కళ - అచ్చంగా తెలుగు
కళ
ప్రతాప వెంకట సుబ్బారాయుడు 


నాలుగు వాన చుక్కలు పడ్డాయో లేదో
ప్రకృతి పచ్చదనాన్ని అలుముకుని 
రంగుల పూల నవ్వులని నజరానాగా ఇచ్చింది
చెరువులు, నదులు జలకళతో
చూపరుల కళ్లని కట్టేసి
మీ దాహార్తిని తీర్చే భరోసా మాదంటున్నాయి
అవెప్పుడూ అంతే
సహాయం చేయడానికే పుట్టాయి..కట్టుబడి ఉన్నాయి
మనుషులే
ఎన్ని రుతువులు మారినా తను మారడు
స్వార్థాన్ని వీడడు..అయినా
నాలుగు చెట్ల మధ్య ఇల్లుంటే బావుంటుంది గాని
నాలుగిళ్ల మధ్య చెట్టుంటే కళెక్కడిది?
***

No comments:

Post a Comment

Pages