దేవుడా!...
కర్లపాలెం హనుమంతరావు
ఏసీ కంప్రెషర్ గాల్లోకి వేడిని వదులుతోంది. కానీ
లోపల కూర్చున్న ఉద్దండం గారికి ఆ
చల్లదనం అస్సలు సరిపోవడం లేదు.
బయట మే నెల మధ్యాహ్నం
భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. కరెంట్ వోల్టేజ్ తగ్గి
ఏసీ ట్రిప్ అయింది.
“అయ్యో!
దేవుడా! ఒక్క నిమిషం ప్రశాంతత
లేదు గదా! దీనెమ్మ జీవితం
." అంటూ నుదిటి చెమట తుడుచుకుంటూ
గది బయట హాల్లోకి వచ్చాడు
ఉద్దండం.
బానపొట్ట
ఆయాసంతో పైకీ కిందకీ ఊగుతోంది.
ఉదయం తిన్న బిర్యానీ అరిగి
కడుపులో అప్పుడే ఎలకలు పరుగెడుతున్నాయి.
సరిగ్గా
అదే సమయానికి వాచ్మెన్ రూమ్
వైపు నుంచి ఎండకు మాడిపోయిన
మొహంతో లోపలికి అడుగుపెట్టాడు దిబ్బయ్య.
ఎండ తీవ్రతకి కళ్ళు తిరుగుతున్నా, యజమానిని
చూడగానే నడక సరిచేసుకున్నాడు.
"ఒరేయ్
దిబ్బీ! ఎక్కడి నుంచి వస్తున్నావురా?"
ఉద్దండం గొంతులో గర్జన వినిపించింది.
"అదేనండి..
వెనక తోటలో డ్రిప్ ఇరిగేషన్
పైపులు లీకైతే సరిచేసి వస్తున్నానండి" అన్నాడు
దిబ్బయ్య భయ భయంగా.
"దేవుడా!
మరి ఆ కొత్తగా తెచ్చిన
ఆర్గానిక్ ఎరువుల బస్తాలు ఎప్పుడు
షెడ్డులోకి మారుస్తావురా ? రేపో మాపో వర్షాలు
పడితే ఆ లక్ష రూపాయల
స్టాక్ అంతా పాడైపోదా?"
"ఆ
పనిలోనే ఉన్నానండీ! కాస్త ముద్ద తిని,
ఆ పైనా ..."
"అయ్యో!
దేవుడా! ఎప్పుడు చూసినా తిండి
గోలేనా? ఒక్క పూట తిండి
లేకపోతే చచ్చిపోతార్రా మీరూ ? అయినా నీ
పెళ్ళాం కొంపలోనే ఉందిగా,
అక్కడే తిని రావాల్సింది!"
"అది..
దానికి తొమ్మిదో నెల అండి. పురిటి
నొప్పులు పడతా ఉంది. ఇవాళో
రేపో డెలివరీ అని డాక్టర్
చెప్పారు..."
దిబ్బయ్య
మాట పూర్తి కాకముందే ఉద్దండం
చిరాగ్గా చేయి ఊపాడు."అయితే
నన్నేం చేయమంటావురా ? నేనేమన్నా మంత్రసానినా? దేవుడా! ముందు పోయి
ఆ మెకానిక్ని
పట్టుకురా, ఏసీ ఆగిపోయింది, ఇక్కడ
ప్రాణం పోతోంది. వచ్చేటప్పుడు మెయిన్ రోడ్డు దగ్గర
నరహరి స్వీట్స్ లో వేడి వేడి
సమోసాలు కట్టించుకురా.. పో!"
దిబ్బయ్య
కడుపుని చేత్తో నొక్కుకుంటూ, మిట్ట
మధ్యాహ్నం ఎండలోకి నడిచాడు.
సరిగ్గా
గంటన్నర తర్వాత...
ప్రకృతి
ఒక్కసారిగా రూపు మార్చుకుంది. ఎండ
కాస్తా మాయమై, ఆకాశాన్ని నల్లటి
మేఘాలు కమ్మేశాయి. క్షణాల వ్యవధిలో తుఫాను
గాలి మొదలైంది. చూస్తుండగానే భీభత్స కాండ! చెట్లు
విరిగిపడుతున్నాయి. కరెంట్ పూర్తిగా పోయింది.
అంతలోనే కుండపోత వర్షం.
ఉద్దండం
భార్య మంగళాంబ హడావుడిగా ఇల్లు
చేరుకుంది. ఆమె వెనుకనే వచ్చిన
ఆమె కూతురు కార్
లోంచి దిగుతూ మెట్ల మీద
కాలు జారి కిందపడింది.
"అమ్మో..
నా నడుము! లేవలేకపోతున్నాను.. తుంటి
ఎముక విరిగింది బాబోయ్!" అంటూ ఆ అమ్మాయి
గట్టిగా కేకలు పెట్టసాగింది.
"ఏవండీ!
త్వరగా రండి! పాప కిందపడిపోయింది,
నడుము విరిగినట్టుంది.. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి.. త్వరగా!"
మంగళాంబ బావురుమంటూ గదిలోకి వచ్చిపడింది.
"అయ్యో!
దేవుడా! ఏమైందే?" ఉద్దండం కంగారుగా బయటకు
పరిగెత్తుకొచ్చాడు. "అరేయ్ కార్ తీయ్
రా శివా! .. ఏడీ ఈ దరిద్రుడెక్కడా
.. అరే .. దేవుడా!"
“డ్రైవరు
ఊరెళ్లాడు కదండీ! మీకేమో డ్రైవింగ్ వచ్చి చావదు, నాకు
రాదు. వచ్చిన పిల్ల ఇప్పుడిట్లా
పడుంది!" మంగళాంబ శోకన్నాలకు అంతులేదు.
అదే సమయంలో వర్షంలో
పూర్తిగా తడిసిపోతూ గాల్లో కొట్టుకొచ్చిన తూనీగలా
తోటలోంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు దిబ్బయ్య.
"అయ్యా..
అయ్యా! తుపాను గాలికి
మా రేకుల షెడ్డు ఎగిరిపోయిందండి.
నా భార్యకి నొప్పులు ఎక్కువయ్యాయి.
నడవలేకపోతోంది.. దాన్ని మీ కార్లో
హాస్పిటల్ కి తీసుకెళ్తా అయ్యా! పుణ్యం ఉంటుంది..
కారిప్పించండి" కాళ్ళా వేళ్లా పడ్డం
ఒక్కటే తక్కువ దిబ్బయ్యకు.
ఉద్దండం
కళ్ళు ఎర్రబడ్డాయి. "దరిద్రపు వెధవా ! నీ పెళ్ళాం
చావు బతుకుల్లో ఉంటే నా కార్లో
ఎక్కించాలా? ఇక్కడ నా కూతురు
నడుం విరిగి పడి ఉంది
.. నీ
పెళ్ళాం నొప్పులు ముఖ్యమా నాకిప్పుడు?"
మంగళాంబ
మెదడులో ఠక్కున బల్బు వెలిగింది.
“నీకు డ్రైవింగ్ వచ్చా, త్వరగా కార్
తీయ్ దిబ్బయ్యా! ముందు నా కూతుర్ని
హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి, నడువ్!"
"అమ్మా!
.. మరి నా భార్య?" దిబ్బయ్య
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
"నోర్మూసుకుని
కార్ తీస్తావా లేదా? లేకపోతే చమ్డా
లొలిచేస్తా .. వెధవా!" కారు కీస్ దిబ్బయ్య
మొహాన విసిరేశాడు ఉద్దండం.
దిబ్బయ్య
నిస్సహాయంగా తల వంచాడు. ధ్యాసంతా కడుపు
నొప్పులతో అల్లాడుతున్న భార్య మీదే ఉన్నా,
యజమాని కుటుంబం చేసే గద్దింపులను
భరిస్తూ కార్ స్టీరింగ్ పట్టుకున్నాడు.
వెనుక
సీట్లో కూతుర్ని పడుకోబెట్టి ఉద్దండం దంపతులు కూర్చున్నారు.
రోడ్లన్నీ
జలమయమై, వరద నీరు మోకాళ్ళ
లోతు పారుతోంది .. దిబ్బయ్య జాగ్రత్తగా, చాకచక్యంగా, కార్ను హాస్పిటల్ దాకా
తీసుకువెళ్లాడు.
హాస్పిటల్
ఎమర్జెన్సీ వార్డ్...
ఉద్దండం
కూతుర్ని స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకెళ్లారు
డాక్టర్లు.
పరీక్షించిన
డాక్టర్ బయటకు వచ్చి, "నడుము
ఎముక ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఐసీయూకి
షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్
చేయాలి" అని చెప్పి లోపలికి
వెళ్ళిపోయారు. ఆ మాట వినగానే
ఉద్దండం " దేవుడా!" అంటూ అక్కడే
ఉన్న బెంచీ మీద కూలబడ్డాడు.
మంగళాంబయితే
గుండెలు పగిలినట్టు ఏడవడం మొదలుపెట్టింది. కోట్లు
ఉన్నా కూతురి బాధను చూసి
విలవిలలాడటం తప్ప ఏమీ చేయలేని
స్థితి వారిది.
అదే సమయంలో కారిడార్ చివర
నిలబడిన దిబ్బయ్య పాత సెల్ ఫోన్
మోగింది. నెంబర్ చూస్తే పక్క
పోర్షన్ లింగానిది.
వణుకుతున్న
చేతులతో ఫోన్ లిఫ్ట్ చేశాడు
దిడ్డయ్య. అవతలి వైపు నుంచి
లింగం గొంతు
వినిపించింది:
"ఒరేయ్
దిబ్బీ! నువ్వేం కంగారు పడమాక!
చెల్లమ్మకు నిమ్మళంగానే ఉందిప్పుడు. మీ రేకుల షెడ్డు
పూర్తిగా కూలిపోక ముందే అంతా కలిసి
నీ పెళ్లాన్ని గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్కి
మార్చాం . ఇప్పుడే మన దాసు డాక్టరమ్మ
పురుడు పోసింది. నీకు పండంటి ఆడబిడ్డ పుట్టిందిరా
! తల్లీ , బిడ్డా ఇద్దరూ సూపర్
గా ఉన్నారు. "
ఆ వార్త వినగానే దిబ్బయ్య
కళ్లల్లో ఆనందబాష్పాలు సుడులు తిరిగాయి. అప్పటిదాకా
భార్య గురించి గుండెల్లో దాచుకున్న
ఆందోళన అంతా ఒక్కసారిగా పటాపంచలైపోయింది.
అతని మనసు తేలికపడింది. సంతోషంతో
వెనక్కి తిరిగాడు.
అక్కడ
ఐసీయూ రూమ్ బయట తల
పట్టుకుని ఏడుస్తున్నారు యజమాని
ఉద్దండం, ఆయన భార్య మంగళాంబ.
తన కష్టాన్ని మర్చిపోయి అస్తమానం తనని చీదరించుకునే ఆ
దంపతుల పట్ల అంతులేని
జాలి పెల్లుబకించె దిబ్బయ్య
గుండెల్లో!
ఐసీయూ లోపల నండం ఫ్రాక్చర్తో బాధపడుతున్న చిన్నమ్మాయిగారు
మనసులో మెదిలింది.
అప్రయత్నంగా
దిబ్బయ్య కారిడార్లో అభయముద్రలో
ఉన్న వినాయకుడి
విగ్రహం వంకే చూస్తూ రెండు
చేతులూ జోడించి,
"దేవుడా!..
మా బాబుగారి అమ్మాయిని ఎలాగైనా కాపాడు! ఆ
దంపతులకు కడుపుకోత మిగల్చకుండా త్వరగా
నయం చేయి తండ్రీ!.."అంటూ
ప్రార్థించాడు.
***




No comments:
Post a Comment