అన్నమయ్య సూక్తి చంద్రిక(141-160) - అచ్చంగా తెలుగు

అన్నమయ్య సూక్తి చంద్రిక(141-160)

Share This
అన్నమయ్య సూక్తి చంద్రిక(141-160)
(అన్నమయ్య  కీర్తనలలోని  సూక్తులకు  ఆంగ్ల లిప్యంతరీకరణము, ఆంగ్లానువాదము,  వివరణములు )
           -డా. తాడేపల్లి పతంజలి

141
విడువుము మనసా వీరిడి చేతలు
తడయక శ్రీహరి దలచవొ యికను (4-216)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Viḍuvumu manasā vīriḍi cētalu
taḍayaka śrīhari dalacavo yikanu (4-216)
వివరణం.
ఓ మనసా!
వివేకంలేని నీ లౌకికపు పనులు విడిచిపెట్టు. 
ఆలస్యము చేయకుండా ఇకనైనా శ్రీ హరిని- వేంకటేశ్వరుని తలచుకో.
ఆంగ్లానువాదము
O my mind!
Leave your secular deeds without prudence.
Think about Shri Hari -Venkateshwara without any delay.
142
నటనల భ్రమయకు నామనసా
ఘటియించు హరియే కలవాడు (4-317)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Naṭanala bhramayaku nāmanasā
ghaṭiyin̄cu hariyē kalavāḍu (4-317)
వివరణం.
ఓ మనసా!
లోకంలో తమ అవసరాలు గడుపుకోవటానికి జనులు ప్రవర్తించే కపటప్రవర్తనములలో భ్రమించకు. వాటిని నమ్మకు. 
సృష్టిని కలిగించు వేంకటేశ్వరుడే మనందరికి ఆప్తుడు.అతనినే నమ్ము. 
ఆంగ్లానువాదము
O my mind!
Do not be fooled by the hypocritical behavior of the people in order to meet their needs in the world. Dont Trust them.
 The Venkateshvara is the creator a bosom friend, a relative or friend who is faithful, attached, devoted, trusty, or confidential.. Trust him.
143
వెఱవకు మనసా విష్ణుని యభయము
నెఱవుగ నెదుటనె నిలిచినది(3-276)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Veṟavaku manasā viṣṇuni yabhayamu
neṟavuga neduṭane nilicinadi(3-276)
వివరణం.
ఓ మనసా!భయపడకు.
విష్ణురూపుడైన వేంకటేశ్వరుడు అభయం ఇస్తూ మన ఎదు ట అధికునిగా ఉన్నాడు.
ఆంగ్లానువాదము
O my mind!
Do not be afraid.
Lord Venkateswara, who is the form of Vishnu is in front of us to protect us.
144
బాపు బాపు దేవుడా పంతపు వో మనసా
వోపెగా యిందుకు జీవుడోహో నీ మాయ(3-276)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Bāpu bāpu dēvuḍā pantapu vō manasā
vōpem̐gā yinduku jīvuḍ'̔ōhō nī māya(3-276)
వివరణం.
దేవుడా ! పంతములాడు  ఓ మనసా!
బాపు బాపు( సంతాపార్థకం.) 
నీ మాయను ఇందుకొరకు( బతుకుట కొరకు) జీవుడు ఓర్చుకొన్నాడు కదా ! 
నిన్నటిదినము నేడు నిజమో కల్లో తెలియదు. 
నిన్న టిదినం కన్నులలో కనబడుతుంది. కాని మళ్లీ నిన్నని చూద్దామంటే కనబడదు. 
రేపటిదినమేమిటో తెలియదు. 
నీకుతోడుగా- నేను బతికినంతకాలం నీ మాయకు లోబడి పంతాలు పోయే మనసు. 
ఓ హో ! ఏమిటి నీ మాయ!
ఆంగ్లానువాదం
O God ! O my wager mind!
Bapu Bapu (an interjection expressing sorrow).
The living system bears for your magic to live!
145
ఇంకా రోయదు నాకు నేటిమనసు
కొంకులేని నావంటి కూళలూ గలరుగా(14-302)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Iṅkā rōyadu nāku nēṭimanasu
koṅkulēni nāvaṇṭi kūḷalū galarugā(14-302)
వివరణం.
ఓ వేంకటేశ్వరా ! నా మనస్సు ఇంకా అసహ్యకరమైన విషయాల మీద రోత తెచ్చుకోవటం లేదు. 
ఏమి మనస్సిది?
చెడువిషయాలు చేయటంలో పాప భయం లేని నా వంటి క్రూరులు ఇంకా ఉన్నారు. 
ఆంగ్లానువాదము
O Venkateswara! My mind does not get disturbed yet.
What mind is this ?!
There are still savages like me who have no fear of doing bad things
146
ఏమి సేతు నా మనసు యెందుకు నొడబడదు(17-534)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Ēmi sētu nā manasu yenduku noḍabaḍadu(17-534)

వివరణం.
ఓ వేంకటేశ్వరా ! 
ఏమి చేయగలను?
నా మనస్సు ఏ విషయంలోనూ పూర్తిగా సంతోషపడదు...ఒప్పుకోదు.
ఆంగ్లానువాదము
O Venkateswara!
 What can i do?
My mind does not like anything totally.
147
మనసుకుజల్లన నీమక్కువ తలపులె (20-313)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Manasukujallana nīmakkuva talapule (20-313)
వివరణం.
ఓ వేంకటేశ్వరా ! 
నా మనస్సుకు  చల్లదనం  కలిగించేవి  ఇష్టమయిన    నీ ఆలోచనలు మాత్రమే.
ఆంగ్లానువాదము
O Venkateswara!
The coolest of my mind is your favorite thoughts.
148
నంటున నిన్ను మరిగె నా మనసు (29-511)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Naṇṭuna ninnu marige nā manasu (29-511)
వివరణం.
ఓ వేంకటేశ్వరా ! స్నేహంతో నిన్ను నామనస్సు ఇష్ట పడుతోంది.
ఆంగ్లానువాదము
O Venkateswara! I love you with friendship..
149
ఏమి సేతురా నా మనసు యెంతైనా బట్టగలేను (28-497)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Ēmi sēturā nā manasu yentainā baṭṭagalēnu (28-497)
వివరణం.
ఓ వేంకటేశ్వరా !
ఏమి చేస్తాను చెప్పు!
నిన్ను చూస్తుంటే ఎంతసేపయినా అలాచూడాలనిపిస్తుంది.
ఎంత చేసినా- నిన్ను చూడకుండా ఉండలేని క్షణాన్ని- పట్టలేకపోతున్నాను - ఆపలేకపోతున్నాను. సహించలేకపోతున్నాను. 
ఆంగ్లానువాదము
O Venkateswara!
Tell me what to do!
I want to see you always.
150
పుక్కట తుమ్మిదకును పువ్వులెన్ని కలిగినా
తక్కిన చుట్టపు పొందు తామరే కాదా (07-197)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Pukkaṭa tum'midakunu puvvulenni kaliginā
takkina cuṭṭapu pondu tāmarē kādā (07-197)
వివరణం.
అలమేలు మంగమ్మ చెబుతున్నది
ఓ వేంకటేశ్వరా !
నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా - చివరికి నా ఇంటికి రావలిసినదే.

ప్రయత్నము ఏమీ చేయకుండానే (పుక్కట) తుమ్మెదకు పువ్వులెన్ని లభించినా- 
తుమ్మెదకు నిజమైన బంధువు పద్మమే కదా !. 
ఆంగ్లానువాదము
Alamelumangamma is telling ;
O Venkateswara!
Where did you go back !?Finally come to my home only..
Even if the flowers are obtained without effort,
the large black carpenter bee's true cousin is lotus.Whether or not!?. 
151
ఓరుపే నేరుపు సుమ్మీ వువిదలకు(7-248)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Ōrupē nērupu sum'mī vuvidalaku(7-248)
వివరణం.
స్త్రీలకు ఓర్పు - నేర్పును కలిగిస్తుంది .. 
ఆంగ్లానువాదము
Patience gives skill to women.
152
సమ్మతించిన మాటకు జగడములున్నావా(8-204)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Sam'matin̄cina māṭaku jagaḍamulunnāvā(8-204)
వివరణం.
ఇష్టమో- కష్టమో - ఒకటి ఒప్పుకొన్న తర్వాత ఇక తగాదాలు ఏముంటాయి? నువ్వే చెప్పు!. 
ఆంగ్లానువాదము
Relish or dislike - What more fights after one consent? Tell me
153
రాగా రాగా వలపులు రచ్చబడీని(8-27)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Rāgā rāgā valapulu raccabaḍīni(8-27)
వివరణం.
క్రమక్రమంగా  ఇంట్లో గుట్టూ చప్పుడు కాకుండా ఉండవలసిన భార్యాభర్తల  ప్రేమలు వీథికి ఎక్కుతాయి.
ఆంగ్లానువాదము
Eventually the romance of the husband and wife which must be secrecy at home can climb to the streets.
154
మనసువచ్చినవారి మనవులెల్లా
కనుసన్నలోననే కైకొందువపుడే(8-18)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Manasuvaccinavāri manavulellā
kanusannalōnanē kaikonduvapuḍē(8-18)
వివరణం.
ఓ వేంకటేశ్వరా ! నీపట్ల శ్రద్ధ కలిగిన భక్తుల విజ్ఞప్తులను , కనుసైగల ద్వారా స్వీకరిస్తావు. 
ఆంగ్లానువాదము
O Venkateswara! You will receive the requests from the devotees who are interested in you, through your winks( signs with the eyes)
155
ఏమి సేతు నాగుణ మీపాటిది
కామించి నీవుగాగా గైకొనేవు గాని(9-3)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Ēmi sētu nāguṇa mīpāṭidi
kāmin̄ci nīvugāgā gaikonēvu gāni(9-3)
వివరణం.
ఓ వేంకటేశ్వరా ! 
ఏమి చేస్తాను చెప్పు! నన్ను క్షమించు
నా గుణము ఇలాంటిది. 
నిన్ను నేను బాగా ప్రేమించలేను
నువ్వే నన్ను బాగా ప్రేమించవయ్యా!
నువ్వే నన్ను గ్రహించాలి కాని, నేను నిన్ను గ్రహించలేను.
ఆంగ్లానువాదము
O Venkateswara!
Tell me what to do! 
Forgive me 
My attribute is like this.
I can not love you very much but You love me very well! 
Please understand me, but I can not understand you
156 
అలిగేదె సహజము ఆడువారికి(9-6)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Aligēde sahajamu āḍuvāriki(9-6)
వివరణం.
ఓ వేంకటేశ్వరా ! 
ఆడువారికి కోపము సహజమైన గుణము
ఆంగ్లానువాదము
O Venkateswara! Anger is a natural character to women.
157 
మచ్చిక నాకలివేళ మంచి విరు లింపవునా(9-42)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Maccika nākalivēḷa man̄ci viru limpavunā(9-42)
వివరణం.
ఓ వేంకటేశ్వరా ! 
ఆకలి వేసినప్పుడు పువ్వులు తింటామా? 
ఆంగ్లానువాదము
O Venkateswara! we Do not eat flowers when appetizing
158 
పూవక పూచిన వెల్లాబూపలయ్యీనా(9-42)
ఆంగ్ల లిప్యంతరీకరణము
Pūvaka pūcina vellābūpalayyīnā(9-42)
వివరణం.
ఓ వేంకటేశ్వరా ! 
అపురూపంగా పూసినంతమాత్రము చేత (=పూవక పూచిన) ప్రతి పువ్వు -పువ్వు కాదు. 
అపురూపమయిన మనిషి జన్మ ఎత్తినంత మాత్రాన ప్రతి మనిషి మనిషి కాడు.
నీదగ్గరకు చేరి నిన్ను సేవించినవాడే మనిషి. 
ఆంగ్లానువాదము
O Venkateswara! Every seldom flower is not a great flower .Every human being is not a man of great value.He was a man who came to you and served you.
159 
ఆకసపు మొయిలేడ అడవినెమలి యాడ
దాకొని వింతగుచూపు తరితీపు దానే
ఆంగ్ల లిప్యంతరీకరణము
ākasapu moyilēḍa aḍavinemali yāḍa
dākoni vintagucūpu taritīpu dānē(9-49)
వివరణం.
అలమేలు మంగమ్మ రూపంలో అన్నమయ్య చెలికత్తెతో చెబుతున్నాడు.
చెలీ ! 
ఆపక్క ఇష్టమయితే ఈ పక్క ఇష్ట మవుతుంది.
అతడు ఏదిక్కున ఉంటే ఆ దిక్కును తన దిక్కు అనుకొని ఇష్టపడ్డాను కదే.
ఆకాశములో ఉండే మేఘము ఎక్కడ?
అడవినెమలి ఎక్కడ? 
రెండింటికి మధ్య ఎంత దూరం? 
ఎంత దూరంగా ఉన్నా- 
వాడు దాగి ఒక వింత చూపు చూస్తే చాలు-
నా శరీరంలో కోరికలు నాట్యమాడుతాయి. కదా !
ఆంగ్లానువాదము
Where is the cloud in the sky? 
Where is the peacock in the forest?
How far is that between two We do not know
No matter how far away-
But- If  he watched a strange sight hidden-
The desires of my body dancing. Is not it?!
160 
గోర బొయ్యేదాని కింత గొడ్డ లేల
ఆంగ్ల లిప్యంతరీకరణము
Gōra boyyēdāni kinta goḍḍa lēlam'ma (9-140)
వివరణం.
చెలికత్తె రూపంలో అన్నమయ్య అలిమేలు మంగమ్మతో చెబుతున్నాడు.
చెలీ ! 
అంతలోనే నిందించి, అంతలోనే క్షమించమని అడుగుతావేం? ! 
గోటితో పోయే దానికి గొడ్డలి ఎందుకు? 
ఆంగ్లానువాదము
Annamayya tells Alamelumangamma in the form of a confidante.
Wow!
Would you blame it and ask for forgiveness in the meantime? !
Why axes where the nail fits?

*****

No comments:

Post a Comment

Pages