ఊర్వశి, పురూరవుల కధ - అచ్చంగా తెలుగు

 ఊర్వశి, పురూరవుల కధ

అంబడిపూడి శ్యామసుందరరావు 





ఊర్వశి పురూరవుల కధ ఎవరైతే ధర్మాన్ని విస్మరించి భౌతికపరమైన బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారో అటువంటివారికి ఒక కను విప్పు లాంటిది. పురూరవ చక్రవర్తి దేవతలు కూడా ఈర్ష్య పడేటంత గొప్ప చక్రవర్తి కానీ దేవ లోకపు అప్సరస అయినా ఊర్వశి మోహములో పడి రాజుగా ప్రజల పట్ల తన భాద్యతలను కుటుంబము పట్ల తన భాద్యతలను విస్మరించాడు చివరకు గుణపాఠము నేర్చు కుంటాడు పురూరవుడు త్రేతాయుగములో జన్మించాడు. ఈయన చంద్రుని కొడుకైన బుధునికి ఇల  దంపతులకు జన్మించినవాడు ఆ విధముగా చంద్రవంశము రాజులలో మొదటివాడు పురు అనే పర్వతము పై జన్మించాడు కాబట్టి పురూరవుడు అనే పేరు వచ్చింది.   ఊర్వశి పురూరవుల కద ఋగ్వేదము లోను, హరివంశ పురాణములోను, విష్ణు పురాణములోను వాయు పురాణము లోను  మహాభారతములోను మరియు దేవి భాగవతము లోను వస్తుంది. వీరి కధకు సుమారు ఎనిమిది రకాల వ్యాఖ్యానాలు లేదా  వివరణలు ఉన్నాయి.


ప్రతిష్టాన పురము ను పాలించే పురూరవుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి భూమండలానికి అధిపతి అయ్యాడు. ఆ తరువాత పురూరవుడు కొన్ని వందల అశ్వమేధ యాగాలు చేశాడు పురూరవునితో  దేవతలు స్నేహితులుగాను రాక్షసులు అనుచరులుగాను మెలిగేవారు మహాభారతము ప్రకారము పురూరవుడు గాంధర్వ లోకమునుండి మూడు రకాల అగ్నిని యజ్ఞ యాగాదుల కోసము తెస్తాడు ఆ సందర్భములోనే అక్కడ ఊర్వశిని కలిసి ప్రేమలో పడతాడు.ఆ సందర్భము గానే పురూరవుడు తన బల గర్వముతో బ్రాహ్మణులతో తలపడతాడు. అప్పుడు సనత్ కుమారుడు బ్రహ్మలోకమునుండి వచ్చి పురూరవుని బుద్దులు చెప్పాలని ప్రయత్నిస్తాడు కానీ పురూరవుడు సనత్ కుమారుని మాటలను పెడచెవిన పెడతాడు ఫలితముగా సనత్ కుమారుడు ఇతర మునులు పురూరవుని శపిస్తారు ఊర్వశి కూడా మునుల శాపము కారణముగా అయన ప్రేమలో పడింది. పురూరవుడు ఊర్వశిని తనను పెళ్ళాడమని కోరాడు కానీ ఆవిడ రెండు షరతులను విధించి ఆ పెళ్ళికి ఒప్పుకున్నది   ఆ ఫరతులు  ఏమిటి అంటే రాజు ఆవిడ పెంపుడు గొర్రెల మందను రక్షించాలి. మరొక షరతు ఏమిటింటే  భార్య భర్తలు ఇరువురు ఒకరి నొకరు సంభోగ  సమయము లో కూడా నగ్నముగా చూసుకో రాదు .పురూరవుడు ఈ షరతులకు అంగీకరించాడు షరతులకు అంగీకరించిన రాజు ఊర్వశిని వివాహమాడి ఆవిడ  అందానికి దాసుడై తన రాజ్య భాద్యతలను విస్మరిస్తాడు. ఆవిడతో సుఖిస్తూ చాలా ఏళ్ళు గడిపేస్తాడు. ఆవిడ  లేకుండా ఒక్క క్షణమైనా ఉండలేను అన్న భావనలో మునిగిపోతాడు.


ఇలా కొంతకాలము గడిచాక ఇంద్రుడు ఊర్వశి దేవసభలో కనిపించకపోవటంతో కారణము ఏమిటి అని దేవతలను ప్రశ్నిస్తాడు కారణము తెలుసుకున్న ఇంద్రుడు ,విశ్వవసు మరియు ఇతర దేవతలకు పురురవుని భవంతినుండి ఊర్వశి గొర్రెలను దొంగిలించుకు రమ్మని ఆదేశిస్తాడు. ఆవిధముగా చేస్తే ఊర్వశి పెట్టిన షరతులను పురూరవుడు ఉల్లఘించాడు కాబట్టి ఊర్వశి మరల దేవలోకానికి అంటే ఇంద్రుని నందనవనానికి తిరిగి వచ్చ్జేస్తుంది. ఇంద్రుని ఆదేశానుసారం దేవతలు పురూరవుని భవనము నుండి రాత్రి పురూరవుడు ఊర్వశితో నిద్రిస్తున్నప్పుడు రెండు గొర్రె పిల్లలను దొంగిలిస్తారు. ఈవిషయము తెలుసుకున్న ఊర్వశి తన గొర్రె పిల్లలను కాపాడలేకపోయినందుకు పురూరవుని దూషిస్తుంది అప్పుడు పురూరవుడు తొందరలో దేవతలను వెంటాడటానికి అప్రయత్నముగా దిగంబరంగా పరిగెత్తుతాడు. అప్పుడు ఊర్వశి పురూరవుని నగ్న శరీరాన్ని చూస్తుంది ఆవిధముగా రెండు షరతులకు భంగము వాటిల్లింది కాబట్టి ఊర్వశి పురురవుని విడిచి దేవలోకానికి వెళ్ళిపోతుంది.  


పురూరవునికి కుమారుల విషయములో ఆరుగురని, ఏడుగురని, ఎనిమిదిమంది అని రకరకాలుగా చెపుతారు . వారి పేర్లు ఆయు,ఆమవాసు, విశ్వయు ,శ్రుతాయి , శతాయు ధ్రిదాయు . ఆయు కుమారుడైన నవుషుని  పేరు ఋగ్వేదంలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ విధముగా పురూరవుడు, ఊర్వశిల గాధ ఋగ్వేదములోను, మహాభారతములోను, హరివంశములోను, విష్ణు పురాణములోను, మత్స్య పురాణము లోను, భాగవత పురాణములోను వస్తుంది. 


పురూరవుని ఊర్వశుల ప్రేమ కథ కాళిదాసుచే రచించబడిన సంస్కృత కావ్యము,"విక్రమోర్వశీయము "లో వస్తుంది.ఈ కావ్యములో మూలానికి కొద్దిగా భిన్నముగా నాటకీయముగా పురూరవుని మరో భార్య ప్రస్తావన కూడా ఉంటుంది. తెలుగులో ప్రముఖ రచయిత  గుడిపాటి వెంకట చలము కూడా పురూరవ అనే నాటకాన్ని ఆధునీకరిస్తూ  రచిస్తాడు ఇది కొంత విమర్శలకు కూడా గురైంది ఈ పుస్తకము విదేశాలలో కూడ  విడుదల అయింది.   

***

No comments:

Post a Comment

Pages