శ్రీధరమాధురి – 8 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి – 8

Share This
శ్రీధరమాధురి – 8

( చీకటివెలుగుల రంగేళి ఈ జీవితం... మన ఆధ్యాత్మిక మార్గంలో ఏవైనా అవరోధాలు ఎదురైనప్పుడు, వాటిని ఎలా అధిగమించాలో పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురుజి అమృత వచనాలలో చదవండి...) 
ఒకరు తమ జీవితంలోని పరస్పర వైరుధ్యాలైన – సుఖదుఃఖాలు, మంచిచెడులు, తప్పొప్పులు, లోటుపాట్లు, చీకటివెలుగులు, వెలుగునీడలు, వంటి వాటిని  ప్రేమించడం నేర్చుకుంటే, అప్పుడు జీవితమే ఒక వేడుక అవుతుంది. మనం జీవితంలోని వైరుధ్యాలను ప్రేమించలేక పోతున్నాము కనుక, మనకు జీవితం బాధాకరంగా అనిపిస్తుంది. 

పరిపూర్ణతే జీవిత భావన.   మీరు పనికొచ్చేలా ఉండాలి అంటే  - నేను పనికిరాకుండా ఉండమంటాను... మీరు కష్టపడి పనిచెయ్యాలి అంటే – నేను బద్ధకంగా ఉండమంటాను ... మీరు మంచిగా ఉండాలంటే – నేను చెడ్డగా ఉండమంటాను.... మీరు సంపూర్ణంగా ఉండాలంటే – నేను అసంపూర్ణంగా ఉండమంటాను. మీరు మేలు చేయమంటే – నేను కీడు చేయమంటాను... మీరు సరిగ్గా ఉండమంటే – నేను తప్పుగా ఉండమంటాను... మీరు లక్ష్యం ఉండాలంటే – నేను లక్ష్యం ఉండకూడదంటాను... మీరు లాభం అంటే... నేను నష్టం అంటాను... మీరు వెలుగు అంటే ... నేను చీకటి అంటాను... ఎందుకలా అంటాను ? నా సామ్యం చాలా సులువైనది – మీరు ఒక కొస చివరన ఉన్నారని నేను భావించి, మిమ్మల్ని మరో కొసవైపుకు లాగి, మధ్యలోకి తీసుకువస్తాను... అలా మిమ్మల్ని లాగుతుంటే మీరు నీరసిస్తారు, నేను మరింత బలపడతాను... అందుకే నేను నవ్వి ‘ సమతుల్యత ‘ లో ఉండమంటాను.   సామాన్యంగా ఉండండి... సహజంగా ఉండండి... మధ్యలో ఉండండి... చివరి కొసల్లో కాదు... మీరు ఆనందంగా ఉంటారు...  

జ్ఞానం వెలుగు ... వెలుగే జ్ఞానం... ఒకరి జ్ఞానం వారికంటే మెరుగైన జ్ఞానం కలవారిచే కొలవబడుతుంది. అలాగే  , చీకటి అనేది అజ్ఞానం. ఒకరి అజ్ఞానాన్ని కొలిచే విధానాలు ఏమీ లేవు. కాని చీకటి ఉంటే తప్ప, వెలుగును గుర్తించలేము. అందుకే చీకటి వెలుగుకు తల్లివంటిది. కాబట్టి, వెలుగు ప్రకటమయ్యేలా ఉపయోగపడేందుకు చీకటి కూడా ఒక విధంగా అవసరమే కదా ! కాబట్టి అజ్ఞానం నిరుపయోగమైనది కాదు. ప్రకృతి యొక్క వ్యవస్థలో దైవం అన్నింటినీ ఎలా ఏర్పరిచారంటే, ఏదీ వ్యర్ధం కాదు. ఒకదానికొకటి ఉపకరిస్తాయి.   

ఆశావాదం కార్ లోని ఆక్సిలరేటర్ వంటిది. మీరు దాన్ని నొక్కుతూ ఉండాలి. దానికి ఎంతో ప్రయత్నం కావాలి. నిరాశావాదం కార్ లోని బ్రేక్ వంటిది. దాన్ని నొక్కగానే కార్ ను ఆపుతుంది. జడత్వం చాలా శక్తివంతమైనది. చీకటి వెలుగుకంటే శక్తివంతమైనది. నిజానికి, చీకటే వెలుగుకు తల్లివంటిది. చీకటి ఒక పీఠం గా ఉంటే తప్ప, మీరు వెలుగును గుర్తించలేరు. 

వెలుగునైనా వెలిగించాలి... కాని చీకటి అప్రమేయంగా ఉంటుంది.  ధైర్యవంతుడు – భూమిపై జీవించేందుకు పగటి వెలుగు కాని, రాత్రి వెలుగు కాని అవసరం లేని వాడు.      

ఆనందానికి రహస్యం ఏమిటంటే మీరు సాధించాల్సింది కాని, గెలవాల్సింది కాని, ఏమీ లేదని గుర్తించడం. ఆశించడం, లక్ష్యం, సాధించడం,  అనేవి కేవలం అహపు పయనాలు. అవన్నీ ఆశ ద్వారా తరమబడతాయి. అత్యాశ దుడుకు ప్రవృత్తిని పెంచుతుంది. ఒకసారి మీరు సాధించాలని నిశ్చయించుకుంటే, అది తప్ప మీ మనసులోకి వేరేదీ రాదు.  ప్రేమ, దయ, కరుణ, సంరక్షణ, సేవ, అవగాహన, అన్నీ వెనుక సీట్ లో కూర్చుంటాయి. ఉన్నత స్థితికి చేరాలనుకునే వ్యక్తి, ఆ గెలుపు సాధించే విషయంలో ఒక విధంగా పిచ్చివాడై ఉంటాడు. అటువంటి వ్యక్తికి సమతుల్యత ఉండదు. పని పట్ల అభిరుచి మంచిదే, కాని పనిని ఏమీ ఆశించకుండా చెయ్యాలి. అందుకే లక్ష్యాలు పెట్టుకున్న మేధావులు ఎల్లప్పుడూ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఆశయాలు , శాంతి చేయి చేయి పట్టుకు తిరగవు. ఒకసారి మనశ్శాంతిని కోల్పోయిన వ్యక్తి తిరిగి రాలేక అక్కడే మురిగిపోతూ ఉంటాడు. ఆ పరిస్థితిలో అతని వక్రబుద్ధి, ఇతరులను, లేక మంచి పనులను  గుర్తించి మెచ్చుకునేందుకు నిరాకరిస్తుంది. వాళ్ళు ఒక కలల ప్రపంచంలో ,పొదిగే ముందే కోడిపిల్లల్ని లెక్కిస్తూ బ్రతికేస్తారు. వారిలోని చైతన్యం మాయతో దాక్కుని, వారు కేవలం చీకటి- అంటే అజ్ఞానాన్నే అనుభూతి చెందుతారు.  మా ప్రధాన లక్ష్యం ఏమిటంటే, మీలోని అహాన్ని కర్త్రుత్వాన్ని అణగదొక్కడం. అందుకే చాలా సార్లు మీరు అడిగినా జవాబు ఇవ్వము, ఇచ్చినా అది మీకు విరుద్ధంగా ఉండి, జీర్ణించుకోలేరు. ఒకవేళ మీరు జీర్ణించుకుని, సారాన్ని గ్రహించగలిగితే, మీకు వెలుగు యొక్క దృష్టి ఉన్నట్లే ! మీ అజ్ఞానం తొలగించబడుతుంది. మీరు ప్రకృతి మాతను, ఆమె నిగూఢ తత్వాన్ని ఆస్వాదించగలుగుతారు . మీరు విశ్వంతో నాట్యం చేస్తారు... దానికై అహాన్ని అణగదొక్కడం ఎంతైనా అవసరం.   

నిజమే -  నేను అంగీకరిస్తాను. భౌతిక శాస్త్రానికి ఎంతో తర్కం అవసరం. కాని ఈ హేతువాదం ఆదిభౌతిక శాస్త్రానికి పని చెయ్యదు. దీనికి కావలసినవి ‘విస్మయం చెందడం ‘ మరియు ‘ మహావిశ్వాసం ‘. భౌతిక శాస్త్రం విమర్శ ద్వారా ఏర్పడింది. ఆదిభౌతిక శాస్త్రం మిమ్మల్ని ‘ఆత్మవిమర్శ’ అనే ప్రక్రియగుండా తీసుకువెళ్తుంది. ఇటువంటి విమర్శ ద్వారా మీరు “విశ్వ చైతన్యం’ లేక ‘పరమాత్మ’ అనే విశ్వ సత్యం యొక్క అద్భుతాన్ని చూసి, విస్మయులై, ఆశ్చర్యపోతారు. దీని నుంచే ‘ జీవ చైతన్యం’ లేక ‘జీవుడు’ ఉద్భవించాడు. ఆత్మవిమర్శ ద్వారా మీరు ‘విస్మయులు’ కావడం అనే స్థితి నుంచి ‘శాశ్వత సత్యం’ వైపుకు పురోగమిస్తారు. ఇప్పుడు ‘జీవుడు’ ‘పరమాత్మ’ లో ఐక్యమయ్యేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇది ప్రేమపూరితమైన ఆనంద నాట్యం...సచ్చిదానందం... అంతా దైవానుగ్రహం, దయ.      
***

No comments:

Post a Comment

Pages