శివం - 106 - అచ్చంగా తెలుగు

 శివం - 106

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్ 


నేను అనగా శివుడు( కార్తికేయుడు నాతో కోటప్పకొండ నుంచి మా ఇంటికి వద్దు గాని పద అని అడగగా వస్తున్నప్పుడు భక్తుల గురించి భౌతిక జీవనంతో కూడిన ప్రశ్నలు వేస్తాడు)


నేను " సరే బాగుంది.. అయితే భక్తులు ఇబ్బందులు పడ్డారని అంటావా" 

కా "గురువా నేనేమీ అనను అలాంటి మహానుభావులకి అన్ని  భావాలు సమంగా ఉంటాయి.. ఆనందం వచ్చినప్పుడు పొంగి పోరు బాధ వచ్చినప్పుడు భయపడరు "


నేను " మరి దేనికోసం నువ్వు ఇలా బాధపడుతున్నావ్ భక్తుడు అయితే నీకు కూడా సహజమైన నిశ్చల స్థితి వస్తుంది కదా " 


కా " వద్దయ్య స్వామి నాకు నిశ్చల స్థితి  వద్దు , నాకు కళ లో  ఉంది ఆనంద్ స్థితి కళాకారులకు వచ్చే భావ స్థితి దరి చేరితే చాలు స్వామి " 

నేను " ఏమిటయ్యా ఇందాకే నేను మంచి వాడిని అన్నావ్ మళ్ళీ ఏదో మాట్లాడుతున్నావ్ " 

కా " ఏమనయ్యా భగవంతుడిని ఏమన్నా అడగాలంటే భయం పుడుతుంది ఏ మాటకి ఏ ప్రశ్నకి ఏ పరీక్ష పెడతాడో  భగవంతుడిని ఏమన్నా అడగాలంతే ఆ పరీక్ష ని  ఎదురు కోవ డా ని కి నా జీవితం ఏ విధంగా తయారవుతుందో అని నాకు అదొక భయం.. పైగా భగవంతుడికి తన మన అని తేడాలు ఏమీ ఉండవు, ఎవడినైనా ఒక ఆట ఆడుకుంటాడు ఆడుకొని పరీక్ష పెట్టారంటాడు, ఈ చరాచరా సృష్టిలో భగవంతుని అర్థం చేసుకోవడం అనేది ఎవరి తరము కాదు ఏదో మనకు అర్థమయినంతలో భగవంతుడు ఇలా ఉంటాడు అనుకోవటమే భగవంతుని తత్వం ఎవరికి సంపూర్ణంగా తెలియదు ఊరికే అంటాడు నా భక్తులకి నా తత్వం అర్థమవుతుందని "

నేను " సరే నీకు పరీక్షలు అనే కష్టాలు ఏమి ఉండవు పోనీ భగవంతుడిని నువ్వు కనపడితే ఏం కోరుకుంటావు " అన్నాను చలాకీగా

కా " నేనైతే కళారాదన వల్ల వచ్చే ఆనందాన్ని మొట్టమొదటిగా కోరుకుంటా రెండు కొద్దిపాటి భౌతిక జీవితాన్ని భోగభాగ్యాలతో అనుభవించే విధంగా ధర్మపద్ధమైన జీవితాన్ని కోరుకుంటా, మూడు మూడు.

నేను "ఏమి నంచుతావ్ చెప్పు "

కా "అయ్యా భగవంతుని ధ్యానంలో ఒక బ్రహ్మానంద స్థితి లభిస్తుంది ఆ బ్రహ్మానంద స్థితి కోసమే ఎంతో మంది యోగులు రుషుల సంవత్సరాల తరబడి తపస్సులు అంతే కూర్చుంటారని విన్నాను వీలైతే తలచినప్పుడల్లా ఆ బ్రహ్మానందం నాకు రావాలని భగవంతుని కోరుకుంటాను అయ్యా"

నేను " ఉపనిషత్తుల సంగ్రహించ పట్టి కఠోరంగా సాధించేదాన్ని సులభంగా అడుగుతావు అన్నమాట ఆహా మాటకారివే పెద్ద ప్రణాళికే వేసావ్ " 

అందరూ మా మాటలు వింటున్నారు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు 

కా " ఏమయ్యా అలా అంటావు ఏమి బ్రహ్మ రాక్షసులకు వరాలు ఇవ్వలేదా.. చూడబోతే రాక్షసుల బతికే నయం లాగా ఉంది, వారి కోసమే భగవంతుడు అవుతారా దర్శనమిచ్చి వారిని సంహరించి వారు ఎన్ని తప్పులు చేసినా చివరికి వారికి మోక్షం ప్రసాదించారు , ఏమన్నా అంటే వారి పూర్వ జన్మ  అని మరొకటి  చెప్తారు" 

నేను " అంతే కదా? " 

కా " ఇక నువ్వు ఉన్నావా అదే శివుడివి ఇందాక నుంచి నిన్నే శివుడని అనుకుంటున్నాను కదా .. అయినా తిట్టించుకొని వరాలు ఇచ్చేది నువ్వే స్వామి" అంటూ బాటకి ఎదురుగా ఉన్న ఒక చిన్న గుడిలో గర్భాలయంలో శివలింగాన్ని వెలిత్తి చూపిస్తూ వెక్కిరిస్తున్నాడు

నేను "అదేమిటయ్యా ఆయన ఏమీ చేశాడు"

కా "శివయ్య గారికి నిందా స్తుతి అంటే ఇష్టము కదా ఒకవైపు తిడతారు మరొకవైపు పొగుడుతారు.. అది తిట్ట పోగొడతా తేల్చుకునే లోపు ఆ అడిగాడు కదా ఇచ్చేద్దాంలే అని వరం ఇస్తాడు. నువ్వు వరవిస్తావు బ్రహ్మ రాక్షసులకి కఠోరవరం ఇస్తావు.. వాళ్ల ఎదురు కోలేక ప్రతి ఒక్కరికి జేజమ్మ దిగి వస్తుంది. వరం ఇవ్వటం ఎందుకు ఎదుర్కోవటం ఎందుకు" అంటున్నాడు అలోవక గా

అందరూ ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు నేనేమి చెబుతున్నానని 

నేను " చూడు కార్తికేయ ఒక గణిత పరీక్ష జరుగుతుంది.. సూత్రాలని సరి చేయవలసిందిగా పరీక్ష.. ఒక దుర్మార్గుడు ఆ పరీక్షని ఉన్నతంగా రాసి అన్ని సూత్రాలను పరిష్కరించాడు.. అప్పుడు అతడు మంచివాడు కాదు కదా అని నూటికి నూరు శాతం ఇవ్వాలా వద్దా ? "

కా " ఇవ్వాలి"

నేను " అదే నేను ... శివుడు చేసింది "

కా " బాగుందయ్యా ఆయన వేషం వేసుకున్నామని ఆయన భలే వెనకేసుకొస్తున్నావ్ నా సామి రంగ " 


నేను " లేదు మిత్రమా నీకు నిజాన్ని చెప్పాను" 

కా "ఈ యొక్క సూత్రం మీదే రాక్షసులకి విచిత్ర వరాలిచ్చి లోకాన్ని ఎడి  పించవా తండ్రి " 

నేను " ... హ్మ్మ్ "" అని ము భావనగా ఉన్నాను

కా "ఈ సూత్రం ప్రకారం వారు దాదాపు చావు లేదు అనే వరాన్ని పొంది వాళ్ళు చచ్చేదాకా జనాల్ని చంపుతారు ఆ జనాల్ని చంపే సమయానికి ఏదో ఒక అవతారంలో వచ్చి మళ్ళీ కాపాడుతావ్ అక్కడ గుడి కట్టిస్తావు బాగుంది గురువా నీ వ్యవహారం" 


నేను "కార్తికేయ బాగుంది బాగుంది నీ ప్రశ్న శైలి ఇక మీద రాక్షసులు ఎవరు పుట్టరులే"

కా " గురువా రాక్షసులు పుట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనుషులోనే రాక్షసత్వం ప్రవలి సాటి మనిషిని వేపుకు తింటున్నారు " 

నేను " అవును కార్తికేయ కలి ప్రభావం  యుగానికో ధర్మం ఉంటుంది. ఆ ధర్మం దాని పని అది చేసుకుంటూ పోతుంది .. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది "


కా " బాగుంది గురువా ఆ కృష్ణుడు అర్జునుడికి గీత చెప్పినట్టు నువ్వు నన్ను నడిపిస్తూ చక్కటి గీత చెప్పావ్ ఈ గీతతో నా రాత మార్చుకుంటా " 

నేను" మార్చుకో మంచిగా మారిపోతుందిలే"

కా " ఇంకెంత దూరం నడవాలి ఇప్పుడు గురువా" 

నేను " కొద్దిగా ఓపిక పట్టు .. మనం వెళ్లే లోపు అందరూ ఏర్పాట్లు చేయాలిగా "

ఇక్కడ విష్ణుదేవుడు కైలాస పరివారం బ్రహ్మదేవుడు మరియు మీ త్రిమాతలు ఇక నాటకం మొదలవుపోతుందని నవ్వుకుంటున్నారు

 ఇక మీద చూడండి..
కైలాసం వైకుంఠం బ్రహ్మలోకం అంతా ఇక్కడే...
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages