అలమేల్మంగమ్మ శోభ - అచ్చంగా తెలుగు

అలమేల్మంగమ్మ శోభ

Share This

అలమేల్మంగమ్మ శోభ

ఆండ్ర లలిత


కంద పద్యలు

అలమేలుపురమున వెలసె 
అలమేల్మంగమ్మ వచ్చి అతిమధురముగా 
అలసిన మా హృదయములకు 
అలవోకగ సేదతీర్చె అమృతంబోలే౹౹

కలువలు వికసించెనుగా
 పలురకములు సుందరముగ పసివెదజల్లూ 
కళకళల తళకులందూ 
కలువుల శోభ కొలనందు కమనీయముగా||

కమలాక్షి వెలసె అలిమే
 లుమంగపురమున సిరిసిరిలు నడుమ మనకూ
 కమలాలువంటి అలిమే 
లుమంగ తల్లి సొగసు కళలు పొగడతరమా||

పద్మ సరోవరమందూ 
పద్మామావతి పసిడి సుపద్మములోనూ
 పద్మపు వన్నెలు కలిగీ 
పద్మమువోలె వెలసెనుగ పరిపూర్ణతతో౹౹

పద్మావతి దర్శనమూ 
పద్మావతి పదములు పరిపరి పలికిననూ
 పద్మములతో కొలిచినా 
పద్మావతి తల్లి మనను పాలన చేసే||

పద్మావతి దేవేరీ
 పద్మముల సువాసనలలొ పరవసమందూ
 పద్మపు కాంతులుతోనూ 
పద్మములాగ లలితముగ పరిపాలించే౹౹
******

No comments:

Post a Comment

Pages