నేను - నా శివుడు - అచ్చంగా తెలుగు

నేను - నా శివుడు

Share This

నేను - నా శివుడు

ప్రసాద్ కట్టుపల్లి 18/9/2015


తే.గీ
పాప కర్మములు బడయ పాపి నైతి
పుట్టె మనిషిగ నేనును పుడమి పైన
మలము మూత్రము పైననె జలక మాడి
తల్లి చనుబాల కొరకునే తల్ల డిల్లె
తే.గీ
సతియు,సంపద మరియును, సుతులు యంచు
తీరు పన్నాగముల తోడ పేరు బడయ
శివుని చిత్తము నెరుగక యవన మంత
గర్వ మెక్కగ చెల్లెను గతము కొంత
ఆ,వె
"చేరి కొలువు కొడక చేరవు బాదలు
శివుడె మనల గాచు చింత తొలగు"
యెంచి దెలిపె నమ్మ, యేమిసేతురలింగ
మంచి మాట నేను యెంచ లేదు
తే.గీ
ఆది దేవుని గానని యంధ కార
బ్రతుకు బ్రతికి నేను బడసె గతులు యెన్నొ
కన్ను మిన్నును గానక యెన్న నైతి
నిన్ను ,బుద్ది హీనుడ నైతి నెన్న భువిని
తే.గీ
కొంటె పలుకులు పలికితి, కురుచ బుద్ది
తోడ, మరచి నీదు మహిమ తూల నాడె
చేయ లేదు యెరుంగను శివుని పూజ
తలపలేదు మదిని యమ్మ తనయులనును
తె.గీ
కనవు కన్నులు చెవ్వులు వినవు నేడు
వడలు రోగమ్ముల బడెసె ,నడక లేదు
పాప పంకిలంబు ముసిరి బాధ నొసగ
చేరె శంకర నీదరి చేరి కొలువ
తే.గీ
అర్ధ కాయము మంతయు యామె కొసగి
కట్ట బట్టలు లేకయె నెటుల నుండు
చేత శూలమట,గనుడి శిరము నొంక
మెడను దిరుగునదియెజూడ మెలిక నాగు
తే.గీ
వడలు బూడిద పూసుక వడిగ దిరుగు
నెత్తి మీదట గంగమ్మ నెపము లెంచ
చేయ నాదము శంఖము చేత డమరు
యెంత చక్కని రూపము యెక్కు నంది
తే.గీ
మూడు కన్నుల ముక్కోపి మెడలొ పుఱ్రె
సకల లోకములన్నియు సంచ రించు
భోల శంకర హరహర భూత నాధ
చేర్చు కొనుమయ్య నీకడ చేరి కొలుతు
ఆ.వె
తెల్ల వార కుండ జలక మాడగ లేను
గంగ జలము లేవు లింగ నీకు 
వంచ లేను మంచి పంచామృతమ్ములు
బిల్వ దళము తోడ కొలవ లేను
తే.గీ
ధూప దీపము పరిమళ తోరణములు
ఆవు, నేతితొ వండిన వేవి లేవు
మంచి నైవేద్యములొసంగ మదుప లేదు
అంత వదిలిన పిదపనె చింత కలిగె
తే.గీ
మరువ నెపుడునీ నామమున్,మదిని గొలుతు
చెంత లేదు చదువనీదు మంత్ర జపము
చేరి పాదపూజలు కొంత చేయ గలను
కనికరంబు నొసగి దేవ కావు మయ్య
*********

No comments:

Post a Comment

Pages