రాధామాధవీయం
- రచన : శ్రీమతి సుజాత తిమ్మన .
యమున తరగల నురగలపై
సుతిమెత్త గా తేలుతూ
వస్తున్నమాధవుని  వేణు గానం
విన్నరాధమ్మ హృదయం
నీలి మబ్బును చూసిన నెమలై
పురి విప్పి చేసింది ఆనంద నాట్యం

ప్రతి శ్వాస కృష్ణ నామమే
ప్రతి తలపు మాధవ లిఖితమె....
రాధ జీవీతమైన ....
పదహారువేల భామల ముద్దు గోపలుడైనా
ఎప్పుడూ ....రాధా  మనోహరుడే
కృష్ణ తలపుల గీతికయైన ..అదే...
మధురం..మనోహరం..రాధామాధవీయం....!!


ఆరాధనలలో ఆత్మను ఐక్యం చేసుకొని
పెదవులు పలుకని మూగ బాషలు
అరమోడ్పు  కన్నుల తెలుపుకుంటూ...
సన్నిహితత్వపు సౌఖ్యానుభూతులను ..
పంచుకుంటున్న పరవశం...అదే...
మధురం...మనోహరం...రాధామాధవీయం!!

యుగాలు మారినా మారని చరితమే....
రాధా కృష్ణుల ప్రణయ కావ్యం..
ఆరాధనల అనురాగాలకు ఆదర్శం ...
ప్రేమైక్య జీవనానికి నిదర్శనం....అదే..
మధురం ..మనొహరమ్...రాధా మాధవీయం!!

+++++++++++++++++++++++++++++++++
         

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top