శ్రీథరమాధురి - 116 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 116

Share This

 శ్రీథరమాధురి - 116

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


మీరు నీటిలాగా స్వచ్ఛంగా ఉండాలి. పంచదార నీళ్లల్లో కరిగినప్పుడు, ఎటువంటి అవశేషం మిగలదు. గురువు పంచదార వంటి వారు. మీరు స్వచ్ఛమైన నీరు. నీరు స్వచ్ఛంగా ఉంటేనే, పంచదార అందులో పూర్తిగా కరుగుతుంది. పంచదార నీటిలో పూర్తిగా కరిగడమన్నది, నీటి యొక్క స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి గురువును అందుకోవడానికి స్వచ్ఛమైన హృదయంతో ఉండండి.

 
***
ఒక చైనీస్ సామెత ఇలా అంటుంది...
'మాటల్ని, నీటిని ఒలకబొయ్యడం తేలిక, కానీ తిరిగి తీసుకోవడం కష్టం'...
 
కాబట్టి మీ భావాలను వెల్లడించే ముందు అప్రమత్తంగా ఉండండి. కొన్నిసార్లు అవి ఒక మంచి అనుబంధాన్ని కోలుకోలేని దెబ్బ తీయవచ్చు. ధర్మాత్ముడై‌న వ్యక్తి ఎల్లప్పుడూ సంతులనంతో ఉంటాడు, అతనికి నాలుక యొక్క శక్తి తెలుసు.

***

మీరు ఆత్మజ్ఞానం పొందుతున్న కొద్దీ, స్వచ్ఛతను సంతరించుకుంటారు. స్వచ్ఛత అనే ప్రక్రియ బయట, లోపల కూడా జరుగుతూ ఉంటుంది. కేవలం బకెట్లో కొద్ది పవిత్రమైన నీటిని ఒంపుకోవడం మిమ్మల్ని శుభ్రపరచదు. మీలో ఆ గుర్తింపు రావడానికి అదొక సంకేతంగా మాత్రమే పనిచేస్తుంది. సాక్షాత్కారమనే ప్రక్రియ మీలో మొదలయ్యాకా, మీరు పవిత్రత అనే మార్గంలో పయనిస్తారు. ఇంటిని, బట్టలని రోజూ శుభ్రపరచినట్లుగా ఇది ఉంటుంది. పవిత్రీకరణ అనేది ఒక నిరంతర ప్రక్రియ.

***
దురాశ, స్వార్థం, లోభం, అహంకారం ఇవన్నీ కూడా కోపమనే అగ్నికి ఆజ్యం పోస్తాయి. ఇది మనసులో ఉండే దుష్ట శక్తులు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇవి మీలో పొదగబడి ఉన్నాయి.
 
కేవలం హృదయం నుంచి ప్రవహించే బేషరతైన ప్రేమ అనే నీరు, ఈ కోపాగ్నిని చల్లార్చి,  ఇటువంటి దుర్గుణాలను శాశ్వతంగా నిర్మూలిస్తుంది.

***

No comments:

Post a Comment

Pages