అమర్త్యాక్షరాలు! - అచ్చంగా తెలుగు

అమర్త్యాక్షరాలు!

Share This

 అమర్త్యాక్షరాలు!

-సుజాత.పి.వి.ఎల్
నయనాలు నిగిడి చూసే
దైవాక్షరాలు
సాక్షార సౌభాగ్యమొసగె
ప్రసార ప్రోక్షితాలు
సాటిలేని మేటి వర్ణనా సాదృశ్య
సంకేతాలు
దిక్సూచి పర్యవేక్ష
ప్రభాత కిరణాలు
సజీవ చిత్రణా
సమ్మోహిత కుసుమాలు
భావం రూపుదాల్చితే
అమర్త్యాక్షరాలు
ఆవేశం ఎగసిపడితే
ఆగ్రహ విప్లవాక్షరాలు
సమాజాన్ని మేల్కొల్పితే
అవే చైతన్యాక్షరాలు
మౌనాన్ని మళ్ళించితే
సమ్మోహన సాదృశ్యాక్షరాలు
దశదిశలా ప్రభవించే
హృదయామృత బ్రహ్మాక్షరాలు కవితాక్షరాలు!

***

No comments:

Post a Comment

Pages