శివం - 88 - అచ్చంగా తెలుగు

 శివం - 88

రాజ కార్తీక్ 

 



(హర సిద్ద ను శిల్ప శాల కి సైనికులు తీసుకు రాగా, తన చివరి కోరిక గా ,తన నాయనమ్మ చివరి  కోరిక నా విగ్రహం  చెక్క వలసిందిగా నిర్ణయించుకున్నాడు. తన శిల్ప శాల నుండి  తను నగిషీలు చెక్కిన నా విగ్రహాన్ని అక్కడికి చేర్చారు... అక్కడి సైనికులు హర సిద్ధికి.. తన హద్దులు లు చెప్పి వెళ్లారు.. కొద్దిపాటి కొండ రాయిని తీసుకుని.. నా రూపంలో  సిద్ధం చేసుకున్న రాయి ఎదురుగా  చూస్తున్నాడు)

 

ఎదురుగా ఉన్న శిలా ప్రతిమ ను చేత్తో పట్టుకుని ఉన్నాడు..

వెనుక నుండి పిలుపు వినపడింది హర సిద్దా అని..

 

వెనక్కి తిరిగి చూసిన హర సిద్దు కి నేను కుంభన్న రూపంలో కనబడ్డాను..

 

హర సిద్ధుడు .. ఖిన్నుడు అయ్యాడు..

 

హర సిద్దా అంటూ నేను ఆప్యాయంగా పిలిచి తన దగ్గరికి వెళ్లాను..

 

ఆత్మాభిమానం కలిగిన హర సిద్ధుడు నా మిద ఎంతో కోపంగా వున్నాడు..

 

హర సిద్దా నాతో మాట్లాడవా నాతో పరాచకాలు ఆడవా.. నాతో సరదాగా ఉండవా మర్చిపోయావా..హర సిద్దు చిన్న పిల్లల తండ్రి మీద చూపించే కోపంతో..

"ఒకరిని మోసం చేద్దాం అనుకునే వారే మారు   మార్గంలో మారు రూపం లో వస్తారు నిజమైన వారు తమ నిజ రూపంలోనే వస్తారు.."

 

నేను "ఇలా కుంభ న్న గా ఉంటే నీకు ఇష్టం లేదా హర సిద్దా" 

అంటూ .."ఏమోలే ఇలా వస్తే నన్ను స్నేహితుడిగా భావించి అక్కున చేర్చుకుంటారు ఏమో అని.. తమరి కోసం వచ్చాను మహా శిల్పి" 

 

హర సిద్దు " పిలిచినా పలకని దైవం, చేతనైన సహాయం చేయనీ స్నేహితుడు, ఉండి కూడా కడుపు నిండా అన్నం పెట్టని తల్లి, పంతం కోసం తీర్పులు ఇచ్చే రాజు, ఉండి కూడా లేనట్లే "

 

"అందరికీ అక్షయ పాత్ర నుంచి కావాల్సినంత వస్తుంది.. కానీ నాకు అక్షయ పాత్ర కూడా మొండి చేయి చూపిస్తుంది" 

 

చిరునవ్వుతో హర సిద్ధుని చూస్తూ ఉన్నాను

 

"నువ్వొస్తావని ఎన్నోసార్లు పిలిచాను ఎన్నోసార్లు నా నిజాయితీ నిరూపించబడ వలసిందిగా ప్రార్థించాను నా తప్పు క్షమించమని ఎన్నోసార్లు వేడుకున్నాను తిరిగి ఆ తప్పులు చేయకుండా ఉన్నాను.కానీ నీవు అంటూ..." గడగడా కన్నీళ్లు పెట్టుకున్నాడు..

 

  నేను" వద్దు హర నీవంటి వాడు కన్నీళ్లు పెట్టకూడదు"

 

"ఇదే నా స్వామి నువ్వు చెప్పిన మంచి జీవితం ఇదే నా స్వామి నువ్వు చెప్పిన గొప్ప అవకాశం ఇదే నా స్వామి పౌర్ణమి తర్వాత నా జీవితం ఇదే నా స్వామి నా దురదృష్టం.. నీవు మాత్రం ఏమి చేస్తావు లే మా నాయనమ్మ చెబుతూనే ఉంది.. మనము భయపడవలసిన భగవంతుడికి కాదు మనం చేసుకున్న కర్మలకి అని.. ఏ జన్మలో ఏ కర్మలు చేసుకున్నాను.. ఏ ఆనందము సౌఖ్యము లేకుండా ఇటువంటి ఒక అవమానకరమైన జీవితాన్ని భరించాను . నేను నిజంగా ఏ తప్పు చేయలేదు స్వామి".

 

నేను " నాకు తెలుసు నాకు తెలియనిది ఏమీ లేదు హర సిద్దా"

 

భక్తులారా నాకు అన్నీ తెలుసు అంతా తెలుసు అందుకని నన్ను నమ్మి నా మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి..

 

"కొత్తగా నిన్ను స్వామి అంటున్నావ్ కుంభన్న అని పిలవాలి" 

"వద్దు స్వామి ఈ కుంభన్న రూపం.. నన్ను అందరూ మోసం చేసినట్టే కుంభన్న కూడా సమయానికి ఆదుకో లేదని.. కోపం వచ్చి .. నువ్వు అయినా నా కర్మ అలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావూ స్వామి"

 

"అంటే  ఏమంటావ్ నీకు ఇష్టమైతే గాని కుంభన్న అని పిలవవా"

హర సిద్దు మౌనం గా ఉన్నాడు ..

నేను ఇచ్చిన వాగ్దానాలు నేను చేసిన మాటలు పాటలు అన్నీ నెరవేర్చని అడగట్లేదు హర సిద్దు..

 

కంటి వెంట హర సిద్దు నీరు ఉబికి వస్తున్నాయి..

 

నేను వెళ్లి హర సిద్దు కన్నీరు తుడిచాను..

 

కానీ హర సిద్దు చిన్న పిల్లవాడు మాదిరి నా చేతికి దొరకకుండా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు.."పాపం అతను పడ్డ బాధ అటువంటిది.."

 

నేను " ఏడవకు హర సిద్దు.. ఎప్పటి నుంచో అనుకుంటున్నావ కదా మనసులో మీ నాయనమ్మ తాతయ్య తో మాట్లాడతానని.. వారు కనపడలేదని వారితో మాట్లాడతావా" 

 

"ఊ ఊ " అంటూ తల ఊపాడు..

 

వారి ఆత్మ లను అప్పటికి అప్పుడు .. ప్రత్యక్షం చేశాను..

 

ఎదురు గా  హర సిద్దు నాయనమ్మ తాతయ్య ఆత్మలు ఉన్నాయి..

 

వారు నాకు నమస్కారం చేస్తున్నారు ..

 

హర సిద్దు వారి వైపు పరిగెత్తు తు వెళ్లి " అమ్మ ఎలా ఉన్నావ్.. ఒక రెండు రోజులు నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను.. ఇక నీ దగ్గరే ఉంటాను .. నీకోసం చాలా సంవత్సరాలుగా దిగులు ప డు తున్నాను.. నువ్వున్నప్పుడు మూడుపూటలా ఇష్టంగా కడుపునిండా తినేవాడిని.. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తింటున్న.. వీరందరూ కలిసి చేయగలిగే లపై మోపి నాకు ఉరిశిక్ష విధించారు అమ్మ...అంటూ తన తాత బామ్మ కి చిన్న పిల్లాడి లాగా చొక్కా కనులకు తుడుచు కుంటు .. పితురి చెప్పాడు

 

బామ్మ " హర సిద్ధ భయపడకు నాయనా! నీకు సాక్షాత్తు మహా దేవుడే అండగా ఉన్నాడు, వేరే లోకంలో ఉన్న నేను నిన్ను మళ్ళీ చూడటం సంతోషంగా భావిస్తున్నాను,. నా పరిమితులతో అదొక్కటే నేను చెప్పగలను నువ్వు నిండు నూరేళ్లు ధర్మాన్ని కాపాడుతూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అయ్యా.."

 

హర సిద్దు "లేదమ్మా ఈయన నా స్నేహితుడు గా వచ్చాడు కానీ సమయానికి నన్ను ఆదుకోలేదు అందరిలాగే  చేశాడు" 

 

తాత "ఏది ఎందుకు చేస్తావో నీకు మాత్రమే తెలుసు అయ్యా శివయ్య" 

 

హర సిద్దు "అమ్మ నువ్వు చిన్నప్పుడు చెప్పే దానివి కదా శివయ్య రూపాన్ని విగ్రహంగా చేక్కాలి నా కోరిక అని , ఇప్పుడు నీ చివరి కోరిక మేరకు ఆ విగ్రహాన్ని చెక్కి నీ చెంత కి వస్తానమ్మా.. డబ్బుకి అధికారానికి విలువిచ్చే లోకంలో.. లౌక్యం తెలియక నిజాయితీతో అందరి చేతిలో ఓడిపోయిన అమ్మ"

 

అంటూ తనకు తగిలిన దెబ్బలు చిన్న పిల్లాడు తన తల్లికి ఎలా చూపించాడు అలా చూపిస్తున్నాడు..

 

హర సిద్దు తన నాయనమ్మ ముందు పూర్తిగా చిన్న పిల్లవాడిగా మారిపోయాడు

 

తాత బామ్మ " స్వామి బిడ్డ కి దెబ్బలు బాధ నుంచి ఉపశమనం కలిగించే ఆలోచన చేయండి "అని వేడుకున్నారు..

 

నేను "హర సిద్దు  అల చిన్న పిల్లాడి లాగా చేస్తావా ..ఎంతటి పరాక్రమవంతుడు నీవు రాజనీతిజ్ఞుడు వి నీవు ధర్మో రక్షిత ప్రబుద్ది గలవాడివి నీవు న్యాయ అధికార అ పాపపుణ్య విచక్షణ కలిగిన వాడివి నీవు,ఇలా చేస్తావా " అని స్నేహితుడి లాగా గేలి చేశాను..

 

బామ్మ "స్వామి  హర సిద్దు కి ఆకలేస్తుంది, కడుపునిండా అన్నం పెట్టే ఏర్పాటు చేయండి" 

 

హర సిద్దు ముందు తన నాయనమ్మ తనకి చిన్నప్పుడు ఎలా రుచిగా చేసిపెట్టే దో ఆ రకంగా తన కిష్టమైన మనీ వి అన్ని ప్రత్యక్షమైన వి..

 

"కూర్చో హర సిద్దు నీ శిల్ప శాల లో ఎన్నోసార్లు నాకు భోజనం పెట్టావు కదా ఈరోజు నేను నీకు వడ్డిస్తాను నువ్వు తిందు గాని" అంటూ చేతితో లాగాను..

 

నా స్పర్శచేత హర సిద్దు డు పూర్తిగా.. మెరుగు అయ్యాడు.. కళావిహీనం అయిన తన మొహం నుండి.. దెబ్బల మయమైన తన దేహం నుండి.. మళ్లీ తన పదునైన శరీరాన్ని ఆకర్షణ కలిగిన రూపాన్ని తిరిగి పొందాడు

 

పాపం హర సిద్దు.. ఇందాక తన కన్నతల్లి ఇచ్చిన.. జావ తప్ప ఇంత వరకు ఏమీ తినలేదు.

 

తన నాయనమ్మ తిన మని చెప్పటంతో..

 

హర సిద్దు కి భోజనం నేను వడ్డించాను..

 

బామ్మ తాత ఇద్దరు .."ఎన్ని జన్మల అదృష్టం.. మీ నీకు సాక్షాత్తు మహా దేవుడే భోజనం వడ్డిస్తున్న రా హర సిద్దా.. ఏ నిమిషంలో నీకు హర సిద్దు అని పేరు పెట్టాము సాక్షాత్తు ఆ హర డు ను సిద్ధించు కొన్నావ్ రా సార్థక నామధేయుడువి " అంటూ తాత బామ్మ ఆనంద బాష్పాలు తుడుచు కున్నారు..

 

నేను " తిను హర సిద్దు.. ఇక నీకు శివరాత్రి అయిపోయేదాకా ఆకలి దప్పిక ఉండదు లే.."

 

హర సిద్దు కడుపు నిండా భోజనం చేశాడు ..

 

తాత బామ్మ " స్వామి వారి బాధ్యత ఇక నీదే అంటూ చేతులు జోడించి నన్ను ప్రార్థిస్తున్నారు.. అమ్మ మీ దగ్గరికి నేను రెండు రోజుల్లో వచ్చేస్తాను"అంటున్నాడు హర సిద్దు డు 

 

తాత బామ్మ " అల అనవాకు రా " అంటూ వారిద్దరు మాయమైపోయారు.

 

నేను "ఏమిటయ్యా నువ్వు మరి.. భావోద్వేగాలు కలిగినవాడు లా ఉన్నావు.. చనిపోయిన వారిని బతికిన వారిని భగవంతుడు అందరినీ భయ పెడతావు.."అంటూ చలోక్తి విసిరాను

 

కానీ తన కళ్ళ ముందు తన తాతయ్య బామ్మ కనపడి మాయమైపోయే సరికి.. మళ్లీ కన్నీటి పర్యంతమయ్యాడు.. అంతే కాదు తన చిన్ననాటి నుంచి గడిపిన జీవితాన్ని తన తల్లిని తన సోదరుని కుంభ రాజ్యంలో జరిగిన పోరుని... తన స్నేహితుడని తన శిల్పాలను అన్నిటినీ గుర్తుచేసుకొని ఇక వాటిని విడి వెళ్ళిపోతున్నాను అని.. జీవిత మీద ఆపేక్షను వదులుకునే వాడిలాగా కళ్ళు వెంట నీళ్లు తెచ్చుకుంటూనే ఉన్నాడు

 

నేను "హర సిద్దు బాధపడకు! నీ కోరిక ఏమిటో చెప్పు అది నేను నెరవేరుస్తాను ఒక్క నీ ఊరి రద్దు నన్ను చేయమని వరం తప్ప " 

 

హర సిద్దు "అది అడగను స్వామి.. ఇంత బతుకు బతికి ఇంత అవమానం పాలై నేను బతికి ఏం చేస్తాను స్వామి.... నావి రెండు కోరికలు స్వామి..ఒకటి.. శివరాత్రి అయిపోయే లోపు మీ విగ్రహాన్ని చెక్కుత  అని చెప్పాను కదా . దానికి ప్రతీకగా మీరే సాక్షాత్తు నా ఎదురుగా కూర్చుంటే.. మిమ్మల్నే అచ్చుగా ఆ విగ్రహాన్ని దించుతాను.. నా భౌతిక మరణం తర్వాత నేను ఎప్పుడు మీతో ఇలా పరాచికాలు ఆడుతూ స్నేహితుడిగా మీతో పాటే ఉంటాను.. స్వామి నా తల్లిని నా సోదరుని నా శ్రేయోభిలాషిని ఈ భౌతిక జీవితంలో చల్లగా చూడండి స్వామి" 

 

నేను "తధాస్తు" 

 

హర సిద్దు "పోనీలే స్వామి నాలాగా దురదృష్టవంతుడు కాకుండా నాలాగే విడిగా కాకుండా ఇక మీద నా కుటుంబం నా శ్రేయోభిలాషులు అన్న హాయిగా బతుకుతారు అంటూ తాను కోల్పోయిన జీవితాన్ని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు హర సిద్ధుడు

 

నేను "హర సిద్దా ఏమిటి నువ్వు ఈ వైఖరి అవలంభిస్తున్నావూ, ఎంతటి ధైర్యవంతుడు వి నీవు తదుపరి చేయవలసిన ఏదో చెప్పు" 

 

స్వామి "నీకు రూపం లేదని తెలుసు.. కానీ అందరూ అనుకునే రూప దారిగా నీ రూపంలో నాకు కనపడతావా స్వామి." 

 

హర సిద్ధూ కన్నీరు తుడుస్తూ ఉండగానే.. హర సిద్దు తీవ్ర తన్మయత్వానికి లోను అయ్యే విధంగా..

"నా జటల తో  నా శరీరము నా త్రిశూలాన్ని మీరు అందరూ భావించినా రూపంలోకి మారను"..

 

అటువంటి దర్శనం సృష్టి ఏర్పడిన దగ్గరనుంచి కొద్దిమంది కి మాత్రమే జరిగింది.

 

హర సిద్దు అంతా మరిచిపోయి నన్నే తదేకంగా ధ్యానిస్తూ నన్నే చూస్తూ .. నా రూపాన్ని చూస్తూ తీవ్రమైన భావోద్వేగానికి గురి అయ్యాడు..

 

" స్వామి ఎన్నో కోట్ల జన్మల ఫలితంగా ఈ దర్శనం లభించింది.. ఈ జన్మ కర్మ నాకు అనవసరం పూర్వ జన్మ కర్మ నాకు అనవసరం నా కోసం నువ్వు వచ్చావ్ అంటూ రెప్పవేయకుండా తన కళ్లెదురుగా నన్ను చూస్తున్నాడు" 

 

హర సిద్దు మనసు .. ప్రణవ నాదం చేసింది ..స్వయానా హర సిద్దు కళాకారుడు కావున, నా దర్శనం అందాన్ని మరింత ఎక్కువగా అనుభవించాడు

 

ఇప్పుడు హర సిద్దు ముందు నేను  త్రిశూలం తో డమరుకం తో జట ల తో గంగ తో .. మహా శివుడి గా దర్శనం ఇచ్చాను..

 

హర సిద్దు " ఆహా ఏమి నా అదృష్టం.. భౌతికంగా చనిపోయేవరకు ఇలానే కళ్ళముందే విగ్రహం చెక్తూతు ఉంటాను భౌతికంగా చనిపోయిన తర్వాత నీతో పాటే సహవాసం చేస్తూ ఉంటాను " 

 

నేను " ఇక మొదలెట్టూ హర సిద్దా ఎక్కడ కూర్చో ను" 

 

హర సిద్దు "ఎదురుగా కూర్చొ స్వామి .. నీవు ఎలా ఉన్నావు ఈ నగిష ఈ రాయి ను  అంతే నా చేతులతో నువ్వు ఇచ్చిన విద్య తో నేను చేసిన సాధనతో.. నీవలే చిత్రీకరిస్తాను .. ఈ విగ్రహాన్ని చూసిన వారు ఎవరైనా కూడా శివుని చూడలేకపోయానని బాధపడకూడదు" 

 

నేను " మొదలు పెట్టు " ఆన్న హర సిద్ధూ కోరుకున్న చోట కూర్చొని..

 

జరగబోయే ఆట అడిచ్చేది నేను...

(ఇంకా ఉంది)

 


No comments:

Post a Comment

Pages