క్షీరసాగరంలో కొత్త కెరటాలు - పుస్తకంపై అభిప్రాయాలు - అచ్చంగా తెలుగు

క్షీరసాగరంలో కొత్త కెరటాలు - పుస్తకంపై అభిప్రాయాలు

Share This

 క్షీరసాగరంలో కొత్త కెరటాలు - పుస్తకంపై అభిప్రాయాలు



Sharada tanaya

 "క్షీరసాగరంలో కొత్త కెరటాలు" ఒక‌ కొత్త ప్రయోగం. అచ్చంగా తెలుగు వారి కిరీటంలో మరో తురాయి. ఇప్పటికే వెబ్ పత్రిక ద్వారా, పుస్తక ప్రచురణ ద్వారా, పుస్తకాల అమ్మకం ద్వారా తెలుగు సాహితీ లోకంలో తమకంటూ ఒక‌ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బృందం తెలుగు‌ రచయితలకు ఒక విశిష్ఠమైన అవకాశాన్ని ఈ కథా సంకలనం ద్వారా కలిగించింది. మూడు తరాలవారి కథలకు ఈ సంకలనం లో చోటు కల్పించారు.‌ నా లాంటి చిన్న రచయితకు ఇదొక గౌరవమనే చెప్పుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.‌ అచ్చంగా తెలుగు బృందానికి అభినందనలు తెలుపుతూ వారి నుండి ఇంకా ఇలాంటి కొత్త కొత్త పథకాలు రావాలని ఆశస్తున్నాను. నమస్కారం. 🙏🙏🙏

*****
Chennuri Sudarshan

“క్షీరసాగరంలో కొత్త కెరటాలు”మూడు తరాలకు చెందిన 120 మంది సాహితీవేత్తల కథా సంకలనం ఒక మహత్తర గ్రంధం. 
రామాయణం, మహాభారతం ప్రతి ఇంటా ఉండవలసిన  గ్రంథాల మాదిరిగానే ‘క్షీరసాగరంలో కొత్తకెరటాలు’ గూడా ప్రతి ఇంటా ఉండతగ్గ గ్రంథమనుటలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదని నా అభిప్రాయము.
‘అచ్చంగా తెలుగు’ ప్రచురణకర్తల మూలాన  ‘ఛాంపియన్స్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డ్స్’ మరియు  ఏసియన్ వరల్డ్ రికార్డ్స్’ సర్టిఫికెట్లు రావడము సంస్థకు మరియు సాహితీవేత్తలకు గర్వకారణము. 
ఇది ‘అచ్చంగా తెలుగు’ అధినేత్రి శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శిని గారి సాహసోపేత కృషికి దక్కిన ప్రతిఫలం. సాహితీ రంగ కీర్తిని ఇనుమడింపజేస్తోంది.
అనతి కాలంలోనే అంతర్జాల పత్రికా రంగంలో అందె వేసిన చేయిగా.. మహోన్నత కీర్తి శిఖరాలకు చేర్చిన సంపాదక బృందానికి అభినందనలతో.. 
-చెన్నూరి సుదర్శన్.    

*****
Madhavi Talikota

జాతరలో పెద్దోళ్ళు సలీసుగా నడుస్తుంటే అడుగులు వెదుక్కుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నడిచేసాక , జాతరఅంతా  చూసేసాక పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఒకే పీచుమిఠాయి చప్పరిస్తే ఎలా ఉంటుంది. మీకు తోడు  మేము అనే పెద్దోళ్ళు, మీతో పాటె మేము అనే పిల్లోళ్ళు . 
అదే "క్షీరసాగరం లో కొత్త కెరటాలు"
అనుకోకుండా ఆన్లైన్ లోనే రచయిత్రుల సమూహం తో విడుదలైన కథల పుస్తకం చూసాక " ఓహ్ ఇలా కూడా ఉంటుందా, అయ్యో తెలీలేదే , పోన్లే , మనకు మనం తెలిసిందే ఇప్పుడు, ఇంకా లోకానికి తెలిసేది ఎప్పుడోలే  " అనుకుంటూ సర్దుకున్నాక,వచ్చిన మరో అవకాశం.
ప్రకటించిన రోజే  చూసినా, మన జ్ఞాపక శక్తి మీద ఉన్న అతి నమ్మకం తో కాల క్రమం లో  మరిచిపోయిన మహద్ అవకాశం. ఆఖరినిమిషం లో దక్కిన సువర్ణావకాశం. సీతాఫణి , అనుకోకుండా ఆ రోజు మనం మాట్లాడుకోవడం , నువ్ చెప్పడం, మరీ చివరినిమిషం లో నేను రాసి పంపడం. ఇది నీవల్లే.
ఈ అద్భుతం లో 120 మంది రచయిత లతో పాటు నాకంటూ ఓ పేజీ ఉండడం, నాకపురూపం.
Padmini Priyadarsini గారు, ధన్యవాదాలు,ఇంత మంచి పుస్తకాన్ని అందించినందుకు.

*****
Gorty Venkata Somanatha Sastry

Zoom లో కార్యక్రమం చూసాను. ఒక కార్యక్రమ నిర్వహణ అదీ సాంకేతిక పరంగా ఏర్పాటు చేసుకుని నిర్వహించటం చాలా కష్టమైన పని. దానిని విజయవంతంగా నిర్వహించినందుకు మీకు నా ధన్యవాదాలండీ. గత రెండు వారాలుగా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అందుకే అంత చురుకుగా ‌ముందుకు  రాలేదు. అచ్చంగా తెలుగు గ్రూపులో చిన్న వ్యాఖ్య వ్రాసిన నాకు ప్రోత్సాహం ఇచ్చి అచ్చంగా తెలుగు మాగజైన్ లో పుష్కరాలపై ఒక వ్యాసం వ్రాయమని అడిగి, కుటుంబ సమస్యలతో మూలపడిన నా సాహిత్య విన్యాస ప్రక్రియను తిరిగి ప్రారంభించేలా చేసిన మీకు నా కృతజ్ఞతలు. అలాగే క్షీరసాగరంలో కొత్త కెరటాలు పుస్తకం కోసం ఒక కధ వ్రాయించారు. తెలుగు సాహిత్యానికి మీరిచ్చే ప్రోత్సాహానికి , పడే కష్టానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, మున్ముందు మరిన్ని విజయవంతమైన పధకాలను చేపట్టి, మీరు ముందుకు సాగాలని కోరుకొంటున్నాను.

*****
Dr.Aruna
  
Madam నాకు యేదో చెయ్యాలి అన్న తపన చాల యెక్కువ 
నాకు ఇంటర్  లో పెళ్లి 
చదువు దూర విద్యా. 
జాబ్ కోసం చాలా కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించ. నాకు కథలు. కవిత  లు  వ్రాయలని తపన చాల యెక్కవ 
మీ పరిచయం గొప్ప అదృష్టంగా భావిస్తా. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
🙏🙏🙏🙏🙏🙏

*****
Dr.K.Padmalatha

పద్మినీ గారు,
 ఇప్పుడే 4 పుస్తకాలు,సర్టిఫికెట్లు రీసీవ్ చేసుకున్నాను.చాలా సంతోషంగా వుంది.అంత మంది పేరు పొందిన రచయితలతో పాటు నా పేరు కూడా ఉండడం గొప్పగా అనిపిస్తుంది.ఈ అవకాశాన్ని కల్పించిన మీకు ధన్యవాదాలు.🙏🙏🙏

*****
Rayaprolu Sastry (రా.శా)

మేడమ్ అచ్చు పుస్తకాలలో " font " అక్షరాల వర్గము అంటారే అది చాలా ముఖ్యం. అది పాఠకుణ్ణి పేజీలు తిప్పేందుకు ప్రోత్సహిస్తుంది. వర్గం చిన్నదయ్యో, స్పష్ఠత లేనిదైతేనో పాఠకుడు చదవడానికి ఉపక్రమించడు, అది ఎంత మంచి రచన ఐనా. 
ఈ విషయంలో మన పుస్తకం లో వాడిన వర్గం చాలా చక్కగా స్పష్ఠంగా కన్పిస్తూ ఉంది. అది సగం విజయం మీకు!
మిగిలిన సగం కథలే చెబుతాయి.
అభినందనలతో ....

*****
Subhadra Vedula

చాలా పెద్ద ప్రయత్నం. విజయవంతంగా పూర్తి చేసారు, అభినందనలు.

****
VVR Kishan

ఏనుగెక్కినంత సంబరంగా ఉంది.
Read many stories of the book madam. The book has come excellent. Your very hard efforts made this possible. The service you are doing to literature is appreciable. Thank you once again for giving this opportunity🙏🙏...

****
Madhavi Talikota

Padmini garu, pustakavishkarana chala baga jarigindandi. Andarni ila kalusukovadam chala happy. Abba, meerenta cool andi babu, prashantanga unnaru. Tq for the meet.

*****
Nagajyoti Ramana Susarla

పద్మినికీ ,ప్రసాద్ బాబాయ్ గారి కి అనేకానేక కృతజ్ఞతలు. చక్కని కార్యక్రమం దిగ్విజయోస్తూ . సాహిత్య క్షీరసాగరంలో ఇప్పుడే పుట్టిన కొత్త కదలికలం. పల్చని అలలుగా తేలిపోకుండా , మనసుల తీరాన్ని తాకే మంచి కథకులం అందరమూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను . నాగజ్యోతిరమణ సుసర్ల.

*****
Jai Dass

మొదటిప్రయత్నం లోనే ప్రపంచరికార్డులను సొంతం చేసుకునేలా ముచ్చటగా మూడుతరాల రచయిత/త్రు లతో "క్షీరసాగరంలో కొత్త కెరటాలు'తెచ్చి తెలుగు సాహిత్య చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన "అచ్చంగా తెలుగు"టీం కు ప్రత్యేకంగా పద్మిని మేడం గారికి హృదయపూర్వక అభినందనలు.అందులో నాకథ 'ప్లే'బ్యాక్' కూడా భాగమైనందుకు గర్విస్తూ..
            -బట్టేపాటి జైదాస్,  రచయిత&కార్టూనిస్ట్.

****
Navya Teja

Excellent session Padmini garu👌👌..enjoyed every minute of it from start to finish..
You rock!!..
Thanks for the mention ..it was a wonderful gesture from you 🙏..felt pleasantly surprised and just blabbered something.. It was a long time i was so happy.. Thank you akka..

****
Ashwini Pemmaraju

ఎంతో మంది నిష్ణాతులైన రచయితల  మధ్యలో మా రాధమ్మ(అశ్విని) వంట కు కూడా  ఇంత చోటు ఇచ్చి ఈ వంట కూడ నలుగురికి తినిపించటానికి అవకాశం ఇచ్చిన మా ఆడపడుచు పద్మిని కి  అలాగే  దీనిని ప్రపంచ స్థాయి కి  తీసుకు వెళ్లి  అచ్చు వేస్తున్న ఎందరో ప్రముఖులు కు  మా యొక్క హృదయ పూర్వక ఆశీర్వచనాలు తో కూడిన అభినందనలు...🙏🙌🙏 - అశ్విని నాన్నగారు.

****
Prashant Verma Uppalapati

 చాలా థ్రిల్లింగ్ గా, సంతోషంగా ఉందండి, మర్చిపోలేని వ్యక్తిగా మీరు, అచ్చంగా తెలుగు పబ్లికేషన్స్ ఎప్పటికి గుర్తుంటాయి, ఇది నా కథ తొలి ముద్రణ, అదీ గొప్ప సాహితీవేత్తలతో🙏🙏🙏

****
Latha Kandikonda

పుస్తకం చాలా చాలా బాగుంది. నేను ఉహించిన దానికంటే కూడా చాలా పెద్ద పుస్తకం . Certificates కూడా చాలా బాగా వచ్చెయ్యి. ఇంత పుస్తకం అంత తక్కువ టైం లో అచ్చు వేసి అందరికీ పంపించే బాధ్యత తీసుకోవడం అంటే అది ఆషా మాషీ వ్యవహారం కాదు. మీ కృషి కి నా శత కోటి వందనాలు.మీకు నా హార్థిక అభినందనలు.

*****
Dasu Sri Havisha

 చాలా సంతోషం గా ఉంది. నా మొదటి కథ ఇంతటి ప్రతిష్టాత్మకమైన పుస్తకంలో ప్రచురించబడడం చాలా ఆనందంగా ఉంది.‌ ఇదీ‌ మీ సహకారం వల్లనే సాధ్యమయ్యింది.

****
Ysr Lakshmi 

అందరినీ సమన్వయపరచి చేసిన మీ బృహత్ ప్రయత్నానికి అభినందనలు.
పుస్తకము బాగా వచ్చింది

****
Kishore Mallipudi

చాలా ధన్యవాదాలు మేడం.... మీ ప్రోత్సాహంతో మొత్తానికి నేను కూడా ఒక రచయిత అని పేరు పడేలా చేశారు. మీ కృషికి , అంకిత భావానికి మరొక్కసారి ధన్యవాదాలు.

****
Yanamandra Srinivas

Very commendable effort. Its not easy managing all these. God blessed u with all energy and attitude. Keep it up. My best wishes always and congratulations.

*****
Manjuvani Sudheer

Received books. Felt very happy. Tq so much akka.

****
Malladi Venkata gopala krishna

I just wanted to say పద్మిని ఏం చేసినా అది చాలా అద్భుతంగా ఉంటుంది.భగవంతుడు తనకి ఆ శక్తినిచ్చాడు.భవిష్యత్తులో పద్మిని ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించాలి.తప్పక సాధిస్తుంది కూడా.‌ 'అచ్చంగా తెలుగు' వేదికలో నాకు ఎన్నో ఆత్మీయ బంధాలు దొరాకాయి. కాబట్టి ఈ వేదిక ఎప్పటికీ కళకళలాడుతూ ఉండాలి. ఇందులో ఉన్నవారంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

****

Sita Susmita

Padmini gaaru..book vachhindi andi..thank u soo much.🙏🙏.modatisaari naa kadha,naa perutho chusi chaala exciting gaa undi...❤❤

*****
Sudheer Kaspa

ఈ పుస్తకం కోసం మీరు చేస్తున్న కృషికి హ్యాట్సాఫ్ మేడమ్. ఇప్పుడే  సర్టిఫికెట్స్ మరియు వీడియో చూసాను. చాలా గొప్పగా ఉన్నాయి. ఇందులో నాకు స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు🙏 

***


ఈ పుస్తకాన్ని దిగువ లింక్ లో కొనుగోలు చెయ్యండి.

No comments:

Post a Comment

Pages