అఖండదీపం

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


మస్తిష్క పుస్తకంలో
జ్ఞాపకాలు
అందమైన అనుభూతులను ప్రోదిచేసుకున్న
సువర్ణ రేకలై శోభిల్లాలి
ప్రతి పుటలోను
జాలి, దయ, ధర్మం, దానం ప్రస్ఫుటమవుతూ
మనలోని మనవీయతకు నిదర్శనమై
అమూల్యమవ్వాలి..అంతేకాని
ప్రతి పేజీ
అసూయాద్వేషాలతో నలిగిపోయి
మోసం, దగా, కుట్రల మచ్చలతో
కళావిహీనమైతే
మన జీవిత పుస్తకం నిరర్థకమవుతుంది
వ్యక్తిత్వ వికాసం అంటే
కీర్తి కాంక్షతో ధనార్జనకోసం పరుగులెట్టడం కాదు
అఖండదీపమై వెలుగులు చిందించాలి
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top