నాతి చరిత - అచ్చంగా తెలుగు

నాతి చరిత

Share This
నాతి చరిత
- మాధవి పల్లం
       నాతి చరిత నాటి నుండి
      నేటి వరకు తరచి చూడ
       తడి ఆయెను మనసు
        పొడి బారెను గొంతు
        ఏరులై పారే కన్నీళ్ళు
        చేలిమలయ్యే చెక్కిళ్ళు
         గుండె చెరువాయెను
         అతివ భవిత తలచిన
         బ్రతుకు బరువాయెను
    అల నాటి మాట ఒకటి గురుతువచ్చేను
           ఆడదానిగా పుట్టడము కన్నా
        అడవిలో మానై పుట్టడము మేలు
       ఆవేదన నిండిన మనసు
       కలము పట్ట కవితాక్షరముల జాలువారే
       వ్యధ సముద్రమై ఎద ఎల్లలు దాటి
       కవితా సంగమమై   నిలిచేనిలా
       నెచ్చెలి ఓదర్పు వెచ్చని పున్నమి
       వెన్నెలై వచ్చెనని తలచి
       సాహితీ అలలా ఎదురు చూచుచున్నది
       మధులత మాధవి లత   !

No comments:

Post a Comment

Pages