Wednesday, July 23, 2014

thumbnail

సద్గురువుకి వర్ణమాల

సద్గురువుకి వర్ణమాల

- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 12.07.2014


అ జ్ఞాన అంధకారాన్ని వెలుగుతో నింపే ఓనమాలు దిద్దించి
ఆ కాశపు హద్దులు అందించే విద్యాబుద్ధులు నేర్పించి
ఇ లలో నడతకు క్రమశిక్షణ నడకలు నేర్పి
ఈ లోకాన మమ్ము మనుషులుగ మార్చి
ఉ న్మత్తులైన మమ్ము ఉత్తములుగా తీర్చి
ఊ హించని ఎత్తుకు ఎదిగేందుకు నిశ్రేణి పేర్చి
ఋ షిలా, యోగిలా, వ్యాసమునిలా యుగయుగాలుగ
ఎ న్నో ..మరెన్నో విజ్ఞాన పుష్పాలు పూసగుచ్చి తెచ్చి
ఏ జన్మ వరమో..మాకు ... ఏ నాటి ఫలమో
ఐ క్యత , సఖ్యత, వినయశీలత అలవరచిన మిమ్ము
ఒ క్కసారి తలచిన చాలు ఒనగూరు ఫలాలు..
ఓ పలేనంత ఆనంద పరవశాలు
ఔ షదాలె మాకు మీ శిక్షలు ,పరీక్షలు..
అం దుకే మేమెప్పుడు మీకు ఋణగ్రస్తులం..
అ(:)హం అదుపు నుంచి మిమ్ము తలచుకుంటూనే ఉంటాం..
అంతటి గురువులైన మీరు....
క మ్మని కథలతో మమ్మలరించిన క్షణాలు
ఖ డ్గము ,కలమే యని ఆ పదును చూపిన రోజులు
గ తించిన ఆ కాలం కళ్లముందే ఉంది.. ఈ నాటి మా ఈ -
ఘ న కీర్తి మీ చలువె గా .....వా-
జ్మ్ య భూషణా .. గురుదేవరా..!
చ దువు తోటి ఆటలు , పాటలు
ఛం ధోబద్ద, అలంకారయుతంగా..
జ న్మంతా మనోఫలకం పై ముద్రితమయ్యేలా స్వర-
ఝ రి తో రాగ మాలపించి.. మరీ
జ్ఞా న మందించిన బాదరాయణా..!
త రము తరము నిరతము క-
థ గా చెప్పెదము మీ బోధనా పటిమ
ద రిచేర్చు తిమిరము నుంచి అమరమునకని..
ధ న మదియె మాకు వేల కోట్లు
న డియాడె దైవమా.. నరుడైన వ్యాసరూపా..!
ప లక పట్టించిన గురువుగ
ఫ లమెన్నడు మీరు కోరలేదు..
బ లపము పట్టిన నాడె
భ క్తి భావము తో మిమ్ము కొలిచేము.. మా-
మ నమున మీరె నిండె మా జ్ఞాన వితరణి..!
య మునా తీరాన అర్జునునకుపదేశి
ర క్కసుల సరి ద్రోవ జూపిన శుక్రసామి
ల వ కుశుల దీర్చిన వాల్మీకి..
వ సుధన వినుతికెక్కిన ద్రోణాచారి
శ రము బట్టి చూపిన కౌశిక ముని
ష ట్ చక్రములు చూపిన యోగ బ్రహ్మ
స రిలేరు నీకెవ్వరూ ఈ జగత్తున
హ రికి అంతరాత్మవై.. మనో నేత్రమై.. తా-
ళ పత్రమై .. విశ్వ భవితకు మార్గదర్శివై
క్ష రము కాని అక్షరములతో (మము) సానబెట్టిన పరుసవేది.. మ-
ఱ పు లేకుండా జేసి..మదిలోనె లోనె పూజలందుకొను పుణ్యపురుషా..!
పామరులమైన మాకు విజ్ఞానమొసగిన మీ తపస్సు
మా ముంగిట చీకటిని పారద్రోలిన ఉషస్సు
విద్యాదాన యజ్ఞంలో మీరో హవిస్సు
తేనె కన్న తీయన మీ మనస్సు
భువి ఉన్నంత వరకు నిలుచు మీ యశస్సు
మీ పాదపద్మములకు ఇదే నా హృదయ నమస్సు
(అ నుంచి ఱ వరకు అన్ని అక్షరాలతో గురువుకి వేసిన వర్ణ మాల ఇది.. గురుభ్యోనమ:)

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information