లాక్ డౌన్ లో ఆందోళన చెందుతున్నారా? - అచ్చంగా తెలుగు

లాక్ డౌన్ లో ఆందోళన చెందుతున్నారా?

Share This

లాక్ డౌన్ లో ఆందోళన చెందుతున్నారా?
బి.వి.సత్యనగేష్ 
9849064614సంతోషం, దుఃఖం అనే మానసికస్థితులను నిర్ణయించేది - మన ఆలోచనా తీరు. పరిస్థితులకు మనం స్పందించే తీరు మన మానసికస్థితులను నిర్దేశిస్తుంది. కొంతమంది కొన్నింటికి అస్సలు స్పందించరు . కొందరైతే అన్నింటికి స్పందిస్తారు . స్థితప్రజ్ఞులు దేనికి స్పందించరు.

            కొన్ని పరిస్థితులు మన చేతిలో వుండవు . ఉదాహరణకు . .. తుఫాన్, ఎండ తీవ్రత, ట్రాఫిక్ జామ్, ధరల పెరుగుదల లాంటివన్న మాట . ప్రస్తుతం 'కరోనా' అలాంటిదే. అయితే లాక్ డౌన్ నిబంధనలను పాటించడం పెద్ద కష్టమేం కాదు, అందోళన చెందకుండా ఏం చేద్దాం అనే విషయాన్ని పరిశీలిద్దాం.

·        బలంగా వున్నవాడిని బలహీనుడు ఏమీ చెయ్యలేడు. అందుకని మనం శారీరకంగా, మానసికంగా చాలా బలంగా వుండాలి. కరోనా గురించి మీకు సోషల్ మీడియా వచ్చే సమాచారాన్ని ఆదేపనిగా తెలుసుకుంటూ, ఆలోచిస్తూ, గుర్తుచేసుకుంటూ వుండడం ముందుగా మానాలి. మన అందరిదగ్గర కావాలసిన దాని కంటే ఎక్కువ సమాచారం వుంది . కనుక మనకున్న సమయాన్ని సద్వినయోగపరచుకుంటూ, ఆందోళనకు దూరంగా, ప్రగతికి దగ్గరగా ...... అంటే జీవితంలో ముందంజ వేయడానికి మీరు సమయం, తీరిక లేవంటూ వాయిదా వేసిన పనుల్ని చేపట్టండి.
·        అదేపనిగా కరోనా గురించి ఆలోచించడం మానండి. ఏదో ఒక పనిని చేపట్టండి.
·        భాషపై పట్టు సాధించడానికి ప్రయత్నించండి. కావలనంత సమయం, అవకాశం మీ చెంతనే వుంది. మీ భాషపై మీకు పట్టు వుంటే కొత్త భాషను నేర్చుకోండి.
·        పాటలు పాడడం, సంగీత వాయుద్యం, శాస్త్రయ సంగీతం నేర్చుకోడానికి బోలెడు సమయం, మంచి అవకాశం, “YOUTUBE" పాఠాలు ఉచితంగా దొరుకుతున్నాయి.
·        యోగా నేర్చుకోండి. యోగాలో మేడిటేషన్ ప్రాణాయామం, ఆసనాలు వుంటాయి. సులభంగా నేర్చుకోవచ్చు.
·        లాక్ డౌన్ లో వున్నాం కాని తిండి,తిప్పలు, ఇల్లు,వాకిలి లేకుండా లేముకదా! అందుకు సంతోషిద్దాం! ఇంటర్నెట్, కరెంట్, మంచినీళ్ళు , నిత్యావసరవస్తువులు దొరుకుతున్నందుకు ఎంతో సంతోషిద్దాం.
·        మానసిక ఒత్తిడికి గురి కాకుండా మంచి కార్యకలాపాలు, ఆలోచనలలో సమయాన్ని గడపండి, ఎందుకంటే.... ఒత్తిడికి స్ట్రెస్ హార్మోన్లు విడుదలౌతాయి. వాటి మోతాదు పెరిగితే ఆందోళన పెరుగుతుంది. ఎడతెరపి లేకుండా ఆందోళన చెందుతువుంటే డిప్రెషన్ కు గురయ్యే  అవకాశం వుంటుంది. కనుక ఏదో ఒక మంచి పని, మంచి ఆలోచనలతో  సమయాన్ని గడుపుతూ అభివృద్ధి పథంలోకి నడవండి.
·        సోషల్ డిస్టన్సింగ్ అంటున్నారు కాని మానసికంగా దగ్గరవ్వద్దని ఎవ్వరూ చెప్పుడం లేదు. కనుక చాలా కాలం నుంచి మాట్లాడదామనుకుంటూ, సమయం దొరక్క వాయిదా వేసిన ఫోన్ కాల్స్ ను  చెయ్యండి . హలోచెప్పండి, వాళ్ళు కూడా ఖాళీగానే వున్నారు .
·        పుస్తక పఠనం వల్ల ఎంతో లాభం వుంది. అలవాటు లేదు' అని అనకుండా అలవాటు చేసుకోండి. నిజంగా ఎంలో లాభపడతారు, తృప్తి పడతారు.
·        నమకం, చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం , మంత్ర పుష్పం , ప్రవర చెప్పడం లాంటివి నేర్చుకోడానికి ఇదొక గొప్ప అవకాశం.
·        మీకు నచ్చిన సినిమాలన్నింటిని చూసేయండి, TV లో, YouTube లో  అన్నీ వున్నాయి.
·        చాలా మందికి షేర్లు, మ్యూట్యువల్ ఫండ్స్ , సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (SIP) గురించి అవగాహనవుండదు. వాటి మీద దృష్టి పెట్టి నేర్చుకుంటే ఫైనాన్షియన్ ప్లానింగ్ బాగుంటుంది.
·        జపాన్ దేశంలో ‘5s’ అనే ఒక టెక్నిక్ వాడుకలో వుంది అవి . . I. SORT ( ఏరివేత, వెదకడం), 1. SET IN ORDER. (ఒక క్రమమైన పద్ధతిలో  పెట్టుకోవడం) 3. SHINE (శుభ్రం చేసుకోవడం) 4. STANDARDIZE  (నిర్ణీత ప్రమాణీకరణ చెయ్యడం) 5. SUSTAIN (ఎప్పటికీ అలాగే వుంచుకోవడం).
            లాక్ డౌన్ సమయం లో ఇంటిలోవున్న అన్ని గదుల్లో ఈ టెక్నిక్ ను వాడొచ్చు. అలాగే మన దగ్గర ఉన్నా ఎన్నో రసీదులు, డాక్యుమెంట్స్ వుంటాయి. ఇంటి, స్థలాల డాక్యుమెంట్స్, షేర్లు, ఇంటి సభ్యులందరి ఎడ్యుకేషన్ కు సంబంధించిన సర్టిఫికేట్లు, కరెంటు, టెలిఫోన్, టివి బిల్లులు లాంటి వాటిని ప్రత్యేమైన కవర్స్ లేదా ఫైల్ లో పెట్టుకుంటే బాగుంటుంది. పద్దతిగా వుండడం వలన వాటి గురించి శోధించే పని వుండడు.
·        ప్రమోషన్ గురించి ప్రయత్నించే వారు ఈ లాక్ డౌన్ సమయాన్ని ప్రిపరేషన్ కోసం సద్వినియోగ పరచుకోవచ్చు.
·        రెసిషన్ వచ్చే అవకాశం మెండుగా వుంది. ప్రత్యేక నైపుణ్యాలున్న వారికే  వారికే ఉద్యాగాలుంటాయి. కనుక ప్రత్యేక నైపుణ్యాలను మీ స్వంత చేసుకోడానికి సమయాన్ని ఉపయోగించండి.
·        దురలవాట్లు వున్నవారికి ఇదొక మంచి అవకాశం. దురలవాట్లకు  కావలసిన సామగ్రి దొరకడం లేదు కనుక ఇదే అవకాశంగా తీసుకుని వాటిని శాశ్వతంగా దూరం పెట్టొచ్చు.
·        పిల్లల చదువుల విషయం లో కొంత పరిశీలించే అవకాశం, సమయం దొరుకుతుంది. కనుక వారి పిల్లలు ఎలా చదువుతున్నారు ? ఏఏ సబ్జెక్టుల్లో వాళ్ళు బలంగా వున్నారు? అనే విషయాలను తెలుసుకుని సలహా ఇచ్చి ప్రోత్సహించవచ్చు.
·        ఆధ్యాత్మకంగా జ్ఞాన సంపదను పెంచుకోడానికి మీ మత గ్రంధాలను చదువుకునే అవకాశం, సమయం మెండుగా వున్నాయి .
·        చదరంగం (CHESS ), సుడోకు లాంటి వాటిలో సమయం గడిపితే కాలక్షేపం లో బాటు మెదడుకు పదును పెట్టినట్లు అవుతుంది.
·        పొరపాటున కూడా గతంలని సమస్యలను వెలికి తీసి చర్చలు, వాదోప వాదాలు మొదలెట్టకండి.
·        తప్పులు ఎంచడానికి ప్రయత్నించే సమయం కాదనే స్పహలో వుండండి. ఎందుకంటే పని రోజుల్లో ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ పనిలో పడిపోతారు. లాక్ డౌన్ లో ఎక్కడకి వెళ్ళలేక ఎడమొహం పెడమొహం పరిస్థితి రాకుండా చూసుకోవాలి.
·        ఎప్పుడో ఒకసారి, ఏడాది కొకసారి ఏదో ఒక ఉరు వెళ్ళి ప్రశాంతంగా  గడుపుదామని ప్రణాళికలు వేస్తూ వుంటారు కదా! ఇపుడు ప్రయాణం లేదు, ఖర్చు లేదు, హోటల్ అద్దె లేదు, ఆఫీస్/వ్యాపారం లేదు. ఒక వంట, ఇంటి శుభ్రం పని మాత్రం తప్పదు, కనుక ఈ లాక్ డౌన్   సమయాన్ని చెడుగా ఊహించుకుని ఆందోళన చెందకుండా వుండడానికే ప్రయత్నించండి. లాక్ డౌన్ సమయాన్ని ఉత్పాదకంగా ఉపయోగించుకున్నాను. సద్వినియోగపరచుకున్నాను అనే తృప్తి కలిగేలా ఈ అవకాశాన్ని వాడుకోండి. ఆలస్య మెందుకు? పదండి ముందుకు.
 ***

No comments:

Post a Comment

Pages