ముంబయిలో సాంస్కృతిక వేడుకలు - అచ్చంగా తెలుగు

ముంబయిలో సాంస్కృతిక వేడుకలు

Share This
ముంబయిలో సాంస్కృతిక వేడుకలు 
ఓరుగంటి సుబ్రహ్మణ్యం 

దాదర్ లోని ఆంధ్రమహాసభ అండ్ జింఖానా ఆధ్వర్యంలో తేది 27.6.2019 సాయంత్రం సాంస్క్రుతిక  కార్యక్రమాలు జరిగాయి. నల్గొండ జిల్లాకు చెందిన సాన్వి కళానిలయం బృందంచే  జానపదనృత్యాలు సభికులను అలరించాయి.
మహాసభ అధ్యక్షులు సంకు సుధాకర్ సభనుద్దేశించి... తొంభై  వసంతాల ఆంధ్రమహాసభ పూర్వవైభాన్ని కాపాడుతూ సాహితీ సాంస్క్రుతిక వేడుకలతో తెలుగు భాషాభివ్రుద్దికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని వక్కాణించారు.  సభ అధ్యక్షులు సంకు సుధాకర్ ఇతర కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథి భాజపా కార్పోరేటర్ నేహాల్ షా ను పుష్పగుచ్చం శాలువాతో సత్కరించారు. తొమ్మిది దశాబ్దాల చరిత్రగల ఆంధ్రమహాసభ సేవలను కొనియాడుతూ, భావి కార్యక్రమాలకు తనవంతు సహకారన్ని అందిస్తానని ముఖ్య అతిథి పలికారు. 
వందన సమర్పణతో ఈ కార్యక్రమాన్ని ముగించారు.  

No comments:

Post a Comment

Pages