రాయల్ జెల్లీ (తేనెటీగల ఉత్పత్తి) ఆరోగ్య ప్రయోజనాలు - అచ్చంగా తెలుగు

రాయల్ జెల్లీ (తేనెటీగల ఉత్పత్తి) ఆరోగ్య ప్రయోజనాలు

Share This
రాయల్ జెల్లీ (తేనెటీగల ఉత్పత్తి) ఆరోగ్య ప్రయోజనాలు
అంబడిపూడి శ్యామసుందర రావు 



రాయల్ జెల్లీ అనే పేరును బట్టి ఇదేదో రాచరికానికి సంబంధించినది అనుకుంటాము లేదా ఖరీదైన ఆహారము అనుకుంటాము. అది కొంతవరకు నిజమే ఇది సహజముగా తేనెటీగల చే తయారు చేయబడేది చాలామందికి తేనెటీగలు తియ్యనైన తేనెను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి అని తెలుసు. 

తేనెటీగల పట్టు లో ఒక రాణి ఈగ కొద్ది సంఖ్యలో మగ  ఈగలు  అధిక సంఖ్యలో అడ ఈగలు వీటిని కూలి ఈగలు అంటారు తేనే సేకరించటం తేనే పట్టు నిర్మించటం తేనె పట్టును సంరక్షించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు వీటికి సంతానోత్పత్తి శక్తి లేదు ఒక్క రాణీ ఈగ మాత్రమే మగ ఈగలతో సంపర్కం చెంది గుడ్లు పెడుతుంది.  తేనే సంపాదించే ప్రయత్నం లో తేనెటీగలు (ఒక్క కూలి ఈగలు మాత్రమే) కుడతాయి అని తెలుసు.

అంతే కాకుండా తేనెటీగలు పూలలో మకరందాన్ని సేకరించే  ప్రయత్నములో పూలలో పరాగ సంపర్కము, పూలలో ఫలిదీకరణానికి తోడ్పడతాయి ఇవన్నీ కాకుండా తేనెటీగలు ఒక ప్రత్యేకమైన పదార్ధము రాయల్ జెల్లీ తయారు చేస్తాయని చాలా మందికి తెలియదు రాయల్ జెల్లీ అనే పేరులోనే రాజరికపు, రాణి వాసపు పోకడలు కనిపిస్తాయి.  ఈ రాయల్ జెల్లీ లో విటమిన్లు ప్రోటీన్లు అనేక ఉపయోగకరమైన ఎంజైములు ఉంటాయి.

కానీ రాయల్ జెల్లీ తేనే అంత పాపులర్ కాదు. దీనిని అనేక పదార్ధాలలో ఉపయోగిస్తూ ఫుడ్ సప్లిమెంట్ గా అమ్ముతుంటారు.ఈ రాయల్ జెల్లీ మీద జరిపిన పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి ఏది ఏమైనప్పటికి రాయల్ జెల్లీ మన ఆరోగ్యానికి సౌందర్య పోషణకు ఉపయోగపడుతుంది అని తెలుస్తుంది.

రాయల్ జెల్లీ అంటే ఏమిటో తెలుసుకుందాము.రాయల్ జెల్లీ అంటే తేనెటీగలు తయారు చేసే పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారము ఇది తేనే పట్టు లో  తేనెటీగల లార్వాలకు  రాణీ ఈగ కు ఆహారము గా పని చేస్తుంది కొత్త రాణీ ఈగ తయారు అవటానికి ఈ రాయల్  జెల్లీ అవసరము ప్రస్తుతము ఉన్నరాణీ ఎలాగో  బలహీన పడ్డప్పుడు లార్వాలలో ఒక దాన్ని ఎన్నుకొని భవిషత్తులో రాణీ ఈగ అవటానికి రాయల్ జెల్లీని ఆహారముగా తినిపిస్తాయి రాయల్ జెల్లీ తిన్న లార్వా రాణీ ఈగ
గా వృద్ధి చెందుతుంది రాయల్ జెల్లీ ఉత్పత్తికి ప్రేరణగా మగ ఈగలను కొత్త తేనే పట్టు కు ప్రోత్సహిస్తాయి.లార్వా లు విడిగా నాలుగు రోజుల తరువాత రాణీ ఈగ సెల్ నుండి ఆహారాన్ని(రాయల్ జెల్లీ)  తీసుకొని ఒక లార్వా ఈ ఆహారము దాని జీవిత కాలము మొత్తం తినడానికి వీలుగా కూలి ఈగలు ఏర్పాటు చేస్తాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒక తేనె పట్టులో కూలి ఈగలు సుమారు 500 గ్రా రాయల్ జెల్లీ తయారు చేస్తాయి.సరిగా నిల్వ చేసే సదుపాయాలు ఉండనందుగా దీనిని ఇతర తేనెటీగల ఉత్పత్తులలో(తేనే లేదా తేనెటీగల వ్యర్థ
పదార్థాలతో)  కలిపి నిల్వ చేస్తాయి.

ఎందుకు  రాయల్ జెల్లీ ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాము.ఎందుకంటే దీని నిండా రకరకాల విటమిన్లు, మాంస కృత్తులు, ఏమైనా ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా దీనిలో బి 5, బి 6 మరియు ఎసిటైల్ కొలైన్ అనే న్యూరోట్రాన్స్మీటర్లు కూడా ఉంటాయి.ఇవి నాడీ  ప్రచోదనాలు శరీరములో ప్రసరణకు ఉపయోగిస్తాయి.అదనంగా రాయల్ జెల్లీ లో మినరల్స్, ఎంజైమ్స్ 18 రకాల ఏమైనా యాసిడ్లు, అధిక సంఖ్యలో యాంటి బాక్టీరియల్  పదార్ధాలు, మరియు యాంటీ వైరల్ఏ జెంట్స్, యాంటిబయోటిక్ పదార్థాలు కూడా ఉంటాయి.రాయల్ జెల్లీ లోని ప్రోటీనులు మనకు అవసరమైన 8 ఆవశ్యక ఏమైనా ఆమ్లాలను  కలిగి ఉంటాయి.శక్తి ఉత్పాదనకు అవసరమైన గ్లూకోజ్, ప్రక్టోజ్ ఉంటాయి.

 గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటి అంటే రాయల్ జెల్లీ కి ఎలర్జీ కలుగజేసే లక్షణం ఉంది కాబట్టి ఇది అందరికీ క్షేమము కాదు. ముఖ్యముగా తేనెటీగల విషానికి సెన్సిటివ్ గా ఉండేవారికి రాయల్ జెల్లీ అసలు పడదు.అలాగే ఎలర్జీ ఉన్నవారికి,ఆస్తమా ఉన్నవారికి, కూడా పడదు. వీరిలో రాయల్ జెల్లీ నెగటివ్ రియాక్షన్స్ ను కలుగ జేస్తుంది.  కొన్ని మందులతో పాటు కలిపి తీసుకోవటం కూడ మంచిది కాదు. కాబట్టి రాయల్ జెల్లీ వల్ల ఎన్నోఉపయోగాలు ఉన్నప్పటికీ
వాడే విషయములో డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ సలహా మేరకు వాడాలి.ఇక రాయల్జెల్లీ ఉపయోగాలు తెలుసుకుందాము.

1.రక్త ప్రసరణ ; రాయల్ జెల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను రక్త పీడనాన్ని ఇంప్రూవ్ చేస్తుంది.అని ఈ మధ్య జరిపిన పరిశోధనల ద్వారా తెలుస్తుంది. పరిశోధకులు అధిక రక్త పీడనం , ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న ఎలుకలకు రాయల్ జెల్లీని తినిపించి,కొన్ని నెలల తరువాత పరిశీలిస్తే వాటి యొక్క రక్తములోని ట్రై గ్లిజరైడ్లు ఇన్సులిన్ లెవెల్స్ గణనీయముగా తగ్గినట్లు గుర్తించారు.
2.ఫెర్టిలిటీ సమస్యలు ; రాయల్ జెల్లీ ఉన్న పదార్ధాలు ఫెర్టిలిటీ సమస్యలు ఉన్న దంపతులకు ఇస్తే ఆడవారు గర్భిణీ ఆయె అవకాశలు పెరుగుతాయి అని పరిశోధనలు తెలుపుతున్నాయి.దీనికి కారణము ఆస్తినోజూస్పెర్మాట అంటే శుక్రకణాల కదలిక వేగము తగ్గించటం. టీనే పట్టులోని సాధారణ అడ ఈగలు సంతోనోత్పత్తి శక్తి లేనివి కానీ రాణీ ఈగ రాయల్ జెల్లీ ని ఆహారముగా తీసుకొని పెరగటం వలన 2000 గ్రుడ్లను రోజు పెట్టగలిగే శక్తి వస్తుంది. అంటే రాయల్ జెల్లీ అనే ఆహారము ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచి ఎక్కువ గ్రుడ్లు పెట్టేటట్లు చేస్తుంది అలాగే రాయల్ జెల్లీ ఆడవారిలో ఋతుచక్రాన్ని స్టెబిలైజ్ చేయటము,మగవారిలో శుక్రకణాల ను వృద్ధి చేయటము
చేస్తుంది ఇద్దరిలో లైంగిక వాంఛను కూడ పెంచుతుంది.
3 క్యాన్సర్ తో పోరాడుతుంది;.2009 లో ప్రచురితమైన పరిశోధన వ్యాసములో రాయల్ జెల్లీ క్యాన్సర్ వల్ల ఏర్పడ్డ ట్యూమర్లకు రక్త ప్రసరణను సప్రెస్ చేసి క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. రాయల్ జెల్లీ లోని క్రొవ్వు కాంపౌండ్స్ లోని ఈస్టోజెనిక్ పదార్ధము బ్రెస్ట్ మరియు సర్వైకల్క్యాన్సర్ లతో పోరాడటానికి సహాయ పడుతుంది.  
4.చర్మానికి  పునరుజ్జీవము తెస్తుంది.; రాయల్ జెల్లీ హెల్త్ సప్లిమెంట్ గా మాత్రమే కాకుండా స్కిన్ కేర్ ప్రోడక్ట్ గా కూడా ఉపయోగిస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే కొలాజిన్ ను ఉత్పత్తి చేసే లక్షణము యాంటీ యాక్టివిటీని పెంచి యవ్వనంగా ఉండే మృదువైన చర్మాన్ని ఇస్తుంది. అలాగే
చర్మము కాలినప్పుడు గాయాలను మాన్పి కొత్త చర్మము అభివృద్ధి చెందటానికి దోహదపడుతుంది కాలిన గాయాలు అయినప్పుడు రాయల్ జెల్లీని కాలిన బొబ్బలపై నేరుగా అప్లై చేయవచ్చు. .
5. మెనోపాజువల్ లక్షణాలు; స్త్రీలు మెనోపాజ్ దశలో ఉన్నప్పుడు వారిని ఇబ్బంది పెట్టె మెనోపాజ్ లక్షణాలు ( యోని పొడిబారటం,తలనొప్పి, అలసట మొదలైన లక్షణాల) నుండి ఉపశమనానికి వివిధ రూపాల్లో ఉండే రాయల్ జెల్లీ బాగా ఉపయోగిస్తుంది.ఇది తీసుకోవటం వల్ల  మెనోపాజ్ ఏజ్  గ్రూప్ లో ఉండే అడ వారి ఆరోగ్యము మెరుగవుతుంది.రాయల్ జెల్లీ తీసుకోవటం వలన అస్టియోబ్లాస్ట్యాక్టివిటీ వృద్ధి చెంది బోన్ డెవలప్ మెంట్ సక్రమముగా ఉండి ఆడవారిలో
క్యాల్షియం లాస్ ను నివారిస్తుంది.
6.ప్రి మెనుస్ట్రాల్ సిండ్రోమ్ లక్షణాలను అనుభవిస్తున్న వారికి రాయల్ జెల్లీ ఉపయోగకరంగా ఉంటుంది అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ రాయల్ జెల్లీ,అసహనం, బరువు పెరగటం, వాపు, నొప్పి వంటి ప్రి మెన్స్ట్రల్ సిండ్రోమ్ లక్షణాల నుంచి ఉపశమనం కలుగజేస్తుంది.
7.మధుమేహ రోగుల్లో పాదాలలో ఏర్పడే పుండ్లు(అల్సర్) ను తగ్గిస్తుంది: మధుమేహం వల్ల  ఏర్పడే దుష్పరిమాణాలు ఒకటి పాదాలలో పుండ్లు ఏర్పడటం. వీటికి  రాయల్ జెల్లీ కలిగిన ఆయింట్ మెంట్లు బాగా పని చేస్తాయి ఈ ఆయింట్మెంట్ వాడే ముందు పుండ్లను  శుభ్రపరచి మృత కణాలు తీసేసి ఒక ఆరునెలల పాటు వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
8.కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: ఫుడ్ అండ్ సైన్స్ మేగజైన్ వారు చేసిన అధ్యయనంలో రాయల్ జెల్లీ ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ వారిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించటం గమనించారు.ఇది ఎలా సాధ్యం అంటే ప్రసరణలో ఉన్న లో డెనిసిటి లైపో ప్రోటీన్స్ ను తగ్గించటం ద్వారా జరుగుతుంది. ఆలా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి.

ఇదండీ రాయల్ జెల్లీ గురించిన సమాచారం మనకు తేనె బజార్లో దొరుకుతుంది కానీ రాయల్ జెల్లీని వైద్య పరంగా స్కిన్ కేర్ ప్రోడక్ట్ గాను ఉపయోగిస్తారు. కాబట్టి వారు తేనే పట్టు నుండి సేకరిస్తారు.

***

No comments:

Post a Comment

Pages