అతనంటే నాకిష్టం! - అచ్చంగా తెలుగు
అతనంటే నాకిష్టం!
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. 

అతని రాతలలో అచ్చుతప్పులు దొర్లుతాయి, 
అతని మాటలలో పచ్చిబూతులు మెదులుతాయి ,
అతని చూపులలో ప్రాపంచిక రీతులుదర్శనమిస్తాయి, 
అతని రూపులో అనాకారితనపు ఆనవాళ్ళు స్పర్శనమిస్తాయి, 
ఐనా, అతనంటే నాకెంతో ఇష్టం!
అతని రాతల్లో అచ్చుతప్పులున్నా, 
అతని చేతల్లో చాలాగొప్పలు ఉన్నాయి.
మానవత్వం పరిమళిస్తూఉండే మనసు, 
మంచితనం గూడుకట్టుకొని ఉండే గుండె,
బూతులాడినా నీతిని వదలని నిశ్చయం
అతని సొంతం.
అతని చూపుల్లో ప్రాపంచిక రీతులున్నా ,
అతని చిత్తంలో ప్రేమకు ప్రధమస్థానం ఉంది.
అతని రూపులో అనాకారితనం ఉన్నా,
సుగుణాలు అతనితో సంధి చేసుకొని ఉన్నాయి. 
ఇన్నెందుకు,అతనొక- 
విచక్షణ కోల్పోని విలక్షణమైన మనిషనేది స్పష్టం,
అందుకే అతనంటే నాకు ఇష్టం.
     ***

No comments:

Post a Comment

Pages