మౌనమే నీ భాష ఓ మూగ మనసా !!!! - అచ్చంగా తెలుగు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా !!!!

Share This

 మౌనమే నీ భాష ఓ మూగ మనసా !!!!

 - సంధ్యా రాణి 
అతడు ఆమె ఇద్దరు ఎవరెవరి ఆఫీస్ లలో వారు ఉండగా జి మెయిల్ ఛాటింగ్ లో ...ఆమె: హాయ్అతడు: హాయ్ఆమె:ఏమి చేస్తున్నావుఅతడు:ఆఫీస్ లో వర్క్ ఉంది చేస్తున్నా రా నువ్వేం చేస్తున్నావ్ ఆమె:ఏదో సోది వర్క్ ఉంది చేస్తున్నా అతడు:ఇంకా!!!! ఆమె:నువ్వే చెప్పాలి రా.
ఆమె: ఇంట్లో నాతో అసలేం మాట్లాడటం లేదు నువ్వు పో  ఐ హర్టు నేను బుంగ మూతి పెట్టా మ్మ్ మ్మ్ మ్మ్ .అతడు:నువ్వు ఏమి మాట్లాడటం లేదు కదా??ఆమె: నువ్వు కూడా ఏమి మాట్లాడటం లేదు కదా రా.రాత్రి... మళ్ళీ సీన్ ఇంట్లోకి మారింది...ఇద్దరు ఏమి పెద్దగా మాట్లాడుకోకుండానే భోజనం ముగించేశారు. నిశ్శబ్ధంగా ఉంది ఆ గది, ఫాన్ చప్పుడు తప్ప ఇంకేం వినిపించటం లేదు . తను ముందు మాట్లాడొచ్చు గా తను ముందు మాట్లాడొచ్చు గా అనుకుంటూ ఇద్దరు పక్కవాళ్ళు మాట్లాడతారని ఎదురు చూస్తూ  నిద్రపోయారు. ఇదండీ  ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగస్తులయిన భార్య భర్తల పరిస్థితి !
మునుపటి రోజుల్లో ఇంత పోటీ ఉండేది కాదు కాబట్టి ఒకరికొకరు పక్క వారి చికాకులు తొలగిపొయేలా ఏదో ఒక సంభాషణ మొదలుపెట్టి తర్వాత మాటల్లో పెట్టి అసలు విషయం
తెలుసుకుని పరిష్కారం దిశగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు .కాని నేటి పోటీ ప్రపంచంలో ఒకరితొ ఒకరికి మాట్లాడుకోడానికే తీరిక లేదు  ఇక పక్క వాళ్ళ సమస్యలు ఎక్కడ వింటారు ?? పొనీ విందాం అనుకున్నా అహం అడ్డొచ్చి తమ భాగస్వామితో కూడా ఏ సమస్యనీ పంచుకొని వారెందరో....కొంతమంది విషయంలో ఈ మౌనం కొన్ని రోజుల్లో సమసి పోతుంది.కాని ఇదే కొంత మంది విషయంలో బంధాలు తెంచుకునేవరకు వెళ్తుంది.ఎందుకిలా? మన ముందు తరాలవారు ఎంత సంతోషంగా కుటుంబ సంబంధాల్ని ఆస్వాదించగలిగారు . మన తరంలో ఎందుకు ఈ నిర్లిప్తత ???  ఈ ఉదాసీనత ??మన కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోడానికి మనకి ఎందుకు కౌన్సిలర్స్ కావాల్సి వస్తున్నారు?ఎందుకంటే మన తరం కేవలం తీసుకొవాడానికే అలవాటుపడ్డాం ,మన వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మన నుండి ఆశించేది కేవలం ఒక చిన్న ఓదార్పు నీకు నేనున్నాను అనే  భరోసా  !!!! మౌనం అనే గాజు గోడల్ని పగలగొట్టి మనవారికి ఆ భరోసా  ఇవ్వడానికి అడుగు ముందుకేస్తారని ఆశిస్తున్నా !

No comments:

Post a Comment

Pages