బతుకమ్మ సంబరం - అచ్చంగా తెలుగు
తెలంగాణా ప్రత్యేక పర్వం 'బతుకమ్మ 'సంబరం'
 -సుజాత. పి.వి. ఎల్


బాల భానుడితోడ

బాలబాలికలంతా

పొద్దుపొద్దునే లేచి

ముద్దు ముచ్చటల తోటి

పూల బుట్టలు నింపి

భక్తి శ్రద్ధలతో నిలిపె

బంగారు బతుకమ్మని..

బతుకమ్మ అనిన

బతుకు నిండు నూరేళ్ళని

సకల సౌభాగ్య లక్ష్మియని

కలిమి బలిమి నిచ్చు

కల్పవల్లియని

పొంగారు సంబరముల

బంగారు బతుకనిచ్చె

బతుకమ్మ తల్లి బంగారుయని

నదులు, చెరువుల చెంత

ముదితలందరు జేరి

ముదముతో పాడిరి

ముచ్చటైన పాటలు..

సద్దుల బతుకమ్మ

మురిపాలవెల్లియని

కలగలిపి జేసిరి నృత్యగానాలు

తంగేడు, రుద్రాక్ష, గోరింట, గునుగు,

చెంగల్వ, చేమంతి, బంగారు రంగు

బంతి, బొండు పూలతో

సింగారించి మురిసితిరి

బొడ్డెమ్మని చూసి

ముగ్ధమోహనంతో..

ఆయురారోగ్యములను,

అష్టైశ్వర్యములను, పసుపు కుంకుమలతో

సిరిసంపదలనిచ్చి

సల్లంగ చూడమని

నియమముగా పూజించి

వేడుకొనిరి పడతులు

పసుపు గౌరమ్మని..

పేద సాధలని

బేధ భావము లేక

ఐకమత్యముతో కూడి

పేర్చిరందరు పూలు..

భోగభాగ్యములు కన్నా

కలిసి ఉండుట మేలని

కూర్చి ఇచ్చిరి మగువలు

శాంతి సందేశము..

ఇది తెలంగాణా ప్రత్యేక పర్వం!

సమైక్య కుటుంబానికి నిదర్శనం!!

******


No comments:

Post a Comment

Pages