చెన్నకేశవ శతకము - అడుగుల రామయాచారి - అచ్చంగా తెలుగు

చెన్నకేశవ శతకము - అడుగుల రామయాచారి

Share This

చెన్నకేశవ శతకము - అడుగుల రామయాచారి

దేవరకొండ సుబ్రహ్మణ్యం 



కవి పరిచయం: చెన్నకేశవ శతకకర్త అడుగుల రామాచారి ఈశతకాన్ని దైవాలరావూరులో కొలువైన చెన్నకేశవ స్వామివారిని ఉద్దేశించి రచించారు. వీరు మార్టూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోను దైవాలరావూరు జిల్లా పరిషదోన్నత పాఠశాలలో ప్రథమశ్రేణి తెలుగు పండితులుగా పనిచేసారు. వీరు ఆకాశవాణి విజయవాడకు ప్రతి ఆదివారం సమస్యాపూరణ్ములు పంపేవారు. వీరు ఈశతకాన్ని చెన్నకేశవస్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆద్యక్షులైన శ్రీ రావి ఆంజనేయుల కోరికమేరకు రచించినట్లు తెలుస్తున్నది. ఈశతకానికి మకుటంకూడా ఆంజనేయులు గారే సూచించారు. వీరి తండ్రి అమృతానందము తల్లి కోటిశాంబ. శతకాంతమున కన గురించి ఈవిధంగా చెప్పికొనినాడు.

అడుగుల వంశ వార్నిధిన అమృతానందము కోటిశాంబకున్
పుడమి జనించి నీదుపద పూజలొనర్చి శతాధికంబుగా
నుడివియు పద్యపుష్పముల ఉత్సుకతన్ యిడి తంకితంబుగా
కడపక దీనిగైకొనియు కావుము దైవపురీశ చెన్నకేశవా!

ఉ. పూనిక నేఏర్చి కూర్చితిని పూర్తిగ నుత్పల చెంపకములన్
మానితపుణ్య నాదు సుమమాల ధరించియు ముక్తి నీయవే
దీనదయాసముద్ర జగతీధవ శ్రీహరి చిన్నికృష్ణ యో
మానితపుణ్య నిన్గొలుతు మాధవ దైవపురీశ చెన్నకేశవా

వీరి ఈశతకమే కాక "హనుమత్కల్యాణము" అనే పద్యప్రబంధము 'శృంగార చమత్కార చాటుర్తులు" "తెలుగులో పదప్రయోగములు (దోషములు, నివారణ)" అనే గ్రంథాలను రచించినట్లు తెలుస్తున్నది.

శతక పరిచయం: 

"డైవపురీహరి చెన్నకేశవా" అనే మకుటంతో నూట ఏడు (107) చంపకోత్పలమాల వృత్తాలలో రచింపబడిన ఈశతకం భక్తిరస ప్రథనమైనది. శతకాం  ఆదిదేవుడైన శ్రీహరి దశావతార వర్ణనలతో ప్రారంభం అవుతుంది, పరశురామావతారం వరకు ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క అవతారం, రామావతార వర్ణన నాలుగు పద్యాలలో, తరువాత చెన్నకేశవుడైన శ్రీకృష్ణుని అవతారాన్ని పదునైదు పద్యాలలో వర్ణించారు. పద్యాలు సరళమైన గ్రాంధిక భాషలో ఉండి పండితులకే కాక పామరులకు కూడా చఫువుకోవటాకిని సులభంగా ఉంది.
ఇప్పుడు కొన్ని పద్యాలను చూద్దాము.

చం. దొరకొని దేవదానవులు, దుగ్ధపయోధి మధింప ధారుణీ
ధరమును జేసి కవ్వముగ, దానికి తాడొనరించి వాసుకిన్
తరచిన మున్నులోకములు, తల్లడమందగ కూర్మరూపివై
అరయ భరించినట్టి పరమాత్ముడ! దైవపురీశ కేశవా!

చం. భీకరుడా హిరణ్యకుడు, పెద్దగదంగొని, యుక్కుకంభమున్
దాక నృసింహ మూర్తివయి, దానవు కూల్చియు మోక్షమిస్తి వా
భీకరరూప తీవ్రతకు భీతిల లోకము నీ స్వరూపమున్
చేకొని భక్తు బ్రోచితివి శీఘ్రము దైవపురీశ కేశవా!

ఉ. యుద్ధమునందు తాటకిని యుక్కణగించియు శంభువింటినో
శుద్ధచరిత్ర నీవిరచి సొంపుగ భూసుతపెండ్లియాడి యా
వేద్ధమహీశునాజ్ఞనటవీస్థలి శ్రీరఘ్రామ మూర్తివై
కృద్ధత రక్కసాధముల కొమ్మణగించితి చెన్నకేశవా!

ఉ. దేవకీ గర్భవాసమున తేజముమీరగ కృష్ణమూర్తివై
నీ విలబుట్టి శీఘ్రముగ నేర్పున పూతనగూల్చి గోవులన్
కావగ శైలమెత్తి ఖలుకంసుని జంపియు కౌరవాదులన్
దేవ వధించి వేసితివి తేజము మీరగ చెన్నకేశవా!

శ్రీరామావతార పద్యములు

ఉ. పాతకి తాటకిందునిమి పావనుడంచు జగంబులోన ప్ర
ఖ్యాతివహించి నావు చెడుకార్యౌజేసెడి దుర్జనావళిన్
యాతనలంద జేయక దయారసమున్ దగనిచ్చి ప్రోతువో
పూతచరిత్ర వేడెదను పుణ్యుడ శ్రీహరి చెన్నకేశవా!

ఉ. పాదము సోకి యొక్క శిల భామగ మారెను దేవదేవ! నీ
పాద సరోరుహంబులను పాయక గొల్చెద భక్తితోడ! నా
బాధలు మాన్పి దుఖః భవబంధ విమోచను జేసి కావుమో
శ్రీదసమస్త లోక పరిపాలక! శ్రీహరి చెన్నకేశవా!

శ్రీకృష్ణావతార పద్యములు

ఉ. చిన్నతనాన నీవు సరసీరుహలోచన క్రీడలాడుచో
మన్నును మెక్కె కృష్ణు డనుమానము లేదని చెప్ప గోపకుల్
మన్నిటులేల దింటివని మాధవుదిట్ట యశోద కాస్యమం
దెన్నచెరా చరాండము లనేకము జూపితి చెన్నకేశవా!

చం. అరయకళింద జానదిన యారయకాళియు మస్తమెక్కి స
త్వరగతి పాదతాడనల దర్పమణంచగ గజ్జలందియల్
స్ఫురిత మనోజ్ఞమై కదల సొంపగు నాదములుద్భవింపనీ
ధరణిన గోపకుల్ గనిరి తావక నృత్యము చెన్నకేశవా!

చం. విజయుడు తొల్లొ యుద్ధమున వేసరి యెంతో విషాదమందినన్
నిజమగు గీతసారమతి నేర్పున దెల్పియు విశ్వరూపమం
దజునునెకాక రుద్రని వహాయన సర్వచరాచరంబులన్
గజిబిజి లేక చూపగనె జ్ఞానము నందిన పార్థుడంత యో
గజవరదుండ! కౌరవుల గ్రక్కున గెల్చెను చెన్నకేశవా!

మోక్షసంబంధ పద్యములు

ఉ. అనుజులు భార్య పిల్లలును అన్నలు చుట్టము లాదియైన వా
రునుపమ మిత్ర భావమున యాస్తి హరింపగ్ జేరవత్తురా
అనువగు సంపదల్ దిరిగినప్పు డెవండును రాడుగాన నిన్
మనమున నెంచువాడె పరంధాముజేరును చెన్నకేశవా!

ఉ.ఆవులనేక వర్ణగతులాపయి పాలొకటైన భంగి యా
తావిగలట్టి స్వర్ణమిల తానదియెన్నియొ భూషలౌగతిన్
నీవిమల స్వరూపమదినెన్ని యొ నాకృతులైనదంచు, ని
న్నమలినభక్తి గొల్చెదను అచ్యుత దైవపురీశ కేశవా!

భక్తిసంబంధ పద్యములు

ఉ. చేసినపాపముల్ మరల చేయక నిన్నతి భక్తిశ్రద్ధలన్
దోసిలి యొగ్గివేడెదన్ దోసములెంచక యోయజాక్ష నన్
దాసుని గావు ప్రత్యహము దార కృపారస వీక్షనాల నో
భాసుర రూపకాంతి, ప్రతిభాన్విత మాధవ చెన్నకేశవా!

చం.గజమును యావిభీషణుని కాకము నాగుహునిన్ కుచేలునిన్
నిజముగ కుబ్జ నావిదురు నేర్పున ఉత్తరు నా యహల్యనున్
గజిబిజిలేక బ్రోచినటు గ్రక్కున నన్ దయగావుమయ్య యో
సుజన మునీంద్ర యోగిజనసన్నుత దైవపురీశ కేశవా!

ఉ. వేదములందు ముఖ్యుడగు వేలుపునీవెయటంచు మౌనులున్
శోధనజేసి కొల్చెదరు సూక్షమతరంబగు నీదురూపమున్
క్రోధము వీడి మ్రొక్కగను కోయని పల్కదు భక్తరక్ష, యో
శ్రీదసమస్త లోకపరిసేవిత శ్రీహరి చెన్నకేశవా!

చక్కని సరళమైన భాషలో అందరికి సులభంగా అర్థమయ్యే రీతిలో రచింపబడిన ఈశతకం అందరూ తప్పక చదవవలసినది.
మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి. 

No comments:

Post a Comment

Pages