూసి ఇలా అంటాడనుకోలేదు. అయినా తగ్గ దలుచుకోలేదు.
“కష్టపడకపోతే ఆకలేయ్యడేంటి?
“సరే! తెస్తాను, ఆగు" అంటూ లేచి వెళ్ళాడు. ఒక అరగంట పట్టింది ఇతను రావడానికి వేడిగా ఉన్న అన్నం మొత్తం తినేసింది ముద్ద మిగల్చకుండా, ఇతనేం మాట్లాడకుండా, రెప్పవేయకుండానే చూస్తున్నాడు. పూర్తిగా తినేసావా,ఈసారి కొంచెం ముఖమాటపడింది. ముఖంలో ఆ భావంలో కొద్దిగా సిగ్గు ప్రతిఫలించింది. ఆయినా నిశ్శబ్దంగా కేరేజి బాత్రూంలోకి పట్టి వెళ్ళి శుభ్రంగా కడిగి తెచ్చి పెట్టింది. అతడు ఆమెను పరీక్షించేదానికే అన్నట్టు మౌనంగా కూర్చున్నాడు. కాసేపు చూసి విసుగు పుట్టిందామెకు.
“ఏంటలా ఉలుకూ, పలుకూ లేకుండా ఉన్నావు?" విసుక్కుంది. "నువ్వే చెప్పావుగా మనకి మాటలే ముంటాయని....." "అయితే పనులుంటాయిగా పెంకిగా ఉంది. ఒక్కక్షణం సీరియస్గా చూసాడు. ఆ చూపుల తీక్షణతకు భయం వేసి కళ్ళు వాల్చింది.
"నేను ఇంటికి వెళుతున్నాను. మళ్ళీ రాత్రికి వచ్చి వెడతాను. అందాకా తలుపులు వేసుకుని పడుకో!”
బయల్దేరాడతను.
"నువ్వు అన్నం తినవా!..." మొదటిసారిగా మొహమాటంగా అడిగింది. అతను హాయిగా నవ్వాడు.
“మా ఆవిడ ఎదురుచూస్తూ ఉంటుంది. "
“నీకు పెళ్ళయిందా? మరి నన్నెందుకు తెచ్చావు?" ముఖం మ్లానమయింది ఆమెకు.
"చూడు నువ్వు ఎక్కువగా ఆలోచించక పడుకో 
ఎందుకు తెచ్చాపు అంటే .... ఏమో నాకూ తెలియదు.
నిన్ను అలా చూడలేకపోయాను. ఏం చెయ్యాలో చేసూ ఆలోచించలేరు. తరువాత చూద్దాం. నేను రాత్రికి వస్తాను "
వెళ్ళిపోయాడతను. తలుపు వేసి లోపలి కొచ్చింది. ఆ చల్లని గచ్చుమీద కాళ్ళూ చేతులూ బారచాచుకొని వెల్లకిలా పడుకుంది.
ఇంత విశాలమైన గదిలో, ఒంటరిగా ఎప్పుడూ పడుకోలేదు. దోమలు తోలుకుంటూ, ఈగలు తోలుకుంటూ, పచ్చిబూతులూ, మోటు సరసాల అసం మధ్యలో ఏదో నిద్ర.. చావులాంటి నిద్ర
ఒంటికీ సుఖమూ, కష్టమూ తెలియని బండనిద్ర... పైన ఫాను తిరుగుతోంది. గాలి చల్లగా తగులుతోంది. ఎప్పుడూ అలవాటులేని ఒంటరితనం కాస్త భయాన్ని కలిగించింది. లేచి కిటికీ వేసేసింది. చిన్న వెంటిలేటర్ మాత్రమే ఉంది. లైటు కూడా ఉంచేసింది. బాగా నిద్ర పట్టేసింది.
ఎవరో తలుపు విన్నగా కొడుతున్న అలికిడి మెలుకువ వచ్చింది. మొదటిసారిగా భయం వేసింది. కిటికీ తెరచి చూసింది. స్ట్రీలు లైటు వెలుతురులో నాగరాజు కనపడ్డాడు. వెంటనే తలుపు తీసింది.
“ఏమిటీ ఇంకా నిద్రే"! లోపలికొస్తూ అన్నాడు.
"ఊ " అంటూ బాత్రూం కెళ్ళి ముఖం కడుక్కొచ్చింది. చూస్తే నాగరాజు గోడవారగా రెండు పెద్ద సంచులు పెట్టాడు.
"ఏమిటవి?" ఆశ్చర్యంగా అడిగింది. 
"నీకే తినడానికి ఆమెనే చూస్తూ అన్నాడు.
ముందుకొచ్చి సంచితీసి చూసింది. పైన కందిపప్పు పొట్లం, ఏవో రెండు రకాల కూరగాయలు, చిన్న చిన్న బాటిళ్ళలో పాలు, పెరుగు, నూనె, బియ్యం అన్నీ ఉన్నాయి. ఆశ్చర్యంగా అవన్నీ చూస్తూ రెండో సంచీ తీసింది. ఒక పాతబడ్డ స్టవ్వు,కిరసనాయిలు రెండు గిన్నెలు ఇంకా ఏవో ఉన్నాయి.
"ఇవన్నీ దేనికి వింతగా అడిగింది. 
"దేనికి ఏమిటి? వంటకి..." 
వంట? ఎవరు చేస్తారు? కళ్ళు పెద్దవి చేసి అడిగింది. 
“ఎవరు చేస్తారు? నువ్వే..." అతను తలతిప్పకుండా చూస్తూ అన్నాడు. 
నాకు వంట రాదు. "
“చక్కగా వస్తుంది. తినడం వచ్చిన వాళ్ళకి చేయడం ఎందుకు రాదు? నాలుకే నేర్పుతుంది..."కటువుగా అన్నాడు.
“అయినా ఇవన్నీ నాకెందుకు? నన్ను పంపించెయ్యి"
“ఎక్కడికి?" 
“ఎక్కణ్ణుంచి తెచ్చావో అక్కడికే...." 
“నే పంపను. నువ్వు వెళ్ళదలచుకుంటే వెళ్ళు."
“నువ్వు కనిపించడం లేదని మీ డాన్సు గ్రూపు మునలిది కేసు పెట్టింది. ఏడో కారణం చూపించి పోలీసులు బొక్కలో తోస్తారు." నిదానంగా కింద కూర్చుని కాళ్ళు చాచుకుంటూ చెప్పాడు. 
(సశేషం)

No comments:

Post a Comment

Pages