భారతీయ వాయుసేన(IAF) - అచ్చంగా తెలుగు

భారతీయ వాయుసేన(IAF)

అంబడిపూడి శ్యామసుందర రావు




భారతీయ వైమానిక దళం భారతదేశానికి చెందిన త్రివిధ దళాలలో అత్యంత ముఖ్యమైన సేనా విభాగము. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవం నిర్వహించబడుతుంది. మన దేశము గర్వించి దగ్గ వాయుసేన (ఇండియన్ ఎయిర్ఫోర్స్) మనకు ఉంది. ఇంతకూ మునుపు యుద్దాలు వచ్చినప్పుడు IAF సమర్ధవంతముగా పనిచేసి, దేశానికీ గర్వకారణముగా నిలిచింది.

యుద్దాలు లేనప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు, ప్రజలను ఆదుకొవటంలో కూడా IAF ఎప్పుడు ముందు ఉంటుంది. అటువంటి IAF గురించిన ఆసక్తి కరమైన విషయాలను కొన్నింటిని తెలుసుకుందాము.

అక్టోబర్ 8,1932లో అధికారికంగా బ్రిటిష్ ఎంపైర్ కు అనుభందముగా ఎయిర్ఫోర్స్ స్థాపించబడింది. వీరు రెండవ ప్రపంచ యుద్దములో బ్రిటిష్ వారి తరఫున యుద్దములో పాల్గొన్నారు.అప్పట్లో.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను(IAF)1945 నుండి1950 వరకు రాయల్ ఎయిర్ ఫోర్స్ గా పిలిచేవారు. ఇంగ్లండ్ రాజైన కింగ్ జార్జ్ VI 1945 లో రాయల్ అనే పేరు1945 లో ఎయిర్ ఫోర్స్ ముందు తగిలించాడు. స్వాతంత్రము వచ్చినాక 1950 లో రాయల్ పేరును తొలగించి ఇండియన్ పేరును ఉంచారు.

భారతీయ వాయుసేన ప్రపంచములో వాయు సేనలలో నాల్గవ పెద్దది మొదటి మూడు స్థానాలలో అమెరికా, చైనా, రష్యా లు ఉన్నాయి మన వైమానిక దళములో మొత్తము 1,70,000 మంది సిబ్బంది ,1,500 విమానాలు ఉన్నాయి. మన వైమానిక దళము జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల వైమానిక దళాలకన్నా బలమైనది. ప్రపంచములోనే బలమైన వైమానిక దళాలలో భారతీయ వైమానిక దళము ఏడవది. ప్రస్తుతము మన వైమానికదళానికి ఉన్న నీలము రంగు జెండా ని 1951 లో ఆవిష్కరించారు. జెండా పై భాగములో ఎడమవైపు జాతీయ జెండా, కుడివైపు జాతీయ జెండా మూడు రంగులు ప్రతిబింబించే వలయము ఉంటుంది. IAF విమానాలపైనా ఉండే లోగో 1933 నుండి ఇప్పటిదాకా 4 సార్లు మార్చబడింది.

IAF మోటో భగవత్ గీత లోని పదకొండవ అధ్యాయమునుండి గ్రహించబడిన "నభ స్పర్సమ్ దీప్తమ్" లో,  ‘శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కష్టకాలంలో మార్గదర్శకుడుగావుంటు నడిపించినట్లు IAF కూడా భారతదేశాన్ని రక్షించటానికి గగనతలం నుండి కృషి చేస్తూ, అన్ని విపత్కర పరిస్థితులనుండి కాపాడటానికి కృషిచేస్తూ ఉంటుంది’ అని ఈ మోటో అర్ధము.

IAF కు ఎయిర్ మార్షల్ గా పనిచేసిన మొదటి స్త్రీ పద్మావతి బందోపాద్యయ అంతే  కాకుండా ఏవియేషన్ మెడిసిన్ లోమొదటి స్పెషలిస్ట్ అయినా స్త్రీ కూడా ఈవిడే. IAF కు నాయకత్వము వహించేది 4 నక్షత్రాల  అధికారి  IAF లో 5 స్టార్ రాంక్ సాధించిన మొదటి వ్యక్తి అర్జున్ సింగ్.  ఫీల్డ్ మార్షల్ సామ్ మానిక్ షా మరణము తరువాత 5 స్టార్రాంక్ సాధించిన వ్యక్తి ఈయన ఒక్కడే! అయన రాంక్ ఫీల్డ్ మార్షల్ రాంక్ తో సమానము.

IAF లోని గరుడ కమాండోస్ కు ఇచ్చే ట్రైనింగ్ చాలా సుదీర్ఘమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ గరుడ కమాండోస్ చాలా సుదీర్ఘమైన ట్రైనింగ్ కోర్సు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అదనముగా చేర్చబడ్డ వాటిలో మైరేజ్ 2000 యుద్ధ విమానాలు చాలా ముఖ్యమైనవి. ఈ విమానము సింగిల్ సీట్, ఎయిర్ డిఫెన్స్ మల్టి పర్పస్ ఫైటర్ జెట్ దీని ఇంజన్ గంటకు 2,495 కిమీ గరిష్ట వేగముతో ప్రయాణించ గలదు.

ఇది అదనముగా రెండు 30mm ఇంటెగ్రల్ కానన్లు (ఫిరంగులు) రెండు మాత్ర సూపర్ 530D మీడియం రేంజ్ మరియు రెండు R 550మ్యాజిక్ II క్లోజ్ కాంబాట్ మిస్సైల్స్ ఉంటాయి.

1993 అక్టోబర్ ఒకటి నుండి డిశంబర్ 21, 1994 వరకు IAF సోమాలియాలో ఐక్యరాజ్య సమితి తరుఫున పాల్గొన్న పీస్ కీపింగ్ ఫోర్స్ లోని భారతీయ దళాలకు మద్దతుగా పాల్గొన్నది. IAF కు విదేశాల్లో కూడా ఒక బేస్ ఉన్నదితజకిస్థాన్ లోని ఫార్ఖూర్ ఎయిర్ బేస్ ఒక్కటే దేశము వెలుపల ఉన్నఇండియన్ ఎయిర్ బేస్  సియాచిన్ గ్లేసియర్ లో గల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 22,000 అడుగుల ఎత్తులో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్.

మన IAF లోని 5వ స్క్వాడ్రన్ ను 1969 లో ఐక్య రాజ్య సమితి కాంగో లో జరిపే ఆపరేషన్స్ కు మద్దతుగా పంపారు కాంగోలో 75 ఏళ్ల బెల్జియం పాలన అర్ధాంతరంగా ముగిసినప్పుడు అంతర్యుద్ధం ప్రారంభమయితే ఐక్య రాజ్య సమితి తరుఫున భారతీయ వాయిసేన ఈ ఆపరేషన్స్ లో పాల్గొన్నది.

1950 నుండి IAF నాలుగు యుద్ధాలలో పాల్గొన్నది ఈ యుద్దాలు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా తో జరిగినవి IAF జరిపిన పెద్ద ఆపరేషన్స్ లో ముఖ్యమైనవి, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ పూమలై మొదలైనవి.

ఇవి కాకుండా ఐక్య రాజ్య సమితి తరుఫున పీస్ కీపింగ్ మిషన్ లో కూడా పాల్గొన్నది. 1965 లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్దములో IAF పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ను అన్నివిధాలుగా అధిగమించింది. అమెరికాలో తయారు అయిన నాట్ విమానాలతో సమర్ధవంతమైన ఆఫీసర్లు పాకిస్తానీ సాబర్ జెట్ విమానాలను కూల్చివేశారు.

యుద్దభూమి సాబర్ జెట్ విమానాల శ్మశానముగా మారింది 1971లో జరిగిన ఇండో పాక్ యుద్దములో లొంగేవాలా ప్రాంతములో IAF 29 పాకిస్తానీ యుద్ధ ట్యాంకులను,40 APC లను,ఒక రైల్వే ట్రైన్ ను ధ్వంసము చేసింది. ఇవే కాకుండా పాకిస్తాన్ కు చెందిన అనేక కీలక స్థావరాలను కూడా ధ్వంసము చేసింది. పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీకి లొంగిపోయే సమయానికి IAF 94 యుద్ధ విమానాలను కూల్చివేసింది వాటిలో F -86 రకానికి చెందిన అమెరికన్ సాబర్ జెట్ విమానాలు 54 ఉన్నాయి .C-130J  యుద్ధ విమానాన్ని లఢఖ్ ప్రాంతములో గల ఎత్తయిన (16,614అడుగులు) దౌలత్ బేగ్ ఓల్డి ఎయిర్ స్ట్రిప్  పై ల్యాండింగ్ చేసి ప్రపంచములోనే రికార్డ్ సృష్టించింది. ఈ మధ్య కాలములో అంటే ఆగస్టు 20, 2013 లో చైనాకు మన ఎయిర్ ఫోర్స్ శక్తి చూపించటానికి IAF తన C - 130Jసూపర్ హెర్క్యులెస్ రవాణా విమానాన్ని మళ్లి  అదే చోటులో దింపింది.  27 ఫిబ్రవరి 2019 లో పాకిస్తాన్ పుల్వామా దాడికి ప్రతిగా IAF సర్జికల్ స్ట్రైక్ పేరుతొ పాకిస్తాన్ లోని బాల కోట్ ప్రాంతములోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసము చేసింది.

ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సేఖాన్ ఒక్కడే IAF ఆఫీర్లలో పరమ వీర్ చక్ర అందుకున్నవారు. ఈయనకు మరణానంతరము ఈ సత్కారము జరిగింది. శ్రీనగర్ ఎయిర్ బేస్ లో పాకిస్తాన్ వైమానిక దాడులను 1971లో సమర్ధవంతముగా ఎదుర్కొని అమరుడైనందుకు  ఈయనకి ఈ సత్కారము దక్కింది. IAF యువత IAF లో చేరటానికి ప్రోత్సహముగా "గార్డియన్స్ ఆఫ్ స్కై "అనే 3D మొబైల్ గేమ్ ను లాంచ్ చేశారు. IAF తన పాత కంమ్యూనికేషన్ వ్యవస్థను తొలగించి పూర్తిగా సురక్షితము, నమ్మకమైన నెట్ వర్క్ మరియు జిగా బైట్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్ ను ప్రారంభించింది. ఈ వ్యవస్థ ఆధునిక ట్రోపో స్కాటెర్ టెక్నలాజి ని వాడుకుంటుంది. 2010 లో ప్రారంభింపబడిన దీనినే AF నెట్ అంటారు. ఈ విధమైన అద్భుతమైన సమాచార వ్యవస్థ త్వరలోనే ఆర్మీ నెవిల లో కూడ  వస్తుంది. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఏ విధమైన వైమానిక బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా గౌరవ గ్రూప్ క్యాప్టెన్ రాంక్ IAF లో పొందిన మొదటి పౌరుడు.

పౌరులను రక్షించే కార్యక్రమంలో ఆపరేషన్ రాహత్ రెస్క్యూ ఆపరేషన్స్ లో హెలీకాఫ్టర్లను ఉపయోగించి ఈ ఆపరేషన్ పూర్తిచేయటం  ప్రపంచములోనే మొదటిది, పెద్దది ఇదే.

2000 మంది సభ్యులతో IAF గరుడ కమాండో ఫోర్స్ ను కలిగి ఉన్నది. వీరు అంఫిబియస్ అంటే నీటిపైనా ఆకాశములో యుద్ధము చేయగలరు.

వీరు అమెరికన్ నేవి సీల్స్ తో కలిసి పనిచేస్తారు. వీరు కీలకమైన ఎయిర్ ఫోర్స్ స్థావరాలను కాపాడుతుంటారు మరియు సోదాలు నిర్వహించటం రెస్క్యూ ఆపరేషన్స్ ను నిర్వహించటం చేస్తుంటారు.వీరి మోటో "గట్స్,గన్ మరియు గ్లోరీ" నేడు ఈ ప్రత్యేక  దళము కీరి ప్రతిష్టలతో అంబరాన్ని తాకుతున్నది. ప్రపంచములో IAF ఒక్కటే  C -17 గ్లొబ్ మాస్టర్ III ,C -130J సూపర్ హెర్క్యులస్ మరియు ఎల్యుషినిల్ -76 అనే మూడు పెద్ద రవాణా ఎయిర్క్రాఫ్ట్ లను ఆపరేట్ చేస్తుంది.

హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వారు డెవలప్ చేసిన తేజస్ అనే విమానాలు రెండవ సూపర్ సానిక్ ఫైటర్ విమానాలు మొదటివి HF -24 మారుతి.

తేజాస్ యుద్ధ విమానాలు MIG -21 సిరీస్ ను రీప్లేస్ చేస్తాయి.IAF 2024 నాటికి కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ సంఖ్యను తగ్గించి కొత్త కాంబాట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ 42 స్క్వాడ్రన్  లతో ఏర్పాటు చేసుకోవాలని పధకాలు వేస్తున్నారు.  మొదటిసారిగా IAF యొక్క ఫైయిటర్ ఫ్లీట్ లో పూర్తిగా రెండు ఇంజన్లు కలిగిన ఫైటర్ విమానాలు రాఫెల్ సుఖోయ్ హాల్  ప్రాస్పెక్టివ్ మల్టి రోల్ ఫైటర్ (PMF),SU -30MKI (అప్ గ్రేడెడ్), MIG -29 మరియు జాగ్వార్ స్ట్రైక్ ఫైటర్ వంటి ఆధునిక విమానాలతో బలోపేతము చేయబడింది. మన దేశము యొక్క రక్షణ దళాలు (ఆర్మీ,నేవి ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్స్) మనలను గర్వించదగ్గ రీతిలో అనేక సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాయి ఈ సేవ ఈ విధముగా కొనసాగింపబడుతుంది. మనము భారతీయులం ఎల్లప్పుడూ వీటిలో పనిచేస్తున్న దైర్యవంతులను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము.ఈ విధముగా IAF తన శక్తి సామర్ధ్యాలతో ఇండియన్ మిలిటరీ ఆపరేషన్స్ లోను, నావికా దళము ఆపరేషన్స్ లోను వారికి తోడ్పాటుగా ఉండి భారత దేశ రక్షణలో ఎల్లప్పుడు పాలుపంచుకుంటుంది.

***

No comments:

Post a Comment

Pages