మన జాతీయ గీతము - రచన :చెరుకు రామమోహనరావు - అచ్చంగా తెలుగు

మన జాతీయ గీతము - రచన :చెరుకు రామమోహనరావు

Share This
వందే మాతరం అంటే ఇంచుమించు ఓక డాలర్ అనుకొనే ఈ రోజుల్లో, 1882 వ సం. తన 'ఆనంద్ మఠ్' అన్న నవలలో బంకించంద్ చటర్జీ గారు దీనిని పొందు పరచారని 'లాంగ్ లివ్ ద క్వీన్' అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు వ్యతిరేకముగా నినదించిన ఈ సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిందని నేటి యువతకు తెలిసే అవకాసము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్  సమావేశములో రవీంద్ర నాథ ఠాకుర్ గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి చేసుకొన్న దురదృష్టము వలన ఈ గీతము జాతీయగీతము కాలేకపోయినది. ముస్లింలు ,సిక్కులు ,క్రైస్తవులు ,అందరూ దీనికి వ్యతిరేకులే. వీరందరికంటే ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర బోస్ కు వ్రాసిన లేఖయే సాక్ష్యము .
In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote:
"The core of Vande Mataram is a hymn to goddess Durga: this is so plain that there can be no debate about it. Of course Bankimchandra does show Durga to be inseparably united with Bengal in the end, but no Mussulman [Muslim] can be expected patriotically to worship the ten-handed deity as 'Swadesh' [the nation].
మే 10,2013 లో శఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు నడచినాడు. మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య సమరములో సర్వదెశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ స్థాయిని దక్కనివ్వలేక పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా!మనలో చైతన్యమెదీ. మనలో ప్రతిఘటన యేదీ. ఇక 'జనగణమన' నేటి మన జాతీయ గీతిక ఠాకూరు వారిచే 1911సం. లో వ్రాయబడినది . ఆ తరువాత 1919 ఫిబ్రవరి 28 న బెసెంట్ థియొసాఫికల్ కాలేజి - మదనపల్లి (చిత్తూరు జిల్లా) లో ఆ కాలేజి ప్రిన్సిపాల్ కజిన్స్ గారి అర్ధాంగి గారి,ఆవిడ పాశ్చాత్య సంగీత విదుషీమణి కావడం వల్ల,  సహకారముతో, ఠాకూరు వారు ఆలపించుట జరిగింది . ఆ పాట లోని అధినాయక,భాగ్య విధాత,తవ శుభ నామే జాగే, మంగళ దాయక మొదలగు పదములన్నీ పుమ్ వాచక శబ్దాలు . ఆ గీతములోని మిగత పదములన్నీ జాతుల ,పర్వతముల, నదులపేర్లే.ఇందులోని కవిత్వము పండితులకే ఎరుక. ఠాకూర్ గారు నెహ్రు గారికి అత్యంత ఆప్తులు. జార్జ్ V మనదేశానికి విచ్చేయు సందర్భములో వారు వీరిని అడిగితే అది తన భాగ్యమని తలచి ఆయన ఈ గీతము వ్రాయుట జరిగినది. ఈ గీతము వంగ భాషలో వ్రాయుటయే కాక దానిని ఆంగ్లములో తర్జుమా చేసి జార్జ్ V గారికి 1911 డిసెంబర్ 28 న సమర్పించుకొన్నారు.ఎందుకంటే వారికి వంగభాష రాదు కదా .   ఆయన చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తి  నపుడు, అది దేవుని గూర్చి వ్రాసినదని తప్పించుకో జూసినాడు. కానీ ఆ గీతము పూర్తిగా చదివినవారికి అర్థమౌతుంది అందు ఆయన చొప్పించిన అబిప్రాయము. ఆ గీతములో వున్నవి 5 చరణములు. చివరి చరణము జార్జ్ గారి రాణిని గూర్చి కూడా వ్రాసినారు. అక్కడేమో బంకించంద్ చటర్జీ గారు చిత్తశుద్ధితో వ్రాసిన దేశ భక్తి గీతాన్ని తప్పు పడుతూ దుర్గా మాతను ముస్లీము లెట్లు ఆరాధించు తారు  అన్నారు. కానీ ఇక్కడ రాణి గారిని అందరూ  ఆరాధించండి అని చెబుతూ వున్నారు.వారి మనసుకు ఈ క్రింది వార్తా పత్రికలు అద్దము పడుతున్నాయని పాఠకులు గ్రహించగలరు .   "The Bengali poet Rabindranath Tagore sang a song composed by him specially to welcome the Emperor." (Statesman, Dec. 28, 1911) "The proceedings began with the singing by Rabindranath Tagore of a song specially composed by him in honour of the Emperor." (Englishman, Dec. 28, 1911) "When the proceedings of the Indian National Congress began on Wednesday 27th December 1911, a Bengali song in welcome of the Emperor was sung. A resolution welcoming the Emperor and Empress was also adopted unanimously." (Indian, Dec. 29, 1911) ఈ ప్రశంశ  కు బదులుగా నెహ్రు గారి ప్రోత్సాహంతో, కింగ్ జార్జ్ గారు నోబెల్ ప్రైజ్ కమిటీ సభుడైనందువల్ల, స్వతహాగా 'నోబెల్' సన్నిహిత మిత్రుడైనందువల్ల ఈ పాటకే నోబెల్ ప్రైజు ప్రకటించితే తన ప్రతిష్ఠ వికటించుతుందని తెలిసినవాడై, నెహ్రూ గారికి చెప్పగా, వారి సహాయ సహకార సౌజన్యములతో ఠాకూరు గారే రచించిన 'గీతాంజలికి' గ్రహించడం జరిగింది. 1. 18 సంవత్సరాల చిరుత ప్రాయంలో దేశానికి తన ప్రాణాన్నే బలిగావించిన బెంగాల్ కిశోరము ఖుదీరామ్ బోస్ పరోక్షంగా ఠాగూర్ కు నోబెల్ ప్రైజ్ ఇప్పించి ఉండవచ్చు. ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ న్యాయ శాస్త్ర రీత్యా అతని వయసుకు మరణ శిక్ష విధించకూడనిదైనా, ఉగ్రవాదులు దయా పాత్రులు కారని యెంచి,విధించినారు.  ఇది 1908,మే 21న జరిగిన ఉదంతము.అప్పటినుండి చిచ్చర పిడుగులై బ్రిటీషు వాళ్ళకు నిద్ర లేకుండా చేసిన బెంగాలుపులులను మచ్చిక చేసుకొనే దానికి ఇట్లు చేసినారేమో . 2. రవీంద్రుడు నోబెల్ కమిటీ చేత సిఫార్సు చేయబడినవాడు కాదు.
3. ఆయనకు బంగ్లావాసిగా  కాక ఆంగ్లో ఇండియన్ గా ఇవ్వబడింది . 4. బహుమతి గ్రహీతగా ఆయన భాషణ మివ్వవలెను. కానీ ఆయన ఏవిధమైన భాషణము ఇవ్వలేదు . 5. ఆయన నోబెల్ కమిటీ కి రెండు పంక్తుల వార్త పంపినాడు . 6. బహుమతిని బ్రిటీషు రాయభారి గ్రహించి కోల్కతాలో రవీంద్రులకు  అంద జేసినారు.
7. ప్రాక్పశ్చిమ నాగరికతల సంయోగమునకు పాటుపడిన వ్యక్తిగా నతనిని ఎంచి ఈ బహుమతినిచ్చినారని అంటారు.
ఇక్కడ ఖుదీరాం బోస్ నేటి తరానికి ఒక అజ్ఞాత దేశభక్తుడు, నేటి యువత /బాలురు, చదివిన/చదివే చరిత్ర లో కనిపించడు. రవీంద్రుడు పగటి పూట సూర్యునిలా అందరికీ కనిపించుతాడు . బంకించంద్రుడు అమావాస్య చంద్రుడైనాడు, మరి రవీంద్రుడో పున్నమి చంద్రుడు. చాలా దూరం వచ్చినాము. మళ్ళీ కలుసుకొందాము. తత్సత్ .

No comments:

Post a Comment

Pages