కవిత ఆగి పోతుంది 
పారనంది శాంతకుమారి 
సరైనభావం వచ్చేవరకు హృదయం వదలదు. 
భాష నచ్చేవరకు కలం కదలదు. 
అంతర్మధనం జరిగేవరకు జీవం మెదలదు. 
అధ్బుతకథనం దొరికేవరకు సఖ్యం కుదరదు. 
ఒకొక్కసారి ఒక్కక్షణంలోనే ఇదంతా జరిగిపోతుంది. 
భాష ఎదిగిపోతుంది, భావం అందులో ఒదిగిపోతుంది. 
జీవం కరిగిపోతుంది, సఖ్యం కుదిరిపోతుంది. 
ఒక్కొకసారి మాత్రం ఈ కవితాసూత్రం దొరకదు. 
క్షణమొక యుగంలా సాగుతుంది. 
భావం దొరకక చిత్తం రేగుతుంది, భాష జావకారుతుంది, 
భావం భేషజాన్ని కోరుతుంది, జీవం జరిగిపోతుంది. 
సఖ్యం ససేమిరా అంటుంది, కవిత ఆగిపోతుంది. 
***
పారనంది శాంతకుమారి
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment