శివం-135
(శివుడే చెబుతున్న కథలు)
రాజ కార్తీక్
(కుండన్న కథ చెబుతున్నాడు కార్తికేయుడు కథలో కుండన్న కోసం వాళ్ళ అమ్మ రావడం , వారిద్దరూ తమ గురించి తెలుసుకోవడం , తప్పిపోయిన చిన్నప్పటి బాబే కుండన్న అని కథలో నేను చెప్పిన ఆనవాళ్ళకి తగ్గట్టుగా తెలుసుకోవడం, కార్తికేయుడు చెప్పే కథలో తల్లి కొడుకులిద్దరూ నా కోసం ఎదురు చూడటం
)
{నేను అనగా శివుడు }
కార్తికేయుడు మాటల్లో కథ కొనసాగుతుంది
హరసిద్ధ మహారాజు ఎవరో పండితులతో చర్చలలో నిమగ్నమై ఉన్నాడు .. కానీ అతగాడి మనసు ఆ చర్చల పైన ఫలవంతంగా దృష్టి నిలబడటంలెదు.. దానికి కారణం.. కార్తికేయుడు మాకు చెబుతున్న కథ తనకి కూడా స్మరణకి ఏదో ఒక జ్ఞాపకం లాగా పదేపదే గోచరిస్తూనే ఉంది.. తనకి బుద్ధి నిమగ్నం కావట్లేదని మరొక రోజు చర్చలు సాగిద్దామని అందరినీ వీడ్కోలు చెప్పి సాగనంపి ఇలా అనుకోసాగాడు
"ఒక్క మహాదేవుడే నాకోసం వచ్చి నన్ను ఎంతో తరింప చేశాడు.. అలాంటిది మహాదేవుడు విష్ణు దేవుడు బ్రహ్మదేవుడు త్రిమాతలు వీరందరూ కార్తికేయని కోసం కదలి వచ్చారా.. అతగాడు ఎంత అదృష్టవంతుడు కాకపోతే సమాధి స్థితిలో ఉండి..
సృష్టిని రాసిన బ్రహ్మకే తను రాసిన కథ చెబుతున్నాడు..
సృష్టిని పాలించే విష్ణువుకే తన పాత్రలతో లాలన చూపుతున్నాడు
సృష్టిని లయము చేసే పరమేశ్వరుడికే తన హృదయం లయమయ్యే విధంగా కథను చెబుతున్నాడు
శక్తినిచ్చే పార్వతి మాతకే.. తన కథనంతో ఉత్సాహం కల్పిస్తున్నాడు
జ్ఞానం ఇచ్చే సరస్వతి మాతకే.. తన కథలతో తన యొక్క జ్ఞాన ప్రవాహాన్ని చూపుతున్నాడు
అన్నిటికీ మించి అన్ని ఐశ్వర్యాలు ఇచ్చే లక్ష్మీ మాత చేత ఆశీర్వాదం పొంది ఆమె మనసుని రంజింప చేస్తున్నాడు..
ఇదంతా నిజమా లేక కార్తికేయుడు మీద అత్యంత ప్రేమతో నాకు కలుగుతున్న మానసిక భ్రమల? సాటి కళాకారుడు పై నాకున్న అభిమానం వల్ల కలుగుతున్న చర్యల ? ఏది ఏమైనా నిజంగా ఇవి బ్రమలైన.. త్రిమూర్తులు త్రి మాతలు గోచరిస్తున్న ఈ భ్రమలు ఎంత అద్భుతంగా ఉన్నాయి.. లేదు బహుశా నిజమయ్యే ఉంటాయి.. మహాదేవుడు నాకేమైనా చెప్పబోతున్నాడా ? తండ్రి మహాదేవ! కుంభన్న .. ఏది ఏమైనానో.. మీరు నాకు అప్ప చెప్పిన విధంగానే పాలన కొనసాగిస్తున్నాను.. అతగాడికి అతను అడిగిన భూమిని ఇవ్వవలసిందిగా నా మనసులో ఉంది కానీ రాజ్య నియమాల రాజ్య రాజ్యాంగ దృష్ట్యా మాత్రమే నేను ప్రవర్తించాను.. అందుకే రాజుగా కాకుండా ఒక సోదరుడు లాగా కొంత పైకం కూడా తనకి నేను ఇచ్చాను.. నా పట్ల ఏమన్నా తప్పులుంటే క్షమించండి మహదేవ , కార్తికేయుడు గడువులోపు ఆ నియమాన్ని పూర్తిగా సంతృప్తి పరచాలని కళాకారులకు దక్కవలసిన భూమిని వాళ్లే చేజిక్కించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను , అలా చేయలేని పక్షంలో రాజుగా నేను నెలకి ఎంతో కొంత జీతం తీసుకుని.. నా స్వార్జీతంతో భూమిని కొనుగోలు చేసి కొంతకాలానికి కళాకారులకు నేను అప్పగిస్తాను , అదే నా మనసులో మాట, అదే నేను కళాకారుల కోసం వేద్దాం అనుకున్న బాట "
అంటూ నిద్రలోకి జారుకున్నాడు
నేను " నాకు తెలుసు హర సిద్ధ! నీవు స్వచ్ఛమైన వాడివి అవసరమైతే కళాకారుల కోసం నీ సొంత భూమి అయినా ఇస్తావు కానీ.. రాజ్య నియమాలకు వ్యతిరేకంగా నువ్వేమి చేయమని నాకు తెలుసు, ఇందులో నీ తప్పు ఏమీ లేదు , కేవలం వినోదం కోసం మాత్రమే నేను ఈ లీలలు చేయసాగాను, కార్తికేయుడు యొక్క అపరిమితమైన భక్తి ను తన రచనలలో చూశాను, తను నా మీద రాసిన బాల రామ బాల హనుమ కథ నన్ను ఎంతోగాను ఆకట్టుకుంది, ఎప్పుడూ జ్ఞానంలో ఉండే నన్ను ఇతగాడి కథలోని భావం నన్ను ధ్యాన భగ్నుడిని చేసింది, నన్నే కాదు విష్ణుమూర్తి సైతం, బ్రహ్మదేవుడు సైతం తమ పాత్రలని భక్తి కోసం వాడుకున్న తీరు వారికి అవి భక్తులు తమపై రాసిన కీర్తనలు వలె గోచరించాయి .. అందుకే ఎన్నో కల్పాలు నుండి సృష్టి కోసం ఉన్న మేము ఒక చిన్న వినోదం చేద్దామని అది నా కోరిక మేరకు అందరము పూనుకున్నాము.. నీకు గోచరిస్తున్నవన్నీ సత్యమే.. నీకు అలా గోచరించడానికి కూడా ఒక కారణం కలదు.. నీవు ఎలా అగ్నిపరీక్షకి గురి అయ్యావు.. మన కార్తికేయుడు అలా మంచు పరీక్షకి గురి అవ్వబోతున్నాడు.. అతగాడి మాటలకి గురువా గురువా అంటూ నన్ను పిలిచే పిలుపులకి.. అతను చెప్పే కథలకి నా మనసు డమరుకం వలె ఘన ఘన మోగుతుంది.. ఇతగాడి కల్పనా శక్తి అమోఘం.. నిన్ను ఎట్లా రాజ్యానికి రాజుని చేశానో... అలానే ఇతగాడిని కళ లకి రాజు గా చేస్తాను.. కదా కథనం మాతలు దర్శకత్వంలో ఇతగాడిది అందే వేసిన చెయ్యి, అతగాడు మలిచిన పాత్రలు లో నా పాత్ర ప్రవర్తించిన తీరు చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను నేను అక్కడ ఉన్నా కూడా అచ్చం అలానే చేసే వాడిని కదా అని అనుకున్న సందర్భాలు కోకొల్లలు.. బాల హనుమంతుడిని బాల రాముడు శయన మందిరానికి తీసుకు వెళ్లిన కథలో .. నిజంగా నేను అనుకున్నాను నేను ఎందుకు బాల హనుమంతుడిని బాలరాముని దగ్గరికి తీసుకెళ్లలేకపోయానని.. ఎప్పుడు రాముడి నామాన్ని జపించే నాకు బాల రాముని బాల ఆంజనేయుని అలా కలిపి ఇంకా రామనామ మధురిమని అనుభవించలేకపోయాను.. బాల రాముని ఎత్తుకొని ఎందుకు ముద్దాడ లేకపోయానని చింత కలిగించాడు నాకు నీ సోదరుడు కార్తికేయుడు, కానీ వీడు కాలాంతకుడు .. నన్ను తొందరగా కరుణించట్లేదని నన్ను బానే దెప్పిపొడస్తున్నాడు పదేపదే, ఒకప్పుడు నీవు కూడా కర్మ అనే పేరు పెట్టి నాతో ఆడుకోవద్దు స్వామి అనేవాడివి. ఎంతైనా నీతో తిరిగాడు కదా , నీతో సహవాసం చేసి నీలాగే మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు , కానీ తప్పుతుందా నీకు చెప్పినట్టు సమాధానం చెప్పాలి కదా, ఇక నీవన్న చెప్పేది కొద్దిగా గొప్ప విన్నావు, ఇతగాడి మమ్మల్ని చూసిన దగ్గరనుంచి సమాధి స్థితిలో ఉండి మేము లేరా నాయనా అన్నా కూడా లేవకుండా తనంతరాత్మతో మాకు సమాధానం చెబుతూనే ఉన్నాడు"
హర సిద్ధ " స్వామి మనవాడికి అసలే భావుకత ఎక్కువ, ఏ పాత్రలో కైనా అలా ఒదిగిపోతాడు నటించి చూపిస్తాడు, అట్లాంటిది సాక్షాత్తు మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత అతని గుండె అతని మనసు ఆత్మను స్థితికి చేరి అతని సహజ లక్షణమైన కథ చెప్పటంతో మొదలుపెట్టి మీ అందరిని రంజింపజేస్తూ బ్రహ్మానందం పొందుతున్నాడు. అతగాడు తను చేసే పని నిజంగా దైవమని నమ్మి,
ఆ దైవం మీద రాసిన కథలు నమ్మి
ఆ దైవమే ఇతని నమ్మి,
ఆ పాత్రలే ఇతని నమ్మి ,
తన కళ్ళ ముందు నిజంగా దైవాన్ని సాక్షాత్కరించుకున్న కర్మయోగి తను "
నేను " అబ్బా మా వాడి గురించి చెబుతూ నువ్వు కూడా కవిత్వం రాస్తున్నావే ,"
హర సిద్ధ " ఊరుకో కుంభన్న ! నా మీద నీ ప్రేలా పనులు "
నేను " ప్రేలా పనులు కాదు ప్రేమా లాపనులు "
హర సిద్ధ " ఇంతకీ ఇప్పుడు ఎక్కడ దాక వచ్చింది"
నేను" అదిగో కుండన్న తన తల్లిని కలుసుకొని నేను తన స్నేహితుడిని చెప్పాడు తర్వాత ఏం జరగబోతుందో ఇంక మొదలెట్టంటే మిగిలిన కథ కూడా చెప్తాడు "
హర సిద్ధ " కథ చాలా బాగుంది స్వామి"
నేను " బాగుండ పట్టే కదయ్యా ! ఇతగాడి ముందు మేమందరము కూర్చొని కథలు వింటున్నాము "
హర సిద్ద" ఇతగాడికి కూడా శాశ్వత శివ సాయుజ్యం ఇవ్వండి చక్కగా మనం రోజు కథలు చెప్పుకోవచ్చు "
నేను " అలా ఇస్తే విష్ణు దేవుడు ఊరుకుంటాడా తన వైకుంఠనికి పంపించమని చెప్పని అంటాడు , బ్రహ్మదేవుడు బ్రహ్మ లోకానికి పంపించమని చెప్తాడు"
హర సిద్ద " పోనీలే గురువా! చక్కగా మూడు లోకాలకు తిరుగుతూ తన రాసుకున్న కథలు చెప్పుకుంటూ మిమ్మల్ని అల్లరింపజేస్తూ తాను తరిస్తాడు"
నేను " ఏమయో నువ్వు కూడా కార్తికేయలేక గురువా అని పిలుస్తున్నావు.. నీకు కూడా నా సాయూజ్య వరం ఉంది కదా, నీవు కార్తికేది ఇద్దరూ కలిసి అన్ని లోకాలి కి వెళ్లి రావాల్సి ఉంటుంది "
హర సిద్దు " తమరు ఎలా చెప్తే అలా మహాదేవ , మిమ్మల్ని ఇలా నవ్వు మొహంతో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది "
నేను " జరగబోయేది ఎంత రసవత్తరం గా ఉంటుందో చూడవయ్యా హరసిద్ద "
అంటూ హర సిద్దుడు నిద్రలో నుంచి మేలుకొన్నాడు..
ఇప్పటిదాకా వచ్చినది కలని మాత్రం అతడు అనుకోవట్లేదు.. ఎందుకంటే అది నేను అతనికి తెలియజేయటానికి కలను మాధ్యమంగా వాడుకున్నాను..
నేను " నీవు కథ మొదలు పెట్టు కార్తికేయ బ్రహ్మదేవుల వారు విష్ణుదేవుల వారు మీ త్రిమాతలు కథ ముగింపు కోసం ఎదురుచూస్తున్నారు "
కార్తికేయ " కుండన్న.. మనసు తన తల్లిని చూసినప్పుడు ఆనందంతో ఎలా అనిపించింది అంటే "
...




No comments:
Post a Comment