నాట్య ఋషి - పుల్లెల శ్రీరామచంద్రుడు - అచ్చంగా తెలుగు

నాట్య ఋషి - పుల్లెల శ్రీరామచంద్రుడు

Share This

 నాట్య ఋషి - పుల్లెల శ్రీరామచంద్రుడు


(పై చిత్రంలో ఎడమప్రక్క పూజ్య గురుదేవులు శివానందమూర్తి గారిని, కుడి ప్రక్కన పుల్లెల శ్రీరామచంద్రుడు గారిని, చూడవచ్చు.)
మనం ప్రతి నెలా ఓ మువ్వల సవ్వడిని తల్చుకుంటూ , ఆ సవ్వడికి కృషి చేసే ఋషితుల్యులని తల్చుకుంటున్నాం.
ఈ కాలపు 'ఋషి ' అనదగిన ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు కూడా ఇటీవల ఋషి లాగే ‘తనకీ ఏమి అవసరం? ‘అనే స్వార్ధ చింతన లేకుండా నాట్యకళాకారుల కోసం, భవిష్యత్వర్తమానాల శుభసంకల్పం గా 'భరత ముని ప్రణీతం నాట్యశాస్త్రం ' గ్రంధాన్ని మనకు అందించారు. ఈ పుస్తకం రాయాల్సిన పని ఆయనకు లేదు. ఆయన సంస్కృత భాషలో ఉన్న పురాణేతిహాస వ్యాకరణ తర్క మీమాంసాది రచనలని తెలుగు భాషలో శుభోదకం చేసారు. వందలాది గ్రంధాలు ప్రచురించారు. తెలుగు వాళ్ళకి అందించారు. ఈ నాట్యశాస్త్రం అటెంప్ట్ చేయడం అనేది నిర్వచించడానికి వీలు కావట్లేదు.
భారత దేశంలో ప్రచారంలో ఉన్న అన్ని నాట్యకళలకి ఈ నాట్యశాస్త్రం ఖచ్చితంగా ప్రామాణికం.
అసలు భరతముని ప్రవచించిన నాట్యవేదం చేతన పొందిన పసిగుడ్డు నుంచి ఆఖరి శ్వాస వదిలే ప్రతిదశని, కదలికని అధ్యయనం చేసి సంకలీకరించిన అత్యద్భుత అమృతభాంఢం.
పుస్తక సమీక్షగా నేను ఈ వ్యాసం వ్రాయటలేదు. నాట్యరంగ మహాసాగర ప్రయాణానికి లైట్ హౌస్ లాంటి మహోద్గ్రంధాన్ని మనసారా ప్రేమించి, గౌరవించి ప్రస్తుతించాలన్న సంకల్పంతో ఈ పుస్తక ప్రస్తావన చేస్తున్నాను.
హాయిగా అర్ధం అయ్యే తేట తెలుగులో ఈ నాట్యశాస్త్రం అందించారు పుల్లెలవారు.
37 అధ్యాయాలుగా విభజించిన ఈ వేదానువాదం శ్లోకాలతో, వ్యాఖ్యానాలతో సమగ్ర నాట్యశాస్త్రంగా మనం ఆరాధించాలి. నాట్యం అంటే కేవలం డ్యాన్సే కాదు అభినయప్రదాంగా నడిచే కళారూపాలన్నీ. కనక దానికి కావాల్సిన 'రంగం ' కూడా (అంటే స్టేజ్) గురించి కూడా భరతముని ప్రస్తావించారు. ప్రేక్షక గృహాలు అంటే థియేటర్ ఎలా నిర్మించాలో తెలిపారు. రీసౌండ్ రాకుండా కట్టడాలు ఎలా ఉండాలో రాసారంటే వారి దార్శనికతకు దణ్ణం పెట్టొచ్చు.
ఇంక చతుర్విధాభినయాలగురించి పరిపూర్ణ విశ్లేషణ చేసారు.
నటించేవాళ్ళ పెర్సనాలిటీ, మోతాదుకు మించని నటన, ఇన్వాల్వ్మెంట్ గురించి అత్యద్భుతంగా వర్ణించారు..విశదీకరించారు. ఈ నాట్యశాస్త్ర అధ్యాయం చేస్తే బిహేవియర్ సైన్స్ కూడా తెలుస్తుంది. నర్తకులేకాక సినిమాల్లో కూరుకు పోయిన, మునిగిపోదామనుకునే వాళ్ళందరికి (అన్ని క్రాఫ్ట్ ల వారికి) పెద్దబాలశిక్ష ఈ భరతముని ప్రణీతం అనేది స్పష్టం అవుతుంది. ప్రేక్షకుల అభిరుచి కూడా పెరుగుతుంది. సంస్కృత భాషలో ఉన్న ఈ వేదాన్ని ఆంధ్రీకరించిన పుల్లెల శ్రీరామచంద్రుడుగారు (040 23551299) 'శింజారవం' శీర్షికలో నమస్కరించాల్సిన వ్యక్తిగా ఈ పరిచయం.
1130 పేజీల మహోద్గ్రంధానికి ఈ కాసిని మాటలూ కర్పూరహారతి పట్టినట్టే...!!!

No comments:

Post a Comment

Pages