రాణి ఝాన్సీ రెజిమెంట్ కు నాయకత్వము వహించిన జానకి తేవర్ - అచ్చంగా తెలుగు

రాణి ఝాన్సీ రెజిమెంట్ కు నాయకత్వము వహించిన జానకి తేవర్

Share This
18 ఏళ్ల వయస్సులోనే బర్మాలోని ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యములోని రాణి ఝాన్సీ రెజిమెంట్ కు నాయకత్వము వహించిన జానకి తేవర్
అంబడిపూడి శ్యామసుందర రావు          

బ్రిటిష్ మలయ  ప్రాంతములో స్థిరపడ్డ ఒక సంపన్న తమిళ కుటుంబములో పుట్టిన జానకి 16 ఏళ్ల వయస్సులో 1943లో సుభాష్ చంద్ర బోస్ సింగపూర్ ఐఎన్ఎ లో వాలంటీర్లను చేర్చుకోవటానికి ఫండ్స్ పోగుచేయటానికి వచ్చినప్పుడు అక్కడి భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగము విన్న అశేష ప్రజానీకంలో జానకి ఒకరు.  నేతాజీ ఉత్తేజపూరితమైన ప్రసంగము  పదునైన మాటలు ఆవిడను బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకముగా పోరాడాలి అన్న దృఢ సంకల్పానికి తెచ్చాయి. ఆ ప్రసంగము విన్న చాలా మంది  బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకముగా ఆయుధ పోరాటం చేయాలనీ నిశ్చయించుకున్నారు. మొట్టమొదట జానకి తన బంగారు ఆభరణాలను తీసి నేతాజీకి ఐఎన్ ఏ విరాళముగా ఇచ్చింది అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధ సమయములో బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా పోరాడటానికి నేతాజీ ఏర్పాటుచేసిన రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ (RJR) లో చేరాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించింది. సహజముగా ఆవిడా కుటుంబ సభ్యులు ఆవిడా నిర్ణయాన్ని వ్యతిరేకించారు కానీ దేశభక్తిపూరితురాలైన జానకి అతి కష్టము మీద తన తండ్రిని ఝాన్సీ రెజిమెంట్ లో చేరటానికి ఒప్పించింది తండ్రికి వేరే మార్గము లేక ఒప్పుకున్నాడు. అప్పటి ఝాన్సీ రెజిమెంట్ నియమాల ప్రకారము ఎవరైనా స్త్రీ చేరాలి అంటే పెళ్లికాని యువతి అయితే తండ్రి అంగీకారము పెళ్లి అయినా మహిళ  అయితే భర్త అంగీకారము ఉండాలి ఆవిధముగా తండ్రి అంగీకారంతో జానకి ఝాన్సీ రెజిమెంట్ లో చేరింది. 
రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ సింగపూర్ లోని వాటర్లు వీధిలో అక్టోబర్ 22, 1943లో ప్రారంభించబడింది ఐఎన్ ఏ లోని మొదటి 500 పోరాడే  రాణులలో జానకికి ఒకరు.క్యాప్టెన్ లక్ష్మి స్వామినాధన్ (తరువాత లక్ష్మి సెహగల్ ) నాయకత్వము  లో వీరు తర్ఫీదు పొందారు.లక్ష్మి సింగపూర్ లో స్థిరపడ్డ ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రస్ నాయకుడి కూతురు రోజు జరిగే కవాతులో వీళ్ళు రాత్రి కవాతులు, బోనెట్ ఛార్జింగ్ ,అయిదాలతో దాడి ప్రతిదాడి తుపాకులు మెషీన్ గన్లు, గ్రెనేడ్లు వంటివాటిని ఉపయోగించటం నేర్పేవారు ఈ శిక్షణ చాలా కఠినముగా ఉండేది ఈ శిక్షణలో వారి కుటుంబ నేపధ్యము లేదా ఆర్ధిక స్థితి గతులు మొదలైనవి పట్టించుకొనేవారు కాదు. ఈ రెజిమెంట్ లో చేరిన స్త్రీలు మళ్ళా తిరిగి ఇంటికి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ అని తెలిసి కూడా చేరారు అంటే క్యాంపు లోని గడిపే జీవితాన్ని ఇంటిలో గడిపే భద్రమైన జీవితము  కన్నాగొప్పది అని భావించి చేరినవాళ్ళే ఝాన్సి  రాణి రెజిమెంట్ లో వారి పాత్ర భారత దేశ దాస్య విముక్తికి ఎంత అవసరమో పూర్తిగా గుర్తెరిగి చేరినవాళ్ళే.
జానకి క్రమముగా ఏప్రిల్ 1944 నాటికి లెఫ్టినెంట్ హోదాకు చేరుకుంది. క్యాప్టెన్ లక్ష్మి మేమియో బేస్ హాస్పిటల్ కు బదిలీ అవటం వల్ల 18 ఏళ్ల వయస్సుకే బర్మాలోని(నేటి మయన్మార్) రాణి ఝాన్సీ రెజిమెంట్ కు కమాండర్ అయింది .తరువాతి నెలలలో జానకి రంగూన్ లోని రెడ్ క్రాస్ ఆసుపత్రిపై బ్రిటిష్ వారు బాంబులు వేసినప్పుడు సహాయక చర్యలలో పాల్గొంది. ఆతరువాత నేతాజీ వెంబడి ఉండి తన సహచరులు వారి ఇళ్లకే క్షేమముగా చేరటానికి సహాయ పడింది.బ్రిటిష్ వారు యుద్ధము గెలవటం వల్ల INA రద్దు అవటం చేత జానకి మలయా  లోని ఇండియన్ కాంగ్రెస్ మెడికల్ మిషన్ లో చేరింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పని ఆవిడను ప్రభావితము చేసింది. ఫలితముగా జాన్ థీవి తో కలసి 1946లో మలయన్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపించింది. 1948లో జానకి అతి నహప్పన్ (మలయాళం, తమిళము డైలీ పేపర్ ఎడిటర్) ను పెళ్లాడింది. 

తరువాతి సంవత్సరాలలో జానకి సాంఘిక సంక్షేమము పట్ల  గల ఆసక్తితో ప్రజలకు సేవ చేయాలి అన్న ఆలోచనతో బాలికల గైడ్ అసోషియేషన్,నేషనల్ కౌన్సిల్ ఆఫ్ విమెన్ ఆర్గనైజేషన్ వంటి సంస్థల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంది. ఆవిడా సేవాతత్పరత అలుపెరుగని శ్రమ లకు గుర్తింపుగా ఆవిడను మలేషియన్ పార్లమెంట్ ఎగువ సభకు సెనెటర్ గా ఎన్నుకున్నారు. అంతేకాకుండా దేశ  విదేశాలలో అనేక అవార్డులను సంపాదించుకుంది. భారత దేశము వెలుపల ఉండి పద్మశ్రీ అవార్డు గెలుచుకున్న మొట్ట మొదటి మహిళా జానకి. ఆవిడ  ధైర్య సాహసాలకు మారు పేరుగా నిలిచింది కానీ INA లో చేరి నేతాజీతో కలిసి క్లిష్ట కాలములో పనిచేసి, యుద్దములో బ్రిటిష్ వారిని ఓడించి స్వాతంత్రము సంపాదించుకోవాలి అన్న ఆవిడ కల నెరవేరలేదు ఆవిడకు ఉన్న కమిట్ మెంట్ స్వాతంత్రము పట్ల గల ఉన్నతమైన ఆకాంక్ష అభిలాష ఆవిడను భారతీయులు సదా గుర్తుంచు కొనేటట్లు చేశాయి  

***            

No comments:

Post a Comment

Pages