అతను - అచ్చంగా తెలుగు
అతను
పారనంది శాంతకుమారిఅతని కాంతిలో కరిగితే 
ఈ బ్రాంతులు మాయమౌతాయని తెలుసు,
ఐనా, అతనిని కోరటం లేదీ మనసు. 

అతని శాంతిలో కదిలితే,
ఈ శోకాలు హేయమౌతాయని తెలుసు, 
ఐనా, అతనిని చేరటం లేదీ వయసు. 

అతని తోడులో నడిస్తే
ఈ నీడలభయం ఉండదని తెలుసు, 
ఐనా,అతనిని అనుసరించటం లేదీతపసు.

అతని చూపులు చిన్మయత్వాన్ని చిందిస్తాయి,
అతని తలపులు తన్మయత్వాన్ని అందిస్తాయి.
అతని నవ్వులు  నలతలను తొలగిస్తాయి,
అతని పిలుపులు వలపులను కలిగిస్తాయి.

అతని చేరువలో చెంచలత్వం 
చెదిరిపోతుందని తెలుసు,
అతనితో బాంధవ్యం ఏర్పడితే భ్రమలన్ని బెదిరిపోతాయని తెలుసు,
అయినా అతనంటే నామనసుకు 
ఎందుకో ఇంత అలుసు,
ఇంకెంత కాలమో ఈ పెళుసు?

***

No comments:

Post a Comment

Pages