సరోగసీ.... స్వర్గాదపీ గరీయసీ || - అచ్చంగా తెలుగు

సరోగసీ.... స్వర్గాదపీ గరీయసీ ||

Share This
సరోగసీ.... స్వర్గాదపీ గరీయసీ ||
 -సుజాత.పి.వి.ఎల్. 


వికృతైన ప్రకృతికి సాక్షులెవరు?
కాసుల వేటలో తిరకాసు దందా
నిరుపేద మహిళల జీవితాలకు
ఆర్ధిక వెలుగులు చూపిస్తున్నాయని
సరిపెట్టుకుంటే ఎలా..?
పెళ్ళితో పనే లేదు
నవమాసాలు మోసి కనిచ్చిన
బిడ్డని కళ్ళతో చూసే వీలేలేదు..!!
కిరాయి ఎరవేసి గర్భాన్ని పరాయి
చేసే దళారుల దందా
ఎవరి జేబు నింపుతోంది..?
ఎవరి కడుపు పండుతోంది...?
అగ్రిమెంట్‌ పేరుతో
ఆశగానో, అమాయకంగా
బలైపోతున్న అబలలు
బిడ్డలని కనిచ్చే యంత్రాలుగా
మారి బతుకుతున్నారు!
కడుపు తీపెరుగని
కన్న తల్లులను కంటున్న
"సరోగసీ.... స్వర్గాదపీ గరీయసీ"...!!
 ***

No comments:

Post a Comment

Pages