గణేశిని..! - అచ్చంగా తెలుగు

గణేశిని..!

Share This
'గణేశిని..!'
పి.వి.ఎల్.సుజాత 



వినాయకుడ్ని మనము రకరకాల రూపాల్లో మనం చూశాము. కానీ, స్త్రీ రూపంలో వినాయకుడిని చూడ్డం వింతగా, కొత్తగా అనిపిస్తుంది కదా! ఈ స్త్రీ రూప వినాయకుడిని మనం సుచీoద్ర క్షేత్రంలో దర్శించుకోవచ్చు.

స్త్రీ రూప వినాయకుడిని "గణేశిని", " "వ్యాఘ్రపాద వినాయక" ''వినాయకి'' అని మూడు పేర్లు ఉన్నాయి. తలభాగం ఏనుగు వలే, శరీరభాగం మెడనుంచి నడుము భాగం వరకు స్త్రీ మూర్తి వలే, నడుము నుంచి పాదాల వరకు పులి పాదాలవలె కనబడతాయి. వినాయకుడు స్త్రీ రూపంగా మారడం వెనుక  కథ ఉంది.
అంధక అనే రాక్షసుడుండేవాడు. ఆ రాక్షసుడికి మహా దేవత అయిన 'పార్వతీదేవిని' భార్యగా పొందాలనే కోరికుండేది. అందుకు ఆమెను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, పార్వతి తన భర్తయిన శివుడిని ప్రార్థించగా, వెనువెంటనే శివుడు ఉగ్రనేత్రుడై ఆ రాక్షసుడ్ని చంపేశాడు. కానీ, ఆ అంధకాసురునికి మాయ శక్తి ఉంది. అతని శరీరం నుండి నేలను తాకిన ప్రతి రక్తపు బొట్టు మరొక అంధకాసురుడిలా మారిపోయింది. శివుడు తన త్రిశూలాన్ని ఉపయోగించినప్పుడు ఆ రక్తపు బొట్టు నేలను తాకకుండా అతనిని చంపటానికి ఏకైక మార్గం ఏమిటా అని ఆలోచించారు శివ పార్వతులు. దైవత్వం ఉన్న ప్రతివారు ఆడా- మగ ప్రతిరూపాలు మిశ్రమమని, అందులో మగవాడు మానసిక దృఢత్వానికి ప్రతీక అయితే ఆడది భౌతిక వనరుల శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుందని పార్వతికి తెలుసు! అందుకే అన్ని శక్తులకు మూలం పార్వతి దేవి అని కొనియాడుతారంతా. ఆమె అభ్యర్థన పై, దైవత్వం కలిగిన ప్రతిఒక్కరూ అంధకాసురుడి రక్తం నేలపై పడకుండా ఆ రక్తాన్ని తాగడం కోసం వారిలో ఉన్న శక్తిని విడుదల చేశారు. తర్వాత, ఆ యుద్ధ భూమి పూర్తిగా దేవతలతో నిండిపోయింది. ఇంద్రుని శక్తిగా 'ఇంద్రాణి ', విష్ణువు శక్తిగా 'వైష్ణవి', బ్రహ్మ శక్తి 'బ్రాహ్మణి' గా ఉద్భవించారు. ఆ శక్తులన్నీ కలిసి అంధకాసురుడి రక్తం నేలను తాకకముందే త్రాగి, అంధకాసురుడ్ని పూర్తిగా హతమార్చడమైనది. మత్స్య పురాణం విష్ణు ధర్మోత్తర పురాణాల్లో వున్న ''మహిళా యోధుల దేవతల'' జాబితాలో వినాయకుడి శక్తికూడా మిళితమై ఉంది. అందుకే ఆ శక్తికి 'వినాయకి' 'గణేశ్వరి 'అని అంటారు. స్త్రీ రూపంలో దర్శనమిచ్చే గణేషుడు' వానా దుర్గ ఉపనిషత్తు'గా పూజింపబడుతున్నాడు. 

                                                         *****

No comments:

Post a Comment

Pages