స్టఫ్ఫుడ్ బెండకాయలు దానిమ్మ గింజలతో
అక్కిరాజు ప్రసాద్
బెండకాయ అనగానే వేపుడు ఒక్కటే కాదండోయ్. రకరకాల కూరలు చేయవచ్చు. ఇది సంజీవ్ కపూర్ గారి రెసిపీ.
కావలసిన పదార్థాలు:
- చిన్న సైజు లేత బెండకాయలు అరకిలో
- ఒక నాలుగు స్పూన్ల దానిమ్మ గింజలు
- కారం, ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్
- పసుపు చిటికెడు
- గరం మసాల అర స్పూన్
- తగినంత ఉప్పు, వంట నూనె
- సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు
- నిమ్మరసం ఒక స్పూన్
తయారు చేసే పద్ధతి:
ముందుగ బెండకాయలను శుభ్రం చేసుకొని పైన తొడిమెలు కోసుకోవాలి. ప్రతి కాయ మధ్యలో గాటు పెట్టి లోపల పొడిని నింపేలా కాస్త కాయను చీల్చాలి. కాయ పూర్తిగా చీల కూడదు. కారం, గరం మసాల, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, నాలుగు స్పూన్ల నూనెతో కలిపి ముద్దగా చేసుకోవాలి. దీనిని బెండకాయలలో బాగా విరివిగా కూరాలి. బాణలిలో కాస్త నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను వేసి 2-3 నిమిషాల పాటు రంగు మారేంతవరకు వేయించాలి. దీనిలో స్టఫ్ చేసిన బెండకాయలను, దానిమ్మ గింజలను వేసి మధ్య మధ్యలో తిప్పుతూ ఒక ఐదు నిమిషాలు ఉంచాలి. దించేముంది నిమ్మరసాన్ని వేసి కలిపి వేడి వేడిగా తినాలి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. దానిమ్మ పండు దొరకనప్పుడు ఎండిన దానిమ్మ గింజలు షాపులో దొరుకుతాయి. అవి కూడా వేసుకోవచ్చు. స్టఫింగులో మీ అభిరుచుల ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
Comment with Facebook
No Comments