పుష్యమిత్ర - 18 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 18
- టేకుమళ్ళ వెంకటప్పయ్య

జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు సైనిక కవాతు సమయంలో సింహకేతనునితోబాటూ, బృహద్ధ్రధునీ వధించి సింహాసనం అధిష్టించి సుపరిపాలన సాగించి, అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు బాబాజీ ద్వారా తను కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద సంచరించాలనీ,  హిందూదేశంలోని పరిస్థితులను చక్కబరచవలసి ఉందనీ, ఈలోపు సశరీరంగా, చిరంజీవిగా... నిద్రాణమైన స్థితిలో ఉండాలనీ ఆదేశించడంతో ఆశ్చర్యపోతాడు.  ఈ ఫ్లాష్-బ్యాక్ ఇది ఇలా ఉండగా,  వర్తమానంలో కరిముల్లా కూపీ లాగడానికి వచ్చిన జిలానీ బాషాను బంధించి  లై-డిటేక్టర్ తో నిజంచెప్పిస్తారు.  అమెరికా పాక్ అధ్యక్షులు భారత్ గురించి టెలికాన్ ఫరెన్సులో మాట్లాడుకుంటారు. శ్రీహరికోట(షార్) పై బాంబింగ్ చెయ్యడానికి రెండు సబ్మెరైన్స్  విశాఖపట్టణం దాటి కృష్ణాపట్నం ఓడ రేవు వైపు వస్తున్నట్టు  గ్లోబల్ఐ ద్వారా తెలుసుకున్న  భారత్ నేవల్ అధికారులు వారిని సజీవంగా పట్టుకుని బంధిస్తారు. (ఇక చదవండి)

శ్రీహరికోట(షార్) లో రెడ్-అలర్ట్ ప్రకటించారు. పురుగును కూడా లోపలికి రానివ్వడంలేదు. స్ప్రాబ్, స్టెక్స్, ఎస్.సీ.ఎఫ్., లలో అంతా మౌనంగా జరిగిపోతోంది. ఎవ్వరూ ఎవరితోనూ పెద్దగా మాట్లాడడంలేదు. అంతా ఈ మెయిళ్ళ ద్వారానే. ఎమర్జెన్సీ వాతావరణం నెలకొనింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని డిల్లీ పీ.ఎం ఆఫీసు వాళ్ళు, డిఫెన్సు డిపార్ట్మెంటువారు తెలుసుకుంటున్నారు. సబ్-మెరైన్లను శ్రీహరికోట నావల్-బేలో ఉంచి ఆ క్రూ మొత్తం 16 మందిని సీ-షోర్ కు దగ్గరగా ఉన్న అండర్గౌండు భవంతిలో సీక్రెట్ గా బంధించి ఉంచారు. దిల్లీ నుండి స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు రాగానే వారికి అప్పజెప్పారు. వారిలో త్రిధళాలకు చెందిన హైర్యాంక్ ఆఫీసర్లు ఉన్నారు. మామూలు సివిల్ దుస్తుల్లో వున్నారు. 
ఒక్కో సబ్మెరయిన్లో ఎనిమిది మంది చొప్పున పట్టుకున్న 16 మందినీ ఒక్కోగదిలో ఇద్దరిరిద్దరి చొప్పున ఉంచి ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. ఒక్కోగదికి నలుగురు మిలిటరీ అధికారులను కేటాయించారు. వారు చెయ్యవలసినవన్నీ చేశాక గూడా ఎవ్వరూ నోరు విప్పడంలేదు. వారివద్దనుండి పాస్-పోర్ట్లు  ఇతర రహస్య పత్రాలను స్వాధీనం చేసుకుని, డిల్లీ నుండి స్పెషల్ ఫ్లైట్లో రాబోతున్న మోస్ట్ డేంజరస్ డేర్-డెవిల్ ఎన్ కౌంటర్  ఏజెంట్ “వివేక్ పరమహంస” కోసం ఎదురుచూస్తున్నారు. వివేక్ పేరుకే పరమహంస చేసేదంతా పరమహింస. వివేక్ బారిన పడ్డవారెవ్వరూ నిజం చెప్పకుండా ఉండలేరు. షార్లో దిగీ దిగగానే గెస్ట్ హవుస్ కూడా వెళ్ళకుండా డైరెక్టుగా రంగంలోకి దిగాడు. మొదట షిప్ పైలట్ల గదిలోకి వెళ్ళాడు. అలా ఆ ఇద్దరు పైలట్లను చూస్తూ ఒక ఐదు నిముషాలు గడిపాడు.సిగరెట్ వెలిగించి "డియర్ ఫ్రెండ్స్ నేను దిల్లీ నుండి వచ్చింది కేవలం మీ పేర్లు తెలుసుకోవడానికో లేక మీ పాస్-పోర్ట్లు చూడ్డానికో కాదు. మిమ్మల్ను పంపించినదెవరు? సింపుల్ గా చెప్పెయ్యండి. మీరు ఆ చైనీస్ కు సంబంధించిన న్యూక్లియర్ సబ్మెరైన్స్ లో బంగ్లాదేష్ నుండి ఇక్కడకు ఎందుకొచ్చారు?” తెలుసుకోవాలని. వాళ్ళు నోరు విప్పడంలేదు.  కానీ వీడెవడో భయంకరమైన వ్యక్తి అని తెలిసి గుండెల్లో రైళ్ళు పరుగెత్త సాగాయి. ఇద్దరికీ కట్లు విప్పించి రెండు పేపర్లు, పెన్స్ ఇచ్చి “రాయండి కేవలం 10 నిముషాలు మాత్రమే సమయం. 10 నిముషాల తర్వాత...” అంటూ సూట్కేస్ లోనుంచి ఒక సన్న గాజు గొట్టం లాంటిది తీశాడు. ఆగొట్టానికి చివర వెంట్రుక వాసి సూది ఉంది. అవేంటో వారికి అర్ధం కాలేదు.  “కమాన్! యువర్ టైం స్తార్ట్స్ నౌ” అని గది దద్దరిల్లేటు అరిచాడు. ఆ అరుపుకే ప్రాణాలు పోయేలా ఉన్నై. 10 నిముషాలు గడిచాక ఏమీ రాయకుండా ఉన్న వారిని చూసి నిట్టూర్చి ఒక బాటిల్లో ఉన్న ద్రవాన్ని ఆ గాజు గొట్టంలో పొయ్యబోతూ ఆగాడు హంస. ఈ లిక్విడ్ ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అని అడిగాడు. వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు. నేను చెప్పవలసిన అవసరం ఉంది మీరు తెలుస్కోవలసిన అవసరం ఉంది. “ఇది ఒక బయో-కెమికల్ పాయిజన్. ఇది బాడీలోకి వెళ్ళాక  48 గంటల్లో ప్రాణాలు పోతాయి. ఎంత భయంకరమైన చావో తెలుసా!” అని మొబైల్ లో వీడియో ప్లే చేసి చూపించాడు. వాళ్ళకు కాళ్ళూ చేతులూ చల్లబడ్డాయి. తలతిరిగినట్టైంది. వెన్నెముకలోంచి ఛలి ప్రారంభమయింది. ఆ వీడియోలో శరీరంలోని ప్రతి స్వేదరంధ్రంలో నుండి రక్తం స్రవిస్తుంది. అలా మొత్తం బాడీ లో బ్లడ్ ఎగ్జాస్టు అయ్యేవరకూ అలా బొట్లు బొట్లు గా రక్తం కారడం 24 గంటల తర్వాత మొదలవుతుంది. ఆ వీడియో చూసిన ఒకడు “సార్! ఆగండి! పేపర్ ఇవ్వండి” అన్నాడు. వివేక్ "గుడ్ బాయ్" అని పేపర్ ఇవ్వబోతుండగా, రెండో వాడు "అబాన్!..నై... నై... కుత్తే.. బేవకూఫ్...తుం క్య కర్తా హై..మాలూం హై తుంకో" అని పెద్దగా అరవగానే వివేక్ అక్కడి ఇంకో అధికారిని పిల్చి ఒక సూది లాంటి ఇనుప చువ్వను రెండు అరచేతుల్లో దించాడు. ఆ తర్వాత అబాన్ అనే వాడు పేపర్ తీసుకుని రాయడం మొదలెట్టాడు. "అబాన్! నువ్వు నిజాయితీ గా ఫ్యాక్ట్స్ రాసిస్తే నీకు పాస్-పోర్ట్ ఇచ్చి ఫ్లైట్లో మీ కంట్రీకి పంపుతాం. మీ ఫ్రెండు అబ్దుల్ బారిని మాత్రం అల్లా దగ్గరకు పంపుతాం" అన్నాడు. అబాన్ రాసిన పేపర్ తీసుకుని చదివాక "నాకు దీన్లో కొన్ని సందేహాలున్నాయి. నీకు వేరే గది ఇస్తున్నాం. రా!” అని తీసుకుపోతూ..అబ్దుల్ బారి ని ఏరోప్లేన్ ట్రీట్మెంట్ ఇమ్మని చెప్పి తలక్రిందులుగ వేలాడదీయించి క్రింద మరిగే వేడి నీటిని తలకు చాల దగ్గరగా తల వద్ద తగిలేలా ఉంచే ఏర్పాటు చేసి " బారి!  మైడియర్ ఫ్రెండ్! మళ్ళీ అరగంటలో వస్తా! ఆ లోపు మనసు మార్చుకున్నావా సరే లేదంటే నీకు బయో-కెమికల్ ట్రీట్మెంట్ తప్పదు" అని పెద్ద ఇనుపరాడ్ తో మోకాళ్ళ మీద ఫెడేల్ మని ఒక్కటిచ్చి వెళ్ళాడు. వాడు రక్తం కారుతూ పెడబొబ్బలు పెడుతూ అరుస్తూ ఉండగా "సరిగ్గా 30 నిముషాలే నీటైం" అని చెప్పి నవ్వి వెళ్ళిపోయాడు.
* * *
“ క్యా హువా! సబ్మెరయిన్స్ కిదర్ హై? బోలీయే ఛీఫ్!“  ప్రెసిడెంట్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నాడు మిలిటరీ ఛీఫ్. రెండు రోజులుగా కనిపించడంలేదు. కనీసం ఇంఫర్మేషన్ కూడా లేదు. ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలిస్తే కొంపలంటుకుంటాయి. మనకు న్యూక్లియర్ సబ్మెరయిన్స్ ఇచ్చిన చైనా మన మొహం మీద ఉమ్మేస్తుంది.  " వాళ్ళ షార్ ను ధ్వంసంచేసి వాళ్ళకు తెలీకుండా తిరిగి రాగలరా మనవాళ్ళు?" హూంకరించాడు ప్రెసిడెంట్. "ఏమో సర్! కావాలనే సిగ్నల్స్ ఆఫ్ చేసి సమయం కోసం ఎదురు చూస్తున్నారేమో మనవాళ్ళు". "ఇంపాసిబిల్ మిస్టర్ ఛీఫ్! ఎట్లీస్టు మనకు ఇంఫర్మేషన్ అన్నా ఇవ్వాలి కదా వాళ్ళు ఏమి జరుగుతోందో అక్కడ! రెండు రోజులుగా ఏ విషయమూ తెలీడంలేదు. నీకో విషయం చెప్పాలి. ఎంకౌంటర్ డేర్-డెవిల్ ఏజెంట్ వివేక్ చెన్నై వెళ్ళినట్టు హఫీజ్ నాకు రాత్రి దిల్లీ నుంచీ ఫోను చేసి చెప్పాడు. నా మనసు కీడు శంకిస్తోంది. జిలానీ బాషా కూడా ఏమయ్యాడో తెలీదు."  "మనవాళ్ళు వాళ్ళ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు సర్."
"ఏమో ఇండియా ప్రైం సామాన్యుడు కాదు. ఇవన్నీ సాక్ష్యాలతో డాక్యుమెంటరీ తీసి సీ.డీ లు ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాల ప్రతినిధులకు పంచగల సమర్ధుడు. ప్రపంచం మొత్తం ముందు మనల్ను దోషిగా నిలబెట్టాలనే అతని ప్రయత్నానికి పరోక్షంగా సహకరిస్తున్నామేమో అనిపిస్తోంది. ఈ సబ్మెరయిన్ ప్లాన్ వద్దని చెప్పాను. వినకుండా నీవు ప్లాన్ చేశావు. వాళ్ళ స్థావరంలో వాళ్ళ శ్రీహరికోటను ధ్వంసం చెయ్యడం కష్టం అన్నాను. 2,000 కిలోమీటర్ల రేంజ్ న్యూక్లియర్ వెపన్ అన్నావు. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీడం లేదు. అవునూ.... అండర్ వాటర్ స్పెషలిస్టు ఖయూం ఏక్కడున్నాడు తెలుసుకుని పిలిపించండి. అర్జెంట్."
* * *
అండమాన్ ఐలాండ్స్ లో హెలికాప్టర్ దిగిన ఖయూం శ్రీహరికోట లాంగిట్యూడ్ మరియూ లాటిట్యూడ్ 13.7424° నార్త్, 80.2098° ఈస్ట్ అని తెలుసుకున్నాక, చివరి సారి సిగ్నల్ వచ్చిన ప్రాంతం కృష్ణాపట్నం దాని లాంగిట్యూడ్ మరియూ లాటిట్యూడ్ 14.2546° నార్త్, 80.1094° ఈస్టు.... అంటే అక్కడే... ఏదో... జరిగింది. అండమాన్ నుండి దాదాపు 1400 కిలోమీటర్ల దూరంలో క్రిష్ణా పట్నం ఉంది డైవింగ్ లో వెళ్ళడం ఇంపాసిబుల్. కాబట్టి చెన్నై వెళ్ళి అక్కడ నుండి నెల్లూర్ వద్ద ఉన్న మైపాడ్ బీచ్ కు వెళ్ళి అక్కడ నుండి అంతర్జాతీయ జలాలలోకి మత్స్యకారుల ద్వారా వెళ్ళాలి అని నిశ్చయించుకున్న ఖయూం అండమాన్ నుండి చెన్నై ఫ్లెయిట్ ఎక్కాడు. చెన్నైలో దిగి  ముందుగా బార్బర్ షాపుకు వెళ్ళి గడ్డం మొత్తం తీసేసి గాంధీ టోపీ లాంటి ఖద్దర్ టోపీ పెట్టుకున్నాడు. నెల్లూర్ కు ట్యాక్సీ మాట్లాడు కొని బయలుదేరాడు.
* * *
"సార్! మైపాడు కోస్టు గార్డును మాట్లాడుతున్నా సార్!"
"చెప్పు వేలాయుధం! ఎలా ఉన్నావు?" అడిగాడు చెన్నై షిప్-యార్డ్  ఛీఫ్.
"సార్! బాగానే ఉన్నా! ఎవరో ఒకడు ముస్లింలా ఉన్నాడు కానీ గడ్డంలేదు. మన చేపలు పట్టుకునే వాళ్ళ మరబోటు ఎక్కాడు. అడిగితే చేపల పట్టుకునేది చూడాలని హిందీలో చెప్పాడు. ఉర్దూ యాసలా ఉంది. బోటు వాళ్ళు 4 రోజులదాకా తిరిగి రాదు అని చెప్పినా పర్వాలేదు అనిచెప్పి ఎంత దూరం సముద్రంలోకి వెళ్ళగలిగితే అంత దూరం వెళ్దాం అని చెప్పి ఎక్కి వెళ్ళాడు సార్!. వాళ్ళకు ఏభై వేలు ఇచ్చాడు. నాకు 10 వేలు ఇవ్వబోతే నేను తీసుకోలేదు. నా మనసులో ఏదో అనుమానం ఉంది సార్! "
"మై గాడ్. నిజమా! ఆ బోట్ నంబర్ రాసుకున్నావా?"
"సార్! నంబర్ ఏమిటో తెలీదు కానీ  బోటు పేరు మాత్రం గుర్తుంది. దాని పేరు సెరపిండిటీ" 
"ఓనర్ కు ఫోను చేసి నాతో మాట్లాడమను – అర్జెంటు. డోంట్ వేస్ట్ టైం ప్లీజ్." (సశేషం)
* * *

No comments:

Post a Comment

Pages