యత్ర యత్ర రఘునాధ కీర్తనం - అచ్చంగా తెలుగు

యత్ర యత్ర రఘునాధ కీర్తనం

Share This
 యత్ర యత్ర రఘునాధ కీర్తనం  .
  ఆదూరి.హైమవతి.

          అంజనా నందనం వీరం జానకి శోక నాశనం
         కపిశ మక్ష హంతరం , వందే లంక భయంకరం
         మనోజవం మారుత తుల్యవేగం , జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్ 
         వాతాత్మజం వానర యూధ ముఖ్యం , శ్రీ రామ దూతం శిరసా నమామి .   
   జితేంద్రియుడు,  బుద్ధిమంతుడు, సీతశోకాన్ని పోగొట్టిన అంజనా తనయుడైన  హనుమను మన కు ధైర్య స్థైర్యాలకోసం ప్రార్ధిస్తాం. 
ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్ష మవుతారని మన విశ్వాసం. ఎక్కడ  హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులవారు తప్పక ఉంటారు.శ్రీరాముని పేరు వినగానే  మనకు ఆంజనేయస్వామి తప్పక గుర్తువస్తారు. 
 హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడనీ , మారుతి అనీ ఇంకా అనేకనామాలతో కొలిచి కీర్తిస్తుంటారు . రామాయణంలో రాముని కున్నంత ప్రాముఖ్యం హనుమకూ ఉంది.హనుమాన్ అంజనా దేవి, కేసరిల సుతుడు.చైత్ర శుధ్ధ పౌర్ణమి నాడు , మూలా నక్షత్రాన,మహారాష్ట్ర లోని, త్రయంబకేశ్వరంలో జన్మించినట్లు ఒక కధ.   
      వేదాల లోని ఒక  కధ ఆధారంగా, అంజనాదేవి  పుంజికస్థల అనే ఒక అప్సరస అనీ, శాప వశా న భూలో కంలో వానర వంశం లో జన్మించిందనీ, రుద్ర దేవుడైన శివుని వరంవల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలవు తుందని, అందు వల్ల ఆమె భర్తతో కూడి శంకరుని అతిభక్తితో ధ్యానించి , ఆ రుద్రుని వరంతో ,ఆయన అంశతో ఆంజనేయుని పుత్రునిగా పొందింది.హనుమకు 28 మహిమలు లభించాయి, ఆకాశగమనం , శరీరాన్ని పెంచడం , కుంచించడం వంటివి. 
       మరొక చారిత్రక కధనం ప్రకారం కర్ణాటక లోని,హంపీ వద్ద గల ' గుంలవ్య తోట ' అనే గ్రామానికి 18 కి.లో మీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతం లోని 'అంజనిగుహ 'లో , పంపానదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది. 
వాల్మీకి రామాయణంలోని యుధ్ధ కాండలో కేసరి బృహస్పతి కుమారుడనీ,రామ రావణ యుధ్ధసమతం   లో ఆయన రాముని సేనలో చేరి యుధ్ధం చేసినట్లు ఉంది. అయోధ్యలో దశరధమహారాజు సంతానం కోసం 'పుత్రకామేష్టి 'యాగం చేయగా , యఙ్ఞ పురుషుడు ప్రసాదించిన పాయసాన్ని, మహారాజు ముగ్గురు రాణులకూ పంచగా,సుమిత్ర భాగమున్న పాత్ర ను ఒకగ్రద్ద తన్నుకుని ఆకాశంలో వెళుతూ విడచి వేయడం తో అదివెళ్ళి శివుని భక్తితో ప్రార్ధిస్తున్న అంజనా దేవి దోసిట్లో పడటం ఆమె దాన్ని దైవ ప్రసాదంగా   
 భావించి భక్తితో స్వీకరించగా ,ఆమెకు ఆంజనేయులు జన్మించినట్లు రామాయణంలో ఉంది. అందుచేతే రాముడు హనుమను తన నాల్గవ సోదరునిగా ఆదరించారు.
      ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగా భావించి నోటకరచుకోగా ,దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి చెంప ఉబ్బడంతో ' హనుమ 'అనే నామం ,వచ్చినట్లు కూడా చెప్తారు. సూర్యుని హనుమ తనగురువుగా భావించి సేవించి ,ఆ సూర్యదేవుని నుండిసకల శాస్త్రఙ్ఞానం పొంది , గురుదక్షిణగా సూర్య కుమారుడైన , సుగ్రీవుని సేవించను అంగీకరిస్తాడు. ఇది ఆయన సత్య వాఃక్ దీక్షకు, గురు భక్తికీ  తార్కాణం.

   మహిరావణుడు యుధ్ధసమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినపుడు , ఆంజనేయ స్వామి వెళ్ళి , మహి రావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసి వచ్చి పంచ ముఖా లతో,వరాహ ముఖంతో ఉత్తరదిశన,నరసింహ ముఖంతో దక్షిణ దిశన,గరుడ ముఖంతో పడమర దిశన ,హయగ్రీవ ముఖంతో ఆకాశంవైపు ,తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపా లను ఒకేసారి ఆర్పేందుకు ' పంచముఖ ఆంజనేయులు’ గా రూపు దాల్చారు. ఇది ఆయన స్వామి కార్య దీక్షకు నిదర్శనం .

    యుధ్ధానంతరం హనుమ హిమాలయ పర్వతం మీద నివసిస్తూ 'హనుమద్రామాయణాన్ని’తన గోళ్ళతో వ్రాయగా, వాల్మీకి మహర్షి వచ్చి ,ఆరామాయణాన్నిచదివి, అసంతృప్తి వ్యక్త పరచగా , హను మ కారణ మడుగుతాడట!, అప్పుడు వాల్మీకి మహర్షి 'ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రిం చ నందున అది అసంపూర్తిగా ఉన్నందున తనకు అసంతృప్తి కలిగించిన దని ' చెప్పగా హనుమ తన రామాయణాన్ని ఉపసంహరించుకుంటాడు! ఎంత నిరాడంబరత!! అందుకే హనుమను ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని ,గర్వాహంకారాలు పోతాయనీ అంటారు.అందుకే అందరూ రాముని తో సమానంగా హనుమ ను పూజిస్తారు.                                                                             భారతదేశంలోనే గాక ప్రపంచదేశాలలో హను మాన్ ఆలయాలు విలసిల్లి ఉన్నాయి  . 
         హిమాచల్ ప్రదేశ్ రాజధానిఐన ' శింలా 'లోని 'జాఖూ ' హనుమాన్ ఆలయం ప్రసిధ్ధి చెంది నది. ఈకొండపై యక్ష, కిన్నర ,గంధర్వ,కింపురుషులు , నివసించేవారనీ , హనుమ ఆకాశంపైకి ఎగ రను కాలూనగా ఆకొండ సగానికి భూమిలోకి దిగి పోయిందని ,హనుమ కాలూనిన చోట ఆలయం వెలిసిందనీ చెప్తారు. 
    883 ఏ.డి.నాడు ఖుజరహో లో ఆజనేయ ఆలయం ఉన్నట్లు శిలా శాసనాల వలన తెలుస్తోంది’. సంకటమోచన హను మాన్మందిరం’ పంజాబ్లోని’ఫిల్లూర్లో‘ఉంది.తమిళనాడులోని'నమ్మక్కళ్'లో ఉన్న ఆంజనేయ విగ్రహంఎత్తు 18 అడుగులు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆంజనేయ విగ్రహం ఎదురు గా ఉన్నలక్ష్మీ నారాయణస్వామికి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటుంది.ఈ విగ్రహం స్వయంభూ ఐనందున పెరుగుతూనే ఉండటాన పైన కప్పువేయను వీలుకాలేదని ఆలయ కధనం వలన తెలు స్తోంది.  
  వెల్లూరు జిల్లాలోని ఆర్కోణానికి 30. కిలోమీటర్లదూరంలో’ యోగ నరసింహ ఆలయానికి సమీపం లో,యోంగాజనేయ ఆల యం చిన్న కొండమీద ఉంది .ఆలయంచేరను 480 మెట్లు ఎక్కాలి. ఆంజనే యమూర్తి చతుర్భుజాలతో ,రెండు చేతుల తో శంఖుచక్రాలు,మరో రెండు హస్తాలతో జపమాల ధరిం చి’ యోగ నరసింహ స్వామి’ని వీక్షిస్తున్నట్లు ఉంటుంది .’ యోగ నరసిం హస్వామి ‘, యోగామృత వల్లి ఉండే ఆలయంలోనికి పెరియవైకొండ మీదకు1305 మెట్లు ఎక్కాలి. 
 భక్తులు ఎంత శ్రధ్ధగా శ్రమపడి ప్రార్ధిస్తారో దేవుని అనుగ్రహం అంత అధికంగా లభిస్తుందనేది భక్తుల నమ్మకం. 
   కర్ణాటక రాష్ట్రం రాజధాని బెంగుళూర్ లోని జె.పి .నగర్లో వెలసి ఉన్నఆంజనేయ స్వామి విగ్రహం ఒక గుట్టపై ఉంది. దీనిని మహామహిమాన్వితమైన ఆలయంగా భక్తులు సేవిస్తారు. మహారాష్ట్ర రాజ ధాని ముంబాయ్ లోని  ఎస్.ఐ ఇ.ఎస్  కాంప్లెక్స్ లోని హనుమాన్ విగ్రహం ఎత్తు 33అడుగులు [ 10.మీట ర్లు] . 12.అ.ఎత్తైన ప్లాట్ ఫాం మీద ప్రతిష్టించ బడి ఉంది. మొత్తం విగ్రహం ఎత్తు భూమి నుండి 456.అ. [14.మీ] .వెండి కవచం తో ఈ మారుతీ విగ్రహం కప్పబడి ఉంది. 
            
     135.అ.ఎత్తైనఆంజనేయ విగ్రహం హైదరాబాద్ వద్ద గల పరిటాలలో 2003 లోప్రతిష్టింప బడింది . సాగరపురంలో ప్రతిష్టింపబడిన ఆంజనేయ విగ్రహం దుష్టగ్రహాలను దూరం చేసేదిగా ప్రసిధ్ధి పొందింది. ప్రతిష్ట సమయంలో సజీవంగా కదిలిందని చెప్తారు.
   తమిళనాడులోని కన్యాకుమారికి సమిపంలో 8 అ. ఎత్తైనమారుతీ విగ్రహం ఉంది. కేరళ తిరువ ళ్ళూరుకు 5, 6 కి.మీ. దూరంలో ఉన్న' చిన్నకవియూర్ 'లోని శివాలయంలో వంద . సం.క్రితం పంచ లోహాలతో నిర్మించబడిన హనుమాన్ విగ్రహం ఉంది. కుంభకోణంలో40.అ. ఎత్తైన[12.మీ] పంచ ముఖ ఆంజనేయస్వామి విగ్రహం గ్రానైట్ రాతితో  మలచ బడి ఉంది.తిరువళ్ళూర్లో పంచముఖ ఆంజనేయ విగ్రహం భక్తుల భయాలు దూరంచేసే అభయ మూర్తిగా నిలచిఉంది .
      హనుమాన్ ఒక్కడే శని ప్రభావం సోకని వానిగా చెప్తారు. రావణుని నుండీ విముక్తి పొందిన శని దేవుడు,హనుమాన్ పట్ల కృతఙ్ఞతగా,'మారుతిని పూజించే వానికి తనదృష్టి  ' సోకదని వాగ్దానం చేశా డుట!
    కేరళ రాష్ట్రంలోని తిరువళ్ళూర్ వద్ద గల ,మల్లాపురం జిల్లాలో వశిష్ఠుల వారిచే 3000వేల సం. క్రితం.[1,000.బి.సి} ప్రతిష్టింప బడిన హనుమాన్ మూర్తి అతి ప్రాచీన మైనదిగా గుర్తింపబడి ఉంది. అలధియూర్ లోనిహనుమాన్ ఆలయంలోఒక పెద్ద వేదికపై నున్నఒక గ్రానైట్ రాతిపై సముద్రచిత్రం చిత్రించి ఉండగా భక్తులు దూరం నుండీ పరుగుతీస్తూ వచ్చి హనుమాన్ సముద్రాన్ని లంఘించిన దానికి చిహ్నంగా  ఈరాతిపై నుండి దూకుతారు. 
   దీనివల్ల ఆభక్తుల బాధలు, కష్టాలు తీరిపోయి, ఆరోగ్యం,భాగ్యం, దీర్ఘాయువు కల్గి, అదృష్టం కలసి వస్తుందని విశ్వాసం.ఈ’ అలధియూ హనుమాన్ ‘ఆలయ దర్శనం భక్తుల మానశిక శారీరక రుగ్మత లు బాపడమే గాకవారి సర్వ కోరికలూ ఈడేరుతాయనే సంపూర్ణ నమ్మకం ఉంది. అందువల్లే భక్తులు తప్పక జీవితంలో ఒక్క సారైనా ఈ ’ అలధియూర్ ‘హనుమను దర్శించి తరిస్తారు. 
  అహమ్మదాబాద్ లోని కంటోన్ మెంటు ప్రాంతంలో’ షహీబాగ్ సమీపంలోని ' క్యాంప్ ' హనుమాన్ ఆలయం ,పండిట్ గజా ననప్రసాద్ నూరుసంవత్సరముల క్రితం కట్టించారు. భారత ప్రధానులైన , అటల్ బిహారీ వాజ్ పేయ్ ,ఇందిరాగంధీ వంటి ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చెప్తారు.
    రామ చరిత మానస్,హనుమాన్ చాలీసా వ్రాసిన తులసీదాస్[1532-1623] ఢిల్లీలోని హను మాన్ ఆలయాన్ని దర్శించి న దాఖలాలు ఉన్నాయి. ఈఆలయంలో 24 గంటలూ '--శ్రీరామ జయ రామ జయజయ రామ --' అనే మంత్రాన్ని1964 ఆగస్టు ఒకటవ తేదీనుండి నిరాటంకంగా జరుగు తుండటం విశేషం.
     గత అమెరికా అధ్యక్షుడైన 'బారక్ ఒబామా 'అధ్యక్షునిగా పోటీ చేస్తున సమయంలో ,ఈ ఆలయ మూర్తి ఐన హనుమ విగ్ర హాన్ని , ఆయన శ్రేయోభి లాషులు,ఆయన విజయం కాంక్షించి ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు మనం వార్తా పత్రిక ల్లో చదివాం.15 కె.జిల బరువైన , బంగారు పూతతో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని పవిత్రంగా పూజించి ఆయనకు అందజేశారు, ఆయన దాన్ని భక్తితో స్వీకరించడం , విజయం సిధ్ధించడం జరిగింది. రెండవమారూ అమేరికా అధ్యక్షునిగా ఎన్నికై గొప్ప వానిగా కూడా గుర్తింపుపొందడమూ మనకు తెల్సు. 
         ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపం లోని' గొడుగుపేట ' లోని ప్రసన్నాం జనేయ ఆలయం  ప్రసిధ్ధిచెందిన మరో మారుతీ ఆలయం. ఆగమ శాస్త్రప్రకారం దక్షిణ ముఖంగా ఉన్న ఆంజనేయస్వామి వారిని దర్శించిన వారి కోర్కెలు తీరుతాయని నమ్మిక.
   ఈ ఆలయ సంప్రోక్షణ సమయంలో 19వ శతాభ్ధిలో కుర్తాళం మఠాధిపతి పూజచేస్తున్న సమయం లో వర్షం అతిగా కురిసి , అలయం చుట్టూతా ఉన్నవీధులు వరద తాకిడిగి గురైనా  ,ఆలయం లోపల మాత్రం ఒక్కనీటి చుక్కైనా పడలేదట!    
    మరొక యోగాంజనేయ ఆలయం చెన్నయ్ లోని '  క్రోంపేట ' వద్ద ఉంది.1930 సం.లో ఈప్రాం తంలో నివసించే 13.సం.బాలికకు కలలో ఆంజనేయస్వామి కనిపించి ఆప్రాంతం లో తనకు ఆలయం నిర్మించమని ఆదేశించి నట్లూ , ఆమె తన తల్లి దండ్రులకు చెప్పగా  ,కంచి మఠపీఠాధి పతులుచంద్ర శేఖర సరస్వతీ స్వామీజీ వారు ఆప్రాంతానికి వచ్చి నపుడు ,ఆబాలిక స్వామిజీతో తన స్వప్నం విష యం  చెప్పగా ,స్వామీజీ తన భక్తులతో ,ఆలయ ప్రాంతంలో వెదికించగా  , ప్రస్తుతం ఆలయం నిర్మిం చ బడి ఉన్న ప్రాంతంలో ఆంజనేయ విగ్రహం  లభించినట్లు ,ఆతర్వాత ' తిరుమల తిరు పతి దేవస్థా నం వారు ' ఆలయాన్ని నిర్మిచినట్లు , అలయ చరిత్ర ఆధారంగా తెలుస్తోంది .
    భక్తులెవరైనా కష్టాలు ,మానశిక రుగ్మతలు కలిగినా ,పసిపిల్లలకు దడుపు ,అనారోగ్యం వంటివి కలిగినా,కార్యసిధ్ధికి ముందుగా పూజించేది,హనుమనే.హనుమాన్ చాలీసా పారాయణం, రామరక్షా కవచం,సుందరాకాండ పారాయణ ఇవన్నీ హనుమ భక్తుల పాలిటీ కల్పవృక్షమనీ , కోరిన వేంటనే అండగానిల్చే వేలుపని భావిస్తాం.ఇలాంటి హనుమ ఆలయాల దర్శనం మనకందరికీ సుఖ శాంతుల నిచ్చుగాక! 

                   జయ జయ హనుమా! జయ జయ హనుమా. 
                   వానర దూతా వాయుకుమారా ! 
                   అతి బలవంతా ! అంజని పుత్రా!  
                   జయ జయ హనుమా !   జయ జయ హనుమా ! !. 
 ******************** 


No comments:

Post a Comment

Pages