దేశభక్తి - అచ్చంగా తెలుగు

దేశభక్తి

- భారతి కాట్రగడ్డ

 భారత్ మాతాకీ జై!

భారతభూమికీ జై!
మువ్వన్నెల జెండాకీజై!

ఎంత నటనో!
ఆరితేరిపోతున్నారు నటనలో!
ఆస్కార్ అవార్డులే ఇవ్వొచ్చు.

ఎక్కడా కనబడడంలేదే
నిజమైన, స్వచ్చమైన దేశభక్తి?
చరిత్రపుస్తకాల్లోనే కనిపిస్తుంది.
వందనాలు పలికే లేలేత
పసి హృదయాల్లోనే కనిపిస్తుంది!
మెతుకు కోసం అల్లాడే
అనాధ బతుకుల్లో కనిపిస్తుంది!

ఏ కోటమీద ఎగరేసినా
జెండా ముమ్మాటికీ పవిత్రమైనదే!
కానీ ఎగరేసే చేతుల్లో
నిన్నాదాలిచ్చే హృదయాల్లో
ఎక్కడుందీ దేశభక్తి?
జనగణమన నాలుకే పలికుతుంది.
స్విస్సుబ్యాంకుల్లో డబ్బులు నిండాలని
మనసు కోరుతుంది!
చేతులు జెండాలకే సెల్యూట్ లు కొడతాయి
కాని కుంభకోణాల రూపాయినోట్లు
అందుకోవడానికి
మనసా వాచా ఎదురుచూస్తాయి!!

ఓ స్వాతంత్ర్యమా!
ప్రతీ సమ్వత్సరం వస్తూనే వుంటావు.
లేతహృదయాలని పెనవేసుకుపోతావు.
సంబరాలనెన్నింటినో నింపుతావు.
కానీ
మలినమైపోతున్న రాజకీయాన్ని ప్ర్క్షాళన చేయమ్మా!
అప్పుడే నీకు అసలైన
వేలవేల నీరాజనాలమ్మా

No comments:

Post a Comment

Pages